సుభాషితమ్
సుభాషితమ్
శ్లోకం
అవిదిత్వాత్మనః శక్తిం
పరస్య చ సముత్సుధనంకః
గచ్ఛన్నభిముఖో నాశం
యాతి వహ్నౌ పతఙ్గవత్
తాత్పర్యం
"తన బలం, శత్రుబలం తెలుసుకోకుండా ఉత్తేజంతో,తొందరపాటుతో శత్రువును ఎదిరించేవాడు అగ్నిలో పడిన మిడత వలె నశిస్తాడు"
ॐ卐
కన్దుకో భిత్తినిక్షిప్త
ఇవ ప్రతిఫలన్ముహుః|
ఆపతత్యాత్మని ప్రాయో
దోషోఽన్యస్య చికీర్షతః||
- కథా సరిత్సాగరం
తా𝕝𝕝 గోడకు కొట్టిన బంతి వెంటనే వేసిన చోటకే తిరిగి వచ్చినట్టు, ఇతరులకు చెడు చేద్దామని ప్రయత్నిస్తే , ఆ చెడు మనకే జరుగుతుంది. కాబట్టి ఇతరులకు చెడు/ద్రోహం తలపెట్టకూడదు.
శ్లో !!
మాతా నిందతి నాభినందతి పితా
భ్రాతా న సంభాషతే భృత్యః కువ్యతి
నాను గచ్చతి సుతః కాంతాపి నా లింగతే
ఆర్ధ ప్రార్థన శంకయాన కురుతే
సల్లాప మాత్రం సుహృత్త స్మాదర్థ
ముపార్జయ శృణు సఖె హ్యధేన సర్వేవశాః
భావం
ధన సంపాధన లేని
దరిద్రుణ్ణి తల్లి తిడుతుంది. తండ్రి కూడా సంతోషించడు. అన్నదమ్ములు ఒకరికొకరు మాట్లాడుకోరు. నౌకర్లు కూడా కోపగించుకుంటారు. కొడుకు వెంటరాడు. భార్యకూడా ప్రేమతో కౌగిలించుకోదు. ఆఖరుకు ప్రాణస్నేహితుడు కూడా తనను డబ్బు అడుగుతాడేమోనని అనుమానముతో పలకరించకుండా దూరంగా తప్పుకుని తిరుగుతాడు. కాబట్టీ ధనాన్ని సంపాదించు. ఆ ధనము వల్ల అందరూ నీ వశమవుతారు!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి