- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
1. పాండవుల గుణగణాల గురించి కవి ఏమని వర్ణించాడు? ఎందుకు?
కవి పాండవుల గుణగణాలను అత్యంత విశిష్టంగా వర్ణించాడు. ధర్మరాజు ధర్మశాస్త్రాన్ని పాటించే, దయాగుణం, న్యాయం, సత్యం, సహనం, దానం వంటి మహోగుణాలు కలవాడని. అతని పాలన ప్రజలకు శాంతిని, న్యాయాన్ని ఇచ్చే విధంగా ఉందని వర్ణించి చెప్పారు. అర్జునుడు పరాక్రమం కలవాడని, జయంతునితో సాటి లేని అందాన్ని కలిగి, అప్రతిహత వీరుడిగా నిలిచాడని వర్ణించి తెలిపారు పాండవులు ఓర్పు సహనం కలవాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని తెలియజేస్తూ వర్ణించారు వారు చాలా గొప్పవారు కాబట్టి కవి వారిని ఈ విధంగా వర్ణించడం జరిగిందని స్పష్టమవుతుంది.
2. ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు తగినవిధంగా ఉన్నదని భావిస్తున్నారా? ఎందుకు?
అవును, ఈ పాఠానికి “ధర్మార్జునులు" అనే పేరు చాలా తగినదిగా ఉంది. ఎందుకంటే ఈ పాఠంలో ప్రధానంగా ధర్మరాజు (యుధిష్టరుడు) ధర్మతత్వాన్ని పాటించే వాడిగా, అర్జునుడు పరాక్రమవంతుడిగా వర్ణించబడ్డారు. ఒకరు ధర్మానికి ప్రతీకగా, మరొకరు శౌర్యానికి ప్రతీకగా ఉండి, ఈ ఇద్దరి గుణాలు సమ్మేళనంగా ప్రజలకై ఉత్తమ పాలకులుగా నిలిచారు. అందువల్ల “ధర్మార్జునులు" అనే పేరు పూర్తిగా ఈ పాఠ్యాంశానికి న్యాయం చేస్తుంది.
3. 'పాండవులు ఉదారస్వభావులు' సమర్థిస్తూ రాయండి.
పాండవులు సహజంగా ఉదారస్వభావులు. ఎవరి పట్లైనా అసూయ లేకుండా, అందరిని సమానంగా ఆదరించి, యాచకులకు దానం చేయడంలో ఏ ఒక్కరికీ తిరస్కారం ఇవ్వకుండా ఉదారంగా వ్యవహరిస్తారు. వారు సహాయం కోరిన వారిని నిరాశ పరచకుండా సంపూర్ణ సహాయం అందించేవారు. అతి పెద్దవారైనా, చిన్నవారైనా సమానంగా గౌరవించే గుణం కలిగివున్నారు. వారు పండితులకు, ప్రవీణులకు గౌరవం చూపడంలో తక్కువచేసిన సందర్భం లేదు. ఈ కారణాల వల్ల పాండవులు నిజంగా ఉదారస్వభావులు.
4. మంచివారిని ఆదరించి పోషించవలసిన ఆవశ్యకతను గురించి రాయండి.
మంచివారిని ఆదరించడం, పోషించడం సమాజ అభివృద్ధికి అత్యంత అవసరం. మంచివారు ధర్మాన్ని పాటిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలిచేవారు. వారిని ప్రోత్సహించడం వలన మంచి భావాలు సమాజంలో వ్యాపిస్తాయి. మంచి వ్యక్తుల ప్రవర్తనను గౌరవించడం వల్ల మిగిలినవారు కూడా మంచి మార్గాన్ని అనుసరించే ప్రేరణ పొందుతారు. అలాంటి మంచి వారిని విస్మరించకుండా, ప్రోత్సహిస్తూ పోషించడం వల్ల సమాజంలో నీతి, సత్యం, సేవాభావం వంటి విలువలు నిలబడతాయి.
కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) ధర్మరాజు వ్యక్తిత్వాన్ని గురించి మీ సొంతమాటల్లో రాయండి.
ధర్మరాజు వ్యక్తిత్వం అనేది ఆదర్శ రాజునికి తగిన అత్యుత్తమ గుణాలతో నిండినది. అతడు యమధర్మరాజుని వరపుత్రుడిగా, నిజాయితీతో జీవించే వాడిగా, న్యాయాన్ని పాటించే వాడిగా కనిపిస్తాడు. శాంతి, దయ వంటి మానవతావాద గుణాలను ధరించి, తన వాక్చాతుర్యంతో నిజం చెప్పడంలో ప్రత్యేకతను చూపిస్తాడు. అతడు ఎవరి విషయంలోనూ అసూయ చూపడు, ఎవరికీ తక్కువ చేసి మాట్లాడడు, ముఖప్రీతికోసం తప్పుడు మాటలు చెప్పడు.
అతడు దానం చేయడాన్ని ఒక గొప్ప విధిగా భావించి, ఎవరైనా సహాయం అడిగితే వారికి సహాయం చేయడం తన బాధ్యతగా భావించేవాడు. తన యోగ్యతను నిరూపించుకున్నవారిని గౌరవించి, ప్రవీణులైన పండితులకు తగిన పురస్కారాలు ఇచ్చేవాడు. ప్రజల సంపదకు అసూయపడకుండా, వారితో స్నేహపూర్వకంగా ఉండాలని ఆశించేవాడు.
ధర్మరాజు పాలన ధర్మమార్గంలో సాగుతూ, పూర్వపు మహారాజులకన్నా సైతం గొప్పదిగా ప్రజల అభిప్రాయాన్ని పొందింది. అతడు ధర్మబద్ధంగా జీవించి, తన పేరును అన్ని దిక్కులకూ వ్యాపింపజేశాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం కలవాడు ధర్మరాజు, నిజంగా అందరికీ ఆదర్శంగా నిలిచే మహారాజు.
మీకు తెలిసిన మంచిగుణాలు కలిగిన ఒకరిని గురించి 'అభినందన వ్యాసం' రాయండి.
...................... అనే రైతును అభినందిస్తూ అభినందన వ్యాసం
దేశపు ఆకలి తీరుస్తున్న మానవదైవం రైతు – అలాంటి రైతన్న మన ...............గారికి అభినందనలు.
రైతు అంటే ఒక దేవత. భూమిని తల్లిగా భావించి, ఆమె కడుపున పండే ధాన్యాన్ని భగవంతుని ప్రసాదంగా భావించే వాడు. అలాంటి నిరంతర కృషీవలు మన ............... గారు రైతులందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన శ్రమ, శ్రద్ధ, నైపుణ్యం దేశంలోని లక్షలాది మంది రైతులకు ప్రేరణగా నిలుస్తుంది.
కోట్ల రూపాయల విలువగల భవనాలు కట్టినవారు ఉన్నా, ఒక గింజ కూడా పండించలేరు. కానీ .............. గారు తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్న ఎంతో మంది ప్రశంసలు పొందుతున్నారు. ఆధునిక పద్ధతులను, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను సమానంగా ఉపయోగిస్తూ అద్భుతంగా వ్యవసాయం చేస్తున్నారు.
వర్షాభావం, ఎరువుల ధరలు లాంటివి ధైర్యంగా ఎదుర్కొని ఎన్నో సార్లు నష్టాన్ని భరించినా కూడా రైతుగానే నిలవాలని నిర్ణయించుకున్న ............... గారి పట్టుదల, శ్రమకు అభినందనలు తెలియజేయాల్సిందే.
నేలమ్మ నే నమ్ముకొని నిండు మనసుతో వ్యవసాయం చేస్తున్న ఈ అన్నదాత సమాజానికి ఆహారం ఇచ్చే గొప్ప సేవను మౌనంగా చేయడం ఆయన మహోన్నతకు నిదర్శనం. అంతేకాక, ఆయన అనుభవాలను యువరైతులకు పంచుతూ, వ్యవసాయ పద్ధతులు నేర్పుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో మన ,.......... గారిని అభినందించడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఆయన త్యాగానికి, కృషికి, ప్రేమకు, తెలివికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఆయన మార్గాన్ని అనుసరించి మరెందరో రైతులు దేశాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జై కిసాన్! జై ...............
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి