పోస్ట్‌లు

అమ్మ | Amma song

చిత్రం
 "భూతాత్మ! భూతేశ! భూత భావనరూప!-దేవ! మహాదేవ! దేవవంద్య! యీ లోకముల కెల్ల నీశ్వరుండవు నీవ-బంధమోక్షములకుఁ బ్రభుఁడ వీవ; యార్త శరణ్యుండ వగు గురుండవు నిన్నుఁ-గోరి భజింతురు కుశలమతులు; సకల సృష్టిస్థితిసంహారకర్తవై-బ్రహ్మ విష్ణు శివాఖ్యఁ బరఁగు దీవ; పరమ గుహ్య మయిన బ్రహ్మంబు సదసత్త మంబు నీవ శక్తిమయుఁడ వీవ; శబ్దయోని వీవ; జగదంతరాత్మవు నీవ; ప్రాణ మరయ నిఖిలమునకు.

ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి

 రాగం మలయమారుతం స 1రి, గ2, ప, ద2, ని1, స ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి. కూటమి కలిగిన రాశి. ఇంతి చెలువపు రాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కలికి బొమ విండ్లుగల కాంతకును. ధనురాశి మెలయు మినాక్షికిని మీనరాశి కులుకు కుచకుంభముల కొమ్మకును కుంభరాశి వెలగు హరిమధ్యకును సింహరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి కన్నె నీ రాశి కూటమి కలిగిన రాశి ఇంతి చెలువపు రాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి చిన్ని మకరంకపు బయ్యెద చేడెకు మకరరాశి కన్నె ప్రాయపు సతికి... కన్నెరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు తులరాశి వన్నెమైపైడి తులదూగు వనితకు.తులరాశి తిన్నని వాడి గోళ్ళ సతికి...వృశ్చికరాశి ఇన్ని రాసుల యునికి యింతి చెలువపు రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాటల సతికి కర్కాటక రాశి ఆముకొని నొరపుల మెరయు నతివకు వృషభరాశి గామిడి గుట్టుమాట...

మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం

 రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స మకర సంక్రాంతి జ్యోతిని కాంచగ మనసుకు ఆరాటం  చల్లని గాలులు జిల్లని సోకగ, నడచిపోవాలి హరితవర్ణ తపోవనం మాకభయ సంకేతం అఖిల మానవ కళ్యాణానికి శరణమీ నిలయం హరిహరాత్మజ నీ నివాసం శబరి గిరి శిఖరం సుకృతమయ్య నిన్ను చూడ పరమ ధన్యులము  జగతిలోని దర్శన భాగ్యం జనులకానందం కరుణసాగర డోలల్లో ఊగును మా హృదయం హరిహరాత్మజ నీవులేక  నిలువలేమయ్యా ఆలకించి నా మొరలు ఆదుకోగదే

మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి

  రాగం చక్రవాకం మకర దీపమా, నువు సాక్షి శబరి పీఠమా, నువు సాక్షి లోక పాలకుడు హరిహర తనయుడు  నా సర్వస్వం అయ్యప్ప, స్వామీ అయ్యప్ప పీతవసనాలు మేన ధరించి - సూర్య తూణీరం చేత గ్రహించి మృగయా వినోదాన ఇలు వెడలిన స్వామి,  ఈ పేద మదిలోకి కొలువొచ్చెను! నాలో నెలకొన్న చీకటి తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించెను నను, ముముక్షువు కాగా దీవించెను

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ

   రాగం వలజి   స,  గ2, ప, ద2, ని1, స  శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వ  మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా  యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ  నటనాంజలితో బ్రతుకును తరించనీవా పరుగాపక పయనించవె తలపుల నావ  కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ  ఎదురించిన సుడిగాలిని జయించినావా  మదికోరిన మధుసీమలు వరించి రావా పడమర పడగలపై మెరిసే తారలకై  రాత్రిని వరించకే సంధ్యా సుందరి తూరుపు వేదికపై వేకువ నర్తకివై  ధాత్రిని మురిపించే కాంతులు చిందని  నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ  నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ తనవేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా  ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా  ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా  ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా  వెన్నెల కిన్నెర గానం నీకుతోడుగా చలిత చరణ జనితం నీ సహజ విలాసం  జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం  నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం  గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణకమలం శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్ |  స...

raghupathi rajaram song full lyrics

చిత్రం