మబ్బులోన వాన విల్లులా... మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా.. దాగినావుగా !! అందమైన ఆశతీరకా.. కాల్చుతుంది కొంటె కోరికా.. ప్రేమ పిచ్చి పెంచడానికా..? చంపడానికా? కోరుకున్న ప్రేయసివే.. దూరమైన ఊర్వశివే.. జాలి లేని రాక్షసివే.. గుండెలోని నా కసివే.. చేపకళ్ళ రూపసివే.. చిత్రమైన తాపసివే.. చీకటింట నా శశివే.. సరసకు చెలి చెలి రా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. అన్నాగా.. ఎలా విడిచి బ్రతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. కళ్ళారా.. నిన్నే తలచి తలచి ఇలా.. ఉన్నాగా.. నువ్వే ఎద సడివే.. మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా.. గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా!! అందమైన ఆశతీరక.. కాల్చుతుంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా ? చంపడానికా? చిన్నాదానా.. ఓసి అందాల మైనా మాయగా మనసు జారిపడిపోయెనే తపనతో నీ వెంటే తిరిగెనే నీ పేరే పలికెనే నీ లాగే కులికెనే నిన్ను చేరగా.. ఎన్నాలైనా అవి ఎన్నేళ్ళు అయినా వందేళ్లు అయినా.. వేచి ఉంటాను నిన్ను చూడగా గండాలైనా సుడి గుండాలు అయినా.. ఉంటానిలా నేను నీకే తోడుగా.. ఓ.. ప్రేమా మనం కలిసి ఒకటిగా.. ఉందామా ఏదో ఎడతెగనీ.. హంగామా ఎలా విడిచి బతకనే పిల్లా.. రా.. నువ్వే కనబడవా.. అయ్యో రామ.. ఓసి వయ్యారి భామ.. నీ ఒక మరపురాని మృదుభావమే కిల కిల నీ నవ్వుతలుకులే నీ కల్ల మెరుపులే కవ్విస్తూ కనపడే గుండెలోతులో.. ఏం చేస్తున్నా.. నేను ఏ చోట ఉన్నా.. చూస్తూనే ఉన్నా.. కోటి స్వప్నాల ప్రేమ రూపము. గుండె కోసి నిన్ను అందులోదాచి పూజించనా.. రక్త మందారాలతో.. కాలాన్నే.. మనం తిరిగి వెనకకే తోద్దామా మళ్లీ మన కథనే.. రాద్దామా ఎల్లా విడిచి బ్రతకనే పిల్లా రా.. నువ్వే కనబడవా?

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana