మాడుగుల నాగ ఫణి శర్మ గారి ఉత్పల మాలిక

అమ్మ ను నమ్ముకొంటి నహమ్ము నిహమ్మును మాని పూనికన్
అమ్మల గన్న యట్టి ముగురమ్మల మూలపు టమ్మనున్, సు గీ
తమ్ముల, సత్కవిత్వముల ధార లుదారత నుగ్గు పాలు గా
గొమ్మని పోసినట్టి రస ఘూర్ణ వితీర్ణ సువర్ణ వర్ణ యౌ (మా అమ్మ ను నమ్ముకొంటి)
ఇమ్మహనీయ భారముల నేనిక మోయ గ లేనటంచు కం
ఠమ్మున కచ్చపి న్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యా
జమ్మున సుస్వరావళిన్ సిధ్ధము చేసిన యట్టిదైన (మా అమ్మ ను నమ్ముకొంటి)
సమ్మిళితార్ద్ర భావ వచసా మనసా పదే పదే
రమ్మని చేర బిల్చియు శిరమ్ము నురమ్మున జేర్చునట్టి (మా అమ్మనునమ్ముకొంటి)
అమ్మను యమ్మనంచు హృదయమ్మున నమ్మిన సత్య దీక్ష తో
సొమ్ములు గిమ్ములన్ గొనక, చొక్కి శరీరము పాయకుండ, యే
సమ్మెట పోటుల్ం బడక సద్గతి శ్రీ హరి భక్తి తత్త్వ రా
జ్యమ్మున రాజ రాజుగ తుషార పటీర మరాళ కీర్తి యై
కొమ్ముల క్రుమ్ము గిత్త లను కోలను బట్టి పొలాల సౌరు లో
దుమ్ములు, ధూళి బూసికొని దుక్కిట దున్నుట చే జనించు లే
చెమ్మట ధారలే కవన చిత్రణ మందున సార ధారలంచు
అమ్మునిముఖ్య సన్నిభుడ, హంకృతి దూరుడు,నార్ద్ర చిత్తు డౌ
బమ్మెర పోతరాజ కవిభాగవతంబు జగత్శుభార్ధమై ,
క్రమ్మిన కారు చీకటుల కాలము నందున మానవాళికిన్
చిమ్మిన లేత వెన్నెలల శీత మయూఖుని రేఖ వోలె, యే
యమ్మను నమ్మి చేసె, ననయమ్ము, నయమ్ము ప్రియమ్ము మీర, యా
అమ్మను నమ్ముకొంటి ని, మహాజనులార గ్రహింపు డీ సభన్.!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా