నిర్మాణాత్మక మూల్యాంకనం FA 3
తెలుగు 9వ తరగతి.
పేరు................ రూ నం.......
ధారాళంగా చదవడం - అర్థం చేసుకోవడం.
1. కింది పేరా చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
(5)
కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
5X1=5
ధర్మక్షేత్రమైన
కురుక్షేత్రంలో అతిరథులూ, మహారథులూ ఎందరో కన్నుమూశారు. కురుపక్షంలో అశ్వత్థామ,
కృతవర్మ, కృపాచార్యులు మిగిలారు. ఇటు పాండవులు ఐదుగురూ కృష్ణుడూ, సాత్యకీ
మిగిలారు. జరిగిన సంగ్రామంలో ఆప్తులూ, ఆత్మీయులూ అందరూ మరణించారనే బాధ ధర్మరాజు
మనస్సును వికలం చేస్తూనే ఉంది. ఈ మహా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని
భావించాడు. అందుకు విద్వాంసుల సలహా మేరకు అశ్వమేధయాగం ఆరంభించాడు. ఈ యాగానికి
వివిధ ప్రాంతాలనుంచి లక్షలాది ప్రజలు వస్తున్నారు. చూడవచ్చిన వారందరికీ వస్త్ర
దానంతో పాటు నిర్విరామంగా అన్నదానం గూడా జరిపించాడు. అలా సర్వజన సంతృప్తి
కలిగించిన అశ్వమేదా యాగాన్ని చూసి, దేవతలు పూలవాన కురిపించి, ధర్మరాజును
అభినందించారు.
1. కురుక్షేత్ర యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది?
2. ఆరంభించుట అనగా ఏమిటి?
3.ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని ఎందుకు జరిపించాడు?
4. 'అన్నదానంతో పాటు' ఇంకా ఏ ఏ దానాలు చేయవచ్చు?
5. ధర్మరాజును దేవతలు ఎందుకు అభినందించారు?
II.
6. చెలిమి పాఠ్యభాగ కవిని గురించి .
7. ఉద్యమ స్ఫూర్తి పాఠం లోని ఏదైనా ఒక సంఘటనను వివరించి రాయండి
8. చెట్టు
తన స్వగతాన్ని ఏ విధంగా చెప్పుకుంటుందో ఊహించి రాయండి
9. సఖి వికృతి పదం
10 అత్యవసరం విడదీసి సంధి పేరు రాయండి
11 కిషోర్ లేడీ పిల్లల పరిగెత్తుతున్నాడు
ఈ వాక్యం లోని అలంకారాన్ని గుర్తించండి
12. గొంతు నొక్కేయడము సొంతవాక్యం
13. నా పాట విగ్రహ వాక్యం రాసి సమాసం పేరు రాయండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి