premaleka rasa lyric telugu song

చిత్రం : ముత్యమంత ముద్దు (1989) సంగీతం : హంసలేఖ గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు, జానకి పల్లవి: ప్రేమలేఖ రాశా .. నీకంది ఉంటదీ పూల బాణమేశా .. ఎదకంది ఉంటదీ నీటి వెన్నెలా .. వేడెక్కుతున్నదీ పిల్ల గాలికే .. పిచ్చెక్కుతున్నదీ మాఘమాసమా .. వేడెక్కుతున్నదీ మల్లె గాలికే .. వెర్రెక్కుతున్నదీ వస్తే ..గిస్తే ..వలచీ .. వందనాలు చేసుకుంట.. హంసలేఖ పంపా.. నీకంది ఉంటదీ పూలపక్క వేశా.. అది వేచి ఉంటదీ చరణం 1: ఆడ సొగసు ఎక్కడుందొ చెప్పనా .. అందమైన పొడుపు కథలు విప్పనా కోడెగాడి మనసు తీరు చెప్పనా .. కొంగుచాటు కృష్ణ కథలు విప్పనా సత్యభామ అలకలన్ని పలకరింతలే .. అన్నాడు ముక్కుతిమ్మనా మల్లె తోట కాడ ఎన్ని రాసలీలలో .. అన్నాడు భక్త పోతనా వలచి వస్తినే వసంతమాడవే .. సరసమాడినా క్షమించలేనురా వలచి వస్తినే వసంతమాడవే .. సరసమాడినా క్షమించలేనురా కృష్ణా ..గోదారుల్లో .. ఏది బెస్టొ చెప్పమంట ... ! హంస లేఖ పంపా నీకంది ఉంటదీ పూల బాణమేశా ఎదకంది ఉంటదీ చరణం 2: మాఘమాస వెన్నెలెంత వెచ్చనా .. మంచి వాడివైతె నిన్ను మెచ్చనా పంటకెదుగుతున్న పైరు పచ్చనా .. పైట కొంగు జారకుండ నిలుచునా సినీమాల కథలు వింటె చిత్తు కానులే .. చాలించు నీ కథాకళీ ఆడవారి మాటకు అర్థాలే వేరులే .. అన్నాడు గ్రేటు పింగళీ అష్ట పదులతో అలాగ కొట్టకూ .. ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే అష్ట పదులతో అలాగ కొట్టకూ .. ఇష్టసఖివనీ ఇలాగ వస్తినే నుయ్యొ.. గొయ్యొ .. ఏదో అడ్డదారి చూసుకుంట ... ప్రేమలేఖ రాసా నీకంది ఉంటదీ పూలపక్క వేశా అది వేచి ఉంటదీ..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana