ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఆరేళ్ళ పాప కోసం | ఆనాడు పాడినా...
అపరంజి బొమ్మ కోసం | ఈనాడు పాడినా...
అభిమానమున్న వాడ్ని | అవమానపరచినా...
యదలోని చీకటంతా | వెన్నెలగ మార్చినా...
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
అనురాగ జీవితాన | పెను గాలి రేగినా...
తన వారు కాన రాక | కను పాప ఏడ్చినా...
కడగళ్ళ బ్రతుకులోన | వడగళ్ళు రాల్చినా...
సుడిగుండమైన నావ | ఏ దరికి చేర్చినా...
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ముసి ముసి నవ్వులలోన | కురిసిన పువ్వుల వాన
ఏ నోము నోచినా | ఏ పూజ చేసినా
తెలిసి ఫలితమొసగే వాడు
బ్రహ్మ ఒక్కడే | పరబ్రహ్మ ఒక్కడే
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి