నువ్వంటే నా నవ్వు నేనంటేనే నువ్వు
నువ్వంటు నేనంటు లేమని
అవునంటు మాటివ్వు నిజమంటునే నువ్వు
నే రాని దూరాలే నువు పోనని
ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక
దగ్గరగా రానీను దూరమే
నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు
నిలుచున్నా నీ వైపే చేరేనులే
నీ అడుగేమో పడి నేల గుడి అయినదే
నీ చూపేమో సడి లేని ఉరుమయినదే
నువ్వు ఆకాశం నేను నీకోసం తడిసిపోదామ ఈ వానలో
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే
సూర్యుడితో జతకట్టి ఒకటవుతాయే
నీడల్లో నలుపల్లే మల్లెల్లో తెలుపల్లే
ఈ భువికే వెలుగిచ్చే వరమే ఈ ప్రేమ
నే ఇటు వస్తాననుకోలేదా తలుపస్సలు తియ్యవు తడితే
పో పసివాడని జాలే పడితే బుగ్గన ముద్దిచ్చి చంపేసావే
నువ్వు నేనంటు పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా
మనమంటూ పాడు పెదవుల్లో చూడు
క్షణమైన విడిపోవులే
ఇది ఓ వేదం పద ఋజువవుదాం
అంతులేని ప్రేమకే మనం
నివురు తొలిగేలా నిజము గెలిచేలా
మౌనమే మాట మార్చేసినా
నువు నవ్వేటి కోపానివే
మనసతికినా ఓ రాయివే
నువు కలిసొచ్చే శాపానివే
నీరల్లే మారేటి రూపానివే
నచ్చే దారుల్లో నడిచే నదులైనా
కాదన్నా కలవాలి సంద్రంలోనా
విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా
ప్రవహించే ప్రణయం ఇదే
వద్దన్నా తిరిగేటి భువి మీదొట్టు
నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ
నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటు
ఈ భువిలో విహరించే వెలుగే మన ప్రేమా
జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini
అమ్మా అమ్మా జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని జననీ శివకామిని జయ సుభకారిని విజయ రూపిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల గన్నా అమ్మవు నీవే నీ చరనములే నమ్మితినమ్మ నీ చరనములే నమ్మితినమ్మ శరనము కోరితి అమ్మ భవాని నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నీదరినున్న తొలగు భయాలు నీ దయలున్న కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలచీ నిరతము మాకు నీడగ నిలచీ జయమునీయవే అమ్మా జయమునీయవే అమ్మ భవాని చిత్రం :నర్తనశాల సంగీతం: సముద్రాల సీనియర్ గానం : సుశీల
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి