మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి
రాగం చక్రవాకం
మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి
లోక పాలకుడు హరిహర తనయుడు
నా సర్వస్వం అయ్యప్ప, స్వామీ అయ్యప్ప
పీతవసనాలు మేన ధరించి - సూర్య తూణీరం చేత గ్రహించి
మృగయా వినోదాన ఇలు వెడలిన స్వామి,
ఈ పేద మదిలోకి కొలువొచ్చెను!
నాలో నెలకొన్న చీకటి తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించెను
నను, ముముక్షువు కాగా దీవించెను
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి