ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా

దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హాయ్ రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుములో దాగుంది నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హాయ్ రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై
నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయమా ఏది తేల్చని హృదయమా ఏమో బిడియమోనని నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా.. ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా