చదువు ప్రశ్న జవాబులు 7వ తరగతి

 

స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేని ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.



1. చదువు నేర్వని వారిని కవి వేటితో పోల్చాడు?

జవాబు:

చదువు నేర్చుకోనివారిని  అందమైన రూపం ఉన్న విద్యా అనే సువాసన లేని మోదుగుపువ్వు లాంటివారు వారు. విద్య లేనివారు భూమిపై తోక, కొమ్ములు లేని ఎద్దులాంటివారు, వంశానికి తెగులు వంటి వారు అని కవి పోల్చాడు

 

2. త్రివిక్రమునికి చదువు పట్ల గల భావాలు ఎలాంటివి?

జవాబు:

త్రివిక్రముడు చదువును అత్యంత ముఖ్యమైన ధనంగా భావించాడు. విద్య ఎవ్వరూ దోచలేని ధనం, అది ఎక్కడికెళ్లినా తోడుంటుంది, మన విలువను పెంచుతుంది. ఎవరికి విద్య నేర్పిన అది కోటి రేట్లు పెరుగుతుందని భావించాడు


3. కమలాకరుని స్వభావం ఎటువంటిది?

జవాబు:

కమలాకరుడు తెలివి తక్కువ వాడు . ఆయనకు ఆశయం లేదు, పట్టుదల లేదు, ఎదగాలనే సంకల్పం లేదు. "కమలాకరం"  జడాశయం వలె ఉంటాడు. తండ్రి నుండి చదువు విశిష్టతను తెలుసుకొని పట్టుదలతో గురువును సేవించి గొప్పగా చదువుకున్న వాడు.


4. చదువు రాకపోతే ఏయే కష్టాలు కలుగుతాయో ఊహించి రాయండి.


చదువు రాకపోతే మనకు మంచి చెడుల మధ్య తేడా తెలియదు. జీవితంలో ఎదగలేము. ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. మన అభిప్రాయాన్ని వ్యక్తపరచలేము. ఉద్యోగాలు దొరకవు. పశువుల వంటివారమవుతాము. ప్రయోజనం లేని జీవితాన్ని గడుపుతాము. సమాజంలో గౌరవం లభించదు. కనుక చదువు మనకు వెలకట్టలేని ధనం.




1. చదువు పాఠ్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి.


         చదువు అనే పాఠ్య భాగం మనకు విద్య విలువను, చదువులో ఉన్న శక్తిని, జీవన మార్గాన్ని చూపిస్తుంది. ఈ కథలో విక్రమార్కుని పురోహితుడు త్రివిక్రముడు. త్రివిక్రముడి కుమారుడు కమలాకరుడు చదువు విషయంలో నిర్లక్ష్యంగా, జడంగా ఉన్నాడని భావించి, అతనిని వ్యంగ్యంగా మందలిస్తాడు.


           తండ్రి మాటలు మొదట కమలాకరునికి బాధ కలిగించినా, అవి అతనికి జీవిత మార్గాన్ని మార్చే ప్రేరణగా మారతాయి. తండ్రి చెప్పినట్లు, చదువులేని వారు ఎంత మంచి రూపం ఉన్నా, ఎంత మంచి వంశంలో పుట్టినా విలువ ఉండదు

           విద్య ఉండకపోతే వారు పశువులవలె జీవించేవారే. కానీ చదువు ఉంటే అది ఎప్పుడు మన వెంట ఉండే ధనంలాంటిది దొంగలు దొంగిలించలేరు, ఎక్కడైనా ఉపయోగపడుతుంది, చదువును ఇతరులకు చెబితే పెరుగుతుంది. వచనకావ్యాలు, పద్యకావ్యాలు చదువాలి. లేదా సంగీత, నాట్య  జ్ఞానాన్ని పొందాలి. లేదా మంచి మాటలు మాట్లాడుతూ పొద్దు గడపాలి. లేదా లోకజ్ఞానమైనా పొందాలి. ఇవి ఏవీ  నేర్చుకోనివారు పశువుల వంటివారే.


        సంగీతం, కవిత్వంలోని సారం, మంచితనం, మనసులోని భావం, సజ్జనుల తోడి స్నేహం వీటిని గ్రహించలేని వారు భూమిపై తోక, కొమ్ములు లేక తిరుగాడే ఎద్దు అని అనవచ్చు. అటువంటివాడు గడ్డిమేయకపోవడం అనేది పశువుల పాలిటి అదృష్టమని చెప్పాలి అన్న

తండ్రి  మాటలకు కమలాకరుడు అభిమానపడ్డాడు. విద్య నేర్చుకొని వివేకియైన తరువాత కాని తండ్రి ముఖం చూడనని మనసులో అనుకున్నాడు. కాశ్మీరదేశంలోని చంద్రకేతుడు అనే ఉత్తమ బ్రాహ్మణ గురువును చేరి సేవ చేశాడు. ఆ పండితుని ద్వారా క్రమంగా నాలుగు వేదాలు, వేదాంగాలు, కావ్యనాటకాలు, దర్శనాలు, నీతిశాస్త్రాలు, సంగీత సాహిత్యకళలు నేర్చుకున్నాడు.


          ఆ తర్వాత గురువుగారి అనుమతితో దేశంలోని విశేషాలు చూడాలని బయలుదేరుతాడు.

      ఈ కథ విద్య యొక్క శక్తిని, తల్లిదండ్రుల యొక్క పాత్రను, విద్యార్థులు ఎలా నడుచుకోవాలో తెలియజేసే గొప్ప పాఠం.




                           తేదీ 16 జూలై, 2025,

                          గ్రామం.                   .



గౌరవనీయులైన గురువు గారికి నమస్కారాలు,

         నేను మీ విద్యార్థిని.............

మీరు చెప్పిన ఎన్నో మాటల వల్ల నాకు చదువు మీద ఇష్టం పెరిగింది. మీ మాటలు నాకెప్పుడూ గుర్తొస్తూ ఉంటాయి. చదువుకున్న గొప్పదనాన్ని తెలియజేయడానికి మీరు నాకు చెప్పిన కథలు నేను ఎప్పటికీ మర్చిపోలేను.  

        సహజంగా చాలామంది విద్యార్థులకు చదువు అంటే ఒక పెద్ద బరువుగా భావిస్తారు. అందరిలా నేను అదే ఆలోచనతో ఉన్న సమయంలో నాలో చదువుపై ఆసక్తి పెరిగేలా మీరు నాకు చెప్పిన సూక్తులు గేయాలు నాలో మార్పు తెచ్చాయి.


        మీరు చెప్పినట్టుగానే నేను బాగా చదువుకుంటున్నాను. తప్పకుండా మీ మార్గంలో నడిచి మీ ఆశీస్సులు అందుకుంటూ నేను కూడా గొప్ప ఉద్యోగాన్ని సంపాదించి దేశానికి సేవ చేస్తానన్న గట్టి నమ్మకం నాలో కలిగింది. మీరు కలిగించిన స్ఫూర్తికి ధన్యవాదాలు తెలుపుకుంటూ

                                         ఇట్లు 

                                     మీ విద్యార్థి


నినాదాలు

చదువు జీవనానికి దీపం – జ్ఞానమే విజయానికి మార్గం!


విద్య ఉంటే విలువ పెరుగుతుంది – అవమానం తగ్గుతుంది


చదువు లేకుంటే చీకటి – చదువుకుంటే వెలుగు


విత్తనానికి నీరు ముఖ్యం- చదువు ముఖ్యం 


చదువు ఉన్నావాడు  - లోకానికి వెలుగౌతాడు!


చదువు నేర్చుకో-  జీవితాన్ని మలుచుకో


చదువు ఓ ఆయుధం – అదే నీకు అందించు జయం



చదువు ఎవరూ దోచలేని ధనం! - చదువే కలిగించు గౌరవం


కష్టమోర్చుకోవాలి - చదువు నేర్చుకోవాలి




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

Keeravaani song lyrics film by Anveshana

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల