వీరా రాజ వీర శూరా ధీర శూర ps2 song

 కళ్ళారా చూద్దాం

చోళ ఖడ్గ సంచారం,సంహారం ఓ సోగసరి పువ్వా పూమాలే శుభమని వేయవే వీరా రాజ వీర శూరా ధీర శూర నువ్వే శుభ్రతార నీలో శౌర్యధార ఏరై పొంగిపార సమరం శ్రుతించెయిరా శిఖరం స్పృశించెయిరా మారా రాకుమారా చోరా చిత్త చోర రారా ఏలుకోర కరవాలమీవేల కనులెర్రజేయంగ భుజబలము ఈ వేళ భూతలము మోయంగ ద్ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజా సూర్య తేజ వీరా రాజ వీర శూరా ధీర శూర పడతులు పాటపాడ మునితలు నాట్యమాడ తేరులు స్వాగతించ బేరులు ప్రతిధ్వనించ సంద్రాల సుడిలోన బడబానలము లాగ భుగ భుగ కదిలినావ ధగ ధగ ఎదిగినావ కలనే గెలిచినావ నిజమై నిలిచినావ విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీరా రాజ వీర శూరా ధీర శూర ఆ....... పడతులు పాటపాడ మునితలు నాట్యమాడ తేరులు స్వాగతించ బేరులు ప్రతిధ్వనించ సంద్రాల సుడిలోన బడబానలము లాగ భుగ భుగ కదిలినావ ధగ ధగ ఎదిగినావ కలనే గెలిచినావ నిజమై నిలిచినావ విక్రమ వజ్రనావ నావికుడైన వీర వీరా రాజ వీర శూరా ధీర శూర సుడిగాడ్పులా అడుగేయరా సర సర సర సర శరమే తనువే తాకగ చర చర చర చర చెలరేగాలి వేగంగ మగసిరి ఖండచూసి కడలికి చెమట పోయు పదునగు కత్తి చూసి నింగికి నిదుర రాదు రగతము పొంగి పారి నదులకు రంగు మారు తెగిపడు తలలు అన్ని అలలకు అన్నమౌను పులివలె దూకుతుంటె జగములు జింకలౌను నిన్నిక పొగడమంటె భాషకు శ్వాస ఆగు విధిగా తెగించెయిరా విధినే వరించెయిరా విలయం ధరించెయిరా విజయం వరించెయిరా వీరా రాజ వీర శూరా ధీర శూర నువ్వే శుభ్రతార నీలో శౌర్యధార ఏరై పొంగిపార సమరం శ్రుతించెయిరా శిఖరం స్పృశించెయిరా మారా రాకుమారా చోరా చిత్త చోర ద్ధైర్యము మోహరింప రాజ్యము విస్తరింప రాజా శ్రేష్ఠ రాజ తేజా సూర్య తేజ వీరా రాజ వీర వీరా రాజ వీర శూరా ధీర శూర వీరా... చిత్రం :- పోన్నియన్ సెల్వం సంగీతం :- A R Rahman సాహిత్యం :- చంద్రబోస్ దర్శకత్వం :- మణిరత్నం
తక్కువ చూపు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana