ఉ: పూత మెఱుంగులుం బసరు పూప బెడంగులు జూపునట్టి వా కైతలు? జగ్గు నిగ్గు నెనగావలె గమ్మన గమ్మనన్వలెన్ రాతిరియున్ బవల్ మఱపురానిహొయల్ చెలి యారజంపు ని ద్దాతరితీపులో యనగ దారసిలన్వలె లో దలంచినన్ బాతిగ బైకొనన్ వలెను బైదలికుత్తుకలోనిపల్లటీ కూత లనన్వలెన్ సొగసు కోర్కులు రావలె నాలకించినన్ జేతికొలంది గౌగిటనుజేర్చినకన్నియ చిన్నిపొన్ని మే ల్మూతలచన్నుదోయివలె ముచ్చట గావలె బట్టి జూచినన్ డాతొడనున్న మిన్నులమిటారపుముద్దులగుమ్మ కమ్మనౌ వాతెఱ దొండపండువలె వాచవిగావలె బంటనూదినన్ గాతల దమ్మిచూలిదొర కైవసపుంజవరాలి సిబ్బెపు న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బర పుబ్బగుగబ్బిగుబ్బపొం బూతలనున్నకాయసరిపోడిమి కిన్నెర మెట్లబంతి సం గాతపు సన్నతంతి బయకారపు గన్నడగౌళపంతుకా సాతతతానతానలపసన్ దివుటాడెడు గోటమీటుబల్ మ్రోతలునుంబలెన్ హరువు మొల్లము గావలె నచ్చ తెన్గు లీ రీతిగ, సంస్కృతంబు పచరించెడుపట్టున భారతీవధూ టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ భౌతికనాటక ప్రకరభారతభారతసమ్మతప్రభా శీత నగాత్మజా గిరిజ శేఖర శీతమయూఖ రేఖికా పాతసుధా ప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ జాతకతాళయుగ్మ లయసంగతి చుంచువిపంచికామృదం గాతతతేహితత్తహితహాధితధంధణుధాణుధింధిమి వ...
పోస్ట్‌లు
మే, 2025లోని పోస్ట్‌లను చూపుతోంది
Jinguchaa | Thug Life (Telugu) | Kamal Haasan జింగెచా జింగె జింగెచా telugu lyrics
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
జింగెచా జింగె జింగెచా ఎంత సుందరముగుందే ఇంకా సుందరమయ్యేగా ఇంత సక్కని కన్నియనే చేద్దాం పెళ్లి కూనగా యెహే కట్టె పొయ్యితో ఇంకా కలప చేర్చిగా మరియాద సిరి పరిహాసం మూకిడిలో చేర్చి వండిక జింగెచా జింగె జింగెచా పందిరై ఈశాన్యమూల.. జింగెచా జింగె జింగెచా పట్టమ్మా పళ్ళం పూడుచు.. జింగెచా జింగె జింగెచా కుంకుమ పసుపు జోడించు జింగెచా జింగె జింగెచా మంగళము మంగళమనచ్చు అయ్యకు కనులకే ముత్యపు మూటది కొడుకునిలా తనకే ముడిపెడుతూ ఉన్నానే తూర్పు సొరగుమునే తెచ్చిపెట్టమనలేదే చేరువ సూర్యుడినే అడిగినాదే గృహలక్ష్మి జింగెచా జింగె జింగెచా పొరపాటున పెద్దలంతా జింగెచా జింగె జింగెచా సంబంధం చేయలేదో జింగెచా జింగె జింగెచా తనకు తానే ముడిగా జింగెచా జింగె జింగెచా పందిరై ఈశాన్యమూల.. జింగెచా జింగె జింగెచా పట్టమ్మా పళ్ళం పూడుచు.. జింగెచా జింగె జింగెచా కుంకుమ పసుపు జోడించు జింగెచా జింగె జింగెచా మంగళము మంగళమనచ్చు...