మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం

 రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స


మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం 

చల్లని గాలులు జిల్లని సోకగ, నడచిపోవాలి


హరితవర్ణ తపోవనం మాకభయ సంకేతం

అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం

హరిహరాత్మజ నీ నివాసం శబరి గిరి శిఖరం

సుకృతమయ్య నిన్ను చూడ పరమ ధన్యులము


 జగతిలోని దర్శన భాగ్యం జనులకానందం

కరుణసాగర డోలల్లో ఊగును మా హృదయం

హరిహరాత్మజ నీవులేక  నిలువలేమయ్యా

ఆలకించి నా మొరలు ఆదుకోగదే


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

మహేశా పాపవినాశా కైలాసవాసా ఈశా