శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ

 

 రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స 


శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ 

మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా 

యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ 

నటనాంజలితో బ్రతుకును తరించనీవా


పరుగాపక పయనించవె తలపుల నావ 

కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ 

ఎదురించిన సుడిగాలిని జయించినావా 

మదికోరిన మధుసీమలు వరించి రావా


పడమర పడగలపై మెరిసే తారలకై 

రాత్రిని వరించకే సంధ్యా సుందరి

తూరుపు వేదికపై వేకువ నర్తకివై 

ధాత్రిని మురిపించే కాంతులు చిందని 

నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ 

నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ


తనవేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా 

ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా

అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా 

ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా 

ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా 

వెన్నెల కిన్నెర గానం నీకుతోడుగా


చలిత చరణ జనితం నీ సహజ విలాసం 

జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం 

నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం 

గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణకమలం


శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ | 

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల