పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2) ॥ పాడవేల ॥ చరణం : 1 ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... ॥ ఈ వసంత॥ జీవితమే పులకించగ... జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధికా... చరణం : 2 గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి (2) ఏ మూలనో పొంచి పొంచి... ఏ మూలనో పొంచి పొంచి వినుచున్నాడని యెంచి పాడవేల రాధికా... చరణం : 3 వేణుగానలోలుడు నీ వీణామృదురవము వినీ (2) ప్రియమారగ నినుచేరగ దయచేసెడి శుభవేళ ॥ పాడవేల ॥
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి