1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.5X1=5
మరునాడు కూడా అంతపురంలోని పళ్ళెంలోని తినుబండారాలు తినిపోయిన గుర్తులు గమనించింది మణిమేఖల. ఈ పని చేస్తున్న దెవరో తెలుసుకోడానికి మరోరాత్రి పట్టుదలగా నిద్ర అభినయిస్తూ మెలకువగా ఉంది. ఆ విషయం తెలియని జయసింహుడు ఎప్పటిలాగే వచ్చి యువరాణి మణిమేఖల చేతికి చిక్కాడు. మణిమేఖల "ఎవరునీవు? గంధర్వుడివా? యక్షుడివా?" అని అడిగింది. "నా పేరు జయసింహుడు. మీ పక్క రాజ్యమైన వత్సలరాజ్యం యువరాజుని" అన్నాడు. మణిమేఖల ఇంతమంది కాపలావారుండగా "ఎలావచ్చావు అని అడిగింది. "నా కొయ్య గుర్రమెక్కి ఆకాశమార్గాన వచ్చానని" అన్నాడు జయసింహుడు.
1. పై పేరాలోని సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది?
2. పై పేరాలో "అభినయిస్తూ" అనే పదానికి అర్ధమేమిటి?
3. జయసింహుడు ఏ రాజ్యానికి చెందిన వాడు?
4. పై పేరాలో ఎవరు ఎవరి చేతికి దొరికారు?
5. ఎవరికీ కనిపించకుండా జయసింహుడు ఎలా రాగలిగాడు?
6. జీవన భాష్యం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి.
7. సినారె కవి పరిచయాన్ని రాయండి.
8. లక్ష్యసిద్ధి సంపాదకీయ వ్యాసంలోని విషయాలను మీ మిత్రునికి లేఖ రాయండి.
పదజాల వ్యాకరణాంశాలు
9. మా ఊర్లో సముద్రమంత చెరువుంది
అలంకారం
10 సచివాలయం సంధి విడదీసి సంధి పేరు
11. ఆట వెలది పద్యంలో ఒకటి మూడు పాదాల్లో ఏ గణాలు వస్తాయి.
12. సంక్షేమ పథకాలు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి.
13. మబ్బు పర్యాయపదం
14 జంకని అడుగులు సొంత వాక్యం
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి