పోస్ట్‌లు

జూన్, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది
 ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణధురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు.... అతడొక చారిత్రక పురుషుడు...  సోమనాద్రి (చారిత్రక వీరగాథ) అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం. శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి 'పెద్ద సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ.1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు ఈయన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయా పొందినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను అభివృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను ఇచ్చిన కళాభిమాని. గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామ...