- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
1. ఇతరులు ఆహారం తినేటప్పుడు ఎందుకు విఘ్నం కలిగించకూడదో రాయండి.
ప్రతి జీవికి జీవించేందుకు ఆహారం అవసరం. ఆకలి బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆహారం లేనిదే ప్రాణాలు నిలవవు. ఎవరు ఆహారం తింటున్నారో వారిని అడ్డగించడం, వారిని ఆపడం అనేది వారి ప్రాణాన్ని బాధ పెట్టినట్టే. ధర్మశాస్త్రాల ప్రకారంగానూ పాపకార్యమే. శిబి చక్రవర్తికి ఆశ్రయంగా వచ్చిన పావురాన్ని తినబోయిన డేగను ఆపితే అది బాధపడింది. జీవన అవసరమైన ఆహారానికి విఘాతం కలిగించకపోవడం నిజమైన మానవతా ధర్మం.
2. 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
అవును
అందరూ ధర్మాన్ని ఆచరించాలి'
ధర్మం ఉండడం చాలా మంచిది. ఇతరులకు మంచి చేసేది , పెద్దలు ఆచరించింది ధర్మం. ధర్మం పాటించటం వల్ల నైతికత పెరుగుతుంది, పరస్పర గౌరవం ఏర్పడుతుంది. దుర్మార్గం ఉండదు. లోకం శాంతిగా వుంటుంది. మనం ఎప్పుడూ ధర్మాన్ని నమ్మి, అందరు ధర్మంగా నడచుకోవాలి.
3. ఇతరుల కోసం మనం ఎలాంటి త్యాగాలు చేయవచ్చు?
ఇతరుల అవసరాల కోసం —
-
మన సౌకర్యాలను త్యాగం చేయవచ్చు
-
సమయాన్ని, శ్రమను అర్పించవచ్చు
-
ఆర్థికంగా సహాయం చేయవచ్చు
-
మన ప్రాణాలు ప్రమాదంలో పెట్టి కూడా కాపాడే ధైర్యం చూపవచ్చు (శిబి చేసినట్లు)
-
మన స్వార్ధాన్ని త్యాగం చేసి సమాజం కోసం ఆలోచించవచ్చు
శిబి చేసిన త్యాగం గొప్పది అయితే ప్రతి ఒక్కరూ తగిన విధంగా త్యాగభావనతో ప్రవర్తిస్తే సమాజం మరింత మంచిగా మారుతుంది.
4. 'త్యాగనిరతి' అనే శీర్షిక పాఠానికి ఏవిధంగా తగినదో రాయండి.
‘త్యాగనిరతి’ అంటే త్యాగం చేయడంలో నిరతుడైనవాడు, అంటే త్యాగం చేసేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండేవాడు. ఈ పాఠంలో శిబి చక్రవర్తి తనను ఆశ్రయించిన పావురాన్ని రక్షించేందుకు తన శరీరంలోని మాంసాన్ని కోసి పెట్టి అదీ సరిపోక తానే తక్కెడలో కూర్చొని తన ప్రాణాలను కూడా అర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి త్యాగాన్ని చూసి దేవతలు కూడా మెచ్చారు. కాబట్టి ఈ పాఠంలో ఉన్న ముఖ్య భావం త్యాగమే, అందుకే ‘త్యాగనిరతి’ అనే శీర్షిక చాలా తగినది.
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి