పోస్ట్‌లు

మార్చి, 2022లోని పోస్ట్‌లను చూపుతోంది

సుభాషితమ్

సుభాషితమ్ శ్లోకం అవిదిత్వాత్మనః శక్తిం పరస్య చ సముత్సుధనంకః గచ్ఛన్నభిముఖో నాశం యాతి వహ్నౌ పతఙ్గవత్ తాత్పర్యం  "తన బలం, శత్రుబలం తెలుసుకోకుండా ఉత్తేజంతో,తొందరపాటుతో శత్రువును ఎదిరించేవాడు అగ్నిలో పడిన మిడత వలె నశిస్తాడు" ॐ卐 కన్దుకో భిత్తినిక్షిప్త ఇవ ప్రతిఫలన్ముహుః| ఆపతత్యాత్మని ప్రాయో దోషోఽన్యస్య చికీర్షతః|| - కథా సరిత్సాగరం తా𝕝𝕝 గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటకే తిరిగి వచ్చినట్టు, ఇతరులకు చెడు చేద్దామని ప్రయత్నిస్తే , ఆ చెడు మనకే జరుగుతుంది. కాబట్టి ఇతరులకు చెడు/ద్రోహం తలపెట్టకూడదు. శ్లో !!  మాతా నిందతి నాభినందతి పితా       భ్రాతా న సంభాషతే భృత్యః కువ్యతి       నా‌ను గచ్చతి సుతః కాంతాపి నా లింగతే       ఆర్ధ ప్రార్థన శంకయాన కురుతే       సల్లాప మాత్రం సుహృత్త స్మాదర్థ        ముపార్జయ శృణు సఖె హ్యధే‌న సర్వేవశాః భావం ధన సంపాధన లేని దరిద్రుణ్ణి తల్లి తిడుతుంది. తండ్రి కూడా సంతోషించడు. అన్నదమ్ములు ఒకరికొకరు మాట్లాడుకోరు. నౌకర్లు కూడా కోపగించుకుంటారు. కొడుకు వెంటరాడు. భార్యకూడా ప్రేమతో కౌగిలించుకోద...

holi

చిత్రం

rama rama song film

చిత్రం

oke oka lokam nuvve song lyrics ఒకే ఒక లోకం నువ్వే,

  ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే, నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే అందానికే హృదయం నువ్వే, నాకే అందావే ఎకాఎకీ కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మజన్మలా జంటవ్వనా ఓ…. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా….. ఆఆ…ఆ ఓ…… కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా కాలమంత నీకే నేను కావలుండనా…… ఆఆ…..ఆ నిన్న మొన్న గుర్తే రాని సంతోషాన్నే పంచైనా ఎన్నాళ్లైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే……. అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే…….. ఏఏ ఏ ఏ ఎండే నీకు తాకిందంటే చెమటే నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే వణుకు నాకు పుట్టేనే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒ...

ramayanam 140 page ayodya kanda రామాయణం 140 పేజీ అయోధ్యకాండం 10వ తరగతి త...

చిత్రం

12 భూమిక గూడూరి సీతారాం 10th lesson

12 భూమిక గూడూరి సీతారాం చదువండి - ఆలోచించి చెప్పండి. పుస్తకాలకు రెక్కలుండవు. కాని వాటిని చదివితే మనకు రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది. ఆ రెక్కలు జ్ఞానాన్ని, ఆలోచనాశక్తిని, సృజనాత్మకతా నైపుణ్యాన్ని, లోకపరిశీలనా దృష్టిని, జిజ్ఞాసను, ఉత్సాహాన్ని అందిస్తాయి. మంచిపుస్తకం ఉత్తమమిత్రునితో సమానం. శరీరానికి వ్యాయామం ఎట్లాంటి శక్తినిస్తుందో మంచిపుస్తకం చదవడంవల్ల మనసుకు అలాంటి ఉత్తేజం కలుగుతుంది, ఏది మంచిపుస్తకం, ఏ పుస్తకాన్ని చదువాలనే ఎంపికలో పుస్తక పరిచయవాక్యాలు మార్గదర్శనం. చేస్తాయి. ప్రశ్నలు 1. పుస్తకాలు చదువడంవల్ల కలిగే ప్రయోజనాలు ఏవి? 2. ఎటువంటి పుస్తకాలను చదువాలి? 3. ఏదైనా పుస్తకాన్ని చదువాలి' అనే ఆసక్తిని కలిగించే అంశమేది? 4. మీరు చదివిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి. పాఠం ఉద్దేశం  ముందుమాటవల్ల పుస్తకంపై ప్రాథమిక అవగాహన ఎలా కలుగుతుందో పుస్తకాన్ని చదవాలనే ఆసక్తి, ఆతురత ఎట్లా ఏర్పడుతాయో తెలియజేస్తూ దాని స్వరూపస్వభావాలను పరిచయం చేయడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు ఈ పాఠం 'పీఠిక' ప్రక్రియకు చెందినది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతస్సారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త...

6. ప్రేరణ డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 6th class telugu prerana lesson

6. ప్రేరణ  డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం చదువండి ఆలోచించండి చెప్పండి ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకున్నది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది. ప్రశ్నలు 1. ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది? 2. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటారు?  3. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు? పాఠం ఉద్దేశం ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణ నిస్తుంది. ఆ మహనీయులకు మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగు తుంది. తద్వారా భావిభారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు "ఈ పాఠం అత్మకథ ప్రక్ర...

గోలుకొండ పట్టణము

 సత్మరించుచుండెను. అద్దంకి గంగాధరకవి “తపతీ సంవరణోపాఖ్యాని కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకిత మిచ్చియున్నాడు. ఇబ్రాహీంపాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి 'మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములిను ఇచ్చి సత్మరించినాడు. సుల్తాన్‌ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్‌ఖాన్‌ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి, ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్మరించినాడు. ఏడవ పాదుషాయగు అబ్బుల్లా పాదుషా బ్రాహ్మణభక్తి కలవాడు. ఇతని చుట్టును ఎల్లప్పుడు బ్రాహ్మణులు పరివేష్టించి యుండెడివారు. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారము రాజుగారు నడచుకొనుచుండిరి. ఇతడు విజ్ఞాన శాస్త్రములు, లలితకళలు, వాజ్బయము వృద్ధిచేయుటకు ప్రయత్నించెను. అందుచే దేశదేశాల్లోని విద్వాంసులు ఈతని ఆస్థానమునకు వచ్చుచుండిరి. లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి యుండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టగూడదు. బాధింపగూడదు అని రాజాజ్ఞ యుందెను. పట్టణములో ద్రాక్షతోటలు పెక్కు ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి,.ఏప్రియల్‌ నెలలలో పక్వమునకు వచ్చును. ద్రాక్షలకు మంచిగా...

సుమతీ శతకము

  శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ అడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ అధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీ అప్పు కొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్‌, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ అప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్‌ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ అల్లుని మంచితనంబు, గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్‌, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ ఆకొన్న కూడె యమృతము, తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్‌, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ ...