శివా శివా శంకరా సాంగ్ లిరిక్స్

తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్యా మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయ గంతలు తీయ్యా మన్ను మిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు ఉన్న నిన్ను లెవ్వనుకుంటా మిడిసిపడితినింతవరకు నీ దయని విభూదిగా పుయ్యరా నా ఒంటికి నన్నింకొక నందిగా ముడేయ్యి నీ గాటికి ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా స్వర్ణముఖీ తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా దారెంట … కొమ్మలు శివ శూలాలే మబ్బుల్లో… గీతలు నీ నామాలే లోకమంతా నాకు శివమయమే యాడ చూడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్ల గాలులే… ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయెరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయ్యను పేరుకు పెనవేసుకుంటిరా…. శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధరా ఓ.. కొండ వాగు నీళ్లు నీకు లాలపోయానా.. అడివి మల్లె పూలదండ అలంకరించనా నా ఇంటి… చంటి బిడ్డవు నువ్వు ముపొద్దు… నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసమిదే నీకు తెచ్చినా ఓ శివయ్య .. ఇప్ప తేనే ఉంది విందు చేయనా నిన్ను సాకుతా కొనసాగుతలే బతుకు పొడుగునా… ఆ ఎండకు జడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మంచుకు విల విల ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడ చెలిగాడు నేనేరా…. కాస్త ముందు కనపడుంటే కాడుమల్లయ్య ఆస్తిపాస్తులన్నీ నీవి కరిగిపోతాయా ఏమైనా… నీకు న్యాయంగుందా ఈ పైనా.. నిన్ను వదిలేదుందా ఎట్టగట్టనో తల తిరిగి మొగసిన తపమంతా కరిగి శివయ్య నీ సిగముడిలో సింకుకుంటిరా… పొమ్మని ఇదిలించినా.. కసురుతూ కరిగించినా శులముతో పొడిచినా.. పాములు కరిపించినా నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా… శివ శివ శంకర సాంబ శివ శంకర హరోం హర హరహర నీలకంధర హరహర హరహర హరహర హరహర హరనే శివనే హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర హర హర శంకర శివా శివా శంకర శంకర శంకర శివా శివా శంకర శంకర… శివా శంకర శివా…. శివా….❕

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల