Keeravaani song lyrics film by Anveshana

సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద సా ని స రి సా ని సా ని స మ గా మ రి ప ద స స స ని రి రి రి స గ గ గ రి మ మ మ గ పా సా ని ద ప మ గ రి స ని
కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా గ రి స ప మ గ పా ని స రి గ రి గ స నీ ప ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా నీ గగనాలలో నే చిరుతారనై ... నీ అధరాలలో నే చిరునవ్వునై స్వరమే లయగా ముగిసే సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల అలికిడి ఎరుగని పిలుపుల అలిగిన మంజులవాణీ కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా నీ కన్నుల నీలమై ... నీ నవ్వుల వెన్నెలై సంపెంగల గాలినై తారాడనా నీడనై నీ కవనాలలో నే తొలిప్రాసనై నీ జవనాలలో జాజులవాసనై యదలో యదలే కదిలే పడుచుల మనసుల పంజరసుఖముల పలుకులు తెలియకనే కీరవాణి చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనేలు చల్లగ అలరులు కురిసిన ఋతువుల తడిసిన మధురసవాణి కీరవాణి చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల