మనసున కొలువై మమతల నెలవై
మెరిసే తారలదేరూపం విరిసే పువ్వులదేరూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం || మనసున || . ||చ|| |అతడు| ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెతుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత రూపం ...