సుమతీ శతకము
శ్రీ రాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరా యనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ
అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీఅడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీఅడిగిన జీతంబియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల యెద్దుల గట్టుక మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీఅధరము గదలియు, గదలక మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ అధికార రోగ పూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతీఅప్పు కొని చేయు విభవము, ముప్పున బ్రాయంపుటాలు, మూర్ఖుని తపమున్, దప్పరయని నృపు రాజ్యము దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీఅప్పిచ్చువాడు, వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీఅల్లుని మంచితనంబు, గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము, దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీఆకొన్న కూడె యమృతము, తాకొందక నిచ్చువాడె దాత ధరిత్రిన్, సోకోర్చువాడె మనుజుడు, తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీఆకలి యుడుగని కడుపును, వేకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్, బ్రాకొన్న నూతి యుదకము, మేకల పాడియును రోత మేదిని సుమతీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి