Amma Song - Lyric OKE OKA JEEVITHAM

 అమ్మా.. వినమ్మా..

నేనానాటి నీ లాలి పదాన్నే.. ఓ.. అవునమ్మా.. నేనేనమ్మా.. నువ్వేనాడో కని పెంచిన స్వరాన్నే.. మౌనమై ఇన్నాళ్ళు.. నిదర లోనే ఉన్నా గానమై ఈనాడే.. మేలుకున్నా నీ పాదాలకు మువ్వల్లా.. నా అడుగులు సాగాలమ్మా.. నీ పెదవుల చిరునవ్వుల్లా.. నా ఊపిరి వెలగాలమ్మా.. నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెన్నాళ్ళకి.. నిన్నొదిలి ఎంతగా ఎదగాలనుకోనే.. అమ్మా.. అణువణువణువు నీ కొలువే.. అమ్మా.. ఎద సడి లో శ్రుతిలయలు నువ్వే.. అమ్మా.. నే కొలిచే శారదవే.. నన్ను నిత్యం నడిపే సారథివే.. బెదురు పోవాలంటే.. నువ్వు కనిపించాలి.. నిదర రావాలంటే.. కథలు వినిపించాలి.. ఆకలయ్యిందంటే.. నువ్వే తినిపించాలి.. ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా.. నువ్వుంటూనే నేను.. నువ్వంటే నేను.. అనుకోలేకపోతే ఏమైపోతాను.. నీ కడచూపే నన్ను.. కాస్తూ ఉండక.. తడబడి పడిపోనా చెప్పమ్మా.. మరి మరి నన్ను నువ్వు మురిపెము గా.. చూస్తూ ఉంటే చాలమ్మా.. పరిపరి విధముల గెలుపులు గా.. పైకెదుగుతూ ఉంటానమ్మా.. అయినా సరే ఏనాటికి.. ఉంటాను నీ పాపాయినై.. నిన్నొదిలి ఎంతగా ఎదగాలనుకోనే..
నిరంతరం నీ చంటి పాపల్లే.. ఉండాలి నేనెన్నాళ్ళకి.. ||3||

నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా.. అణువణువణువు నీ కొలువే అమ్మా.. ఎద సడి లో శ్రుతిలయలు నువ్వే అమ్మా.. నే కొలిచే శారదవే.. నన్ను నిత్యం నడిపే సారథివే.. అమ్మా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana