గోలుకొండ పట్టణము
సత్మరించుచుండెను. అద్దంకి గంగాధరకవి “తపతీ సంవరణోపాఖ్యాని కావ్యమును రచించి ఈ పాదుషాకు అంకిత
మిచ్చియున్నాడు. ఇబ్రాహీంపాదుషా మహబూబునగరు జిల్లాలో నివశించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య
మహాకవికి 'మత్తగంధేభసితఛత్ర ముత్తమాశ్వ హాటకాంబర చతురంతయాన యగ్రహారములిను ఇచ్చి సత్మరించినాడు.
సుల్తాన్ ఇబ్రాహీం పాదుషా సేనానియగు అమీర్‌ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బమగు “యయాతిచరిత్ర”కు కృతిభర్తయయి,
ఆ కావ్యమును రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్మరించినాడు. ఏడవ పాదుషాయగు అబ్బుల్లా పాదుషా బ్రాహ్మణభక్తి
కలవాడు. ఇతని చుట్టును ఎల్లప్పుడు బ్రాహ్మణులు పరివేష్టించి యుండెడివారు. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారము
రాజుగారు నడచుకొనుచుండిరి. ఇతడు విజ్ఞాన శాస్త్రములు, లలితకళలు, వాజ్బయము వృద్ధిచేయుటకు ప్రయత్నించెను.
అందుచే దేశదేశాల్లోని విద్వాంసులు ఈతని ఆస్థానమునకు వచ్చుచుండిరి.
లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి యుండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టగూడదు.
బాధింపగూడదు అని రాజాజ్ఞ యుందెను.
పట్టణములో ద్రాక్షతోటలు పెక్కు ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి,.ఏప్రియల్ నెలలలో పక్వమునకు
వచ్చును. ద్రాక్షలకు మంచిగా దోహదము చేయుదురు. ఈ ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షాసవము తయారుచేసి త్రాగుచుండిరి.
అశేష జనమునకు తాటి కల్లు ప్రీతికరమయిన పానీయముగా నుండెను.
గోలకొండ పట్టణములో 1589 ప్రాంతములో మహామారీ పీడ సంభవించెను. లెక్కలేనంతమంది మరణించిరి.
చివరకు కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగిరి. తత్ఫ్సలితముగా ఆ మహామారి
పీడవదలెను. తత్ జ్ఞాపక చిహ్నముగా కృతజ్ఞతా సూచకముగా మహమ్మదు కులీకుతుబ్‌షా పాదుషావారు 1591 సంవత్సరమున
హైద్రాబాదులో తాబూతు ఆకారమున చారుమినారు నిర్మాణము గావించిరి.
ఉమ్రావులు బజారులయందు బోవుట చాల పటాటోపముగా నుండుచుండెను. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు
ఒకటో, రెండో ఏనుగులు పోవును. వీటిమీద ధ్వజములు పట్టుకొని ముగ్గురు భటులు కూర్చుందురు. తరువాత అస్త్ర
శస్తాదులను ధరించిన ఏబది, అరువదిమంది భటులు అశ్వారూఢులై పోవుదురు. వీరి వెనుక గుట్టాల మీద కూర్చుండి
బాకాలూదుచు, సన్నాయిలు బాడుచు కొందరు బయలుదేరుదురు. వీరి వెనుక ఉమ్రావు అశ్వారూఢుడయి వచ్చును.
ఈతని కంగరక్షకులుగా ముప్పది, నలుబది మంది పదాతివర్గముండును. కొందరు ఉమ్రావులకు సురటీలు విసురుచుందురు.
ఒకడు గొడగు పట్టును. ఇంకొకడు హుక్కాపట్టుకొని వచ్చుచుండును. ఒకడు కావడిలో జలపూర్ణ కుంభములను పట్టుకొని
వచ్చును. తరువాత ఒక పల్లకిని నలుగురు మోసుకొని వచ్చుచుందురు. భుజాలు మార్చుకొనడానికి ఇద్దరు బోయీలు
విడిగానుందురు. వీరందరి. చివర ఒకటో, రెండో ఒంటెలు బయలుదేరును. ఒంటెలమీద కూర్చుండి భటులు తప్పెటలు
వాయించుచుందురు. నవాబుగారికి ఇష్టమయినప్పుడు గుజ్జిముదిగి పల్లకిలో పరుందెదరు. పల్లకీకి వెండిపూత పూయబడి
యుండును. పల్లకి దండెలకు వెండిపొన్ను లుండును. పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్చమును
పట్టుకొని యుండును. తాంబూల చర్వణము చేయుచునో, హుక్కా పీల్చుచునో కనుపట్టుచుండును.
గోలకొండ పట్టణములో నేరస్థులను శిక్షించు విధానము మిగుల కఠినముగా నుండెను. వారిని జైలులో బెట్టు
పద్ధతియే. లేకుండెను. వెంటనే విచారణ చేయుటయు, దోషియైనచో శిక్షించుటయు, నిర్జోషియైనచో విడిచిపెట్టటయు
జరుగుచుందెను.
గోలకొండ పట్టణములో జనాభావత్తిడి అధికమయ్యెను. నీటి వసతి కూడ చాలదయ్యెను. అందుచే పాదుషాలు,
గొప్పవారు, కొందరు వర్తకులు హైద్రాబాదులో నివసింపసాగిరి. అయినను ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయములు,
ధనాగారము, సేనాసిబ్బంది గోలకొండ పట్టణములోనే యుండుచుందెను. యుద్ధభీతి కలిగినప్పుడు రాజులు, రాణులు
మొదలగువారు గోలకొండ దుర్గములో తలదాచుకొనుచుండిరి. గోలకొండనుండి హైద్రాబాదు రాజధానిగా ఎప్పుడు
మార్చబడినదో సరిగా తెలియదు. కాని పదునారవ శతాబ్దము చివరనిది జరిగియుండవచ్చునని చరిత్రకారు
లూహించుచున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి