6. ప్రేరణ డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం 6th class telugu prerana lesson

6. ప్రేరణ 

డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం


చదువండి ఆలోచించండి చెప్పండి

ప్రజ్ఞ చాలా తెలివికలది. ఆమెకు శాస్త్రవేత్త కావాలని బలమైన కోరిక ఉన్నది. ప్రతీ దాన్ని పరిశీలన దృష్టితో చూస్తుంది. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో బహుమతులు కూడా గెల్చుకున్నది. శాస్త్రవేత్తలకు సంబంధించిన పుస్తకాలను చదువుతుంది. సందేహ నివృత్తికై ఉపాధ్యాయులను, పెద్దలను సంప్రదిస్తుంది. ఒకరోజు విజ్ఞానశాస్త్ర కార్యక్రమంలో పాల్గొనడానికి వారి గ్రామానికి ఒక శాస్త్రవేత్త రాగా, ప్రజ్ఞ వెళ్ళి కలుసుకున్నది.

ప్రశ్నలు

1. ప్రజ్ఞ శాస్త్రవేత్తను ఏమడిగి ఉంటుంది? 2. శాస్త్రవేత్త ప్రజ్ఞకు ఏమి చెప్పి ఉంటారు? 

3. ప్రజ్ఞ శాస్త్రవేత్త కావాలనుకున్నది కదా! మీరేం కావాలనుకుంటున్నారు? ఇందుకోసం మీరేం చేస్తారు?


పాఠం ఉద్దేశం

ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, అత్యున్నత శిఖరాలను అధిరోహించిన మహనీయుల జీవితం విద్యార్థులకు ప్రేరణ నిస్తుంది. ఆ మహనీయులకు మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థులలో కలుగు తుంది. తద్వారా భావిభారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం ఉద్దేశం.


పాఠ్యభాగ వివరాలు


"ఈ పాఠం అత్మకథ ప్రక్రియకు చెందినది. ఒక వ్యక్తి తన జీవిత విశేషాల్ని అనే గ్రంథస్థం చేసుకుంటే అది ఆత్మకథ అత్మకథనే స్వీయచరిత్ర అని కూడా అంటారు. ఇందులో సమకాలీన విశేషాలు ప్రతిబింబిస్తాయి. రచయిత అనుభవాలే ఆ కాలం నాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు తెలుస్తాయి. ఇతరులకు ప్రేరణ కలిగిస్తాయి. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. పాఠ్యభాగం డాక్టర్ అవుల్ ఫకీర్ సలాద్దీన్ అబ్దుల్ కలామ్ అరుణ్ తివారితో కలిసి ఒక ఆత్మకథ లోనిది.


రచయిత పరిచయం

అందరూ ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ అని పిలిచే డాక్టర్ అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలామ్ తమిళనాడులోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ఆయన పట్టుదల, క్రమశిక్షణ, అధిక జిజ్ఞాసతో ఇంజనీరుగా శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా తన సేవలను ఈ జాతికి అందించాడు. 'ఒక విజేత ఆత్మ కథ' (ఇగ్నీటెడ్ మైండ్స్ ది వింగ్స్ ఆఫ్ ఫైర్-యాన్ ఆటోబయోగ్రఫీ) వంటి రచనలు చేశాడు.


శాస్త్రరంగంలో విశేష కృషి చేసినందుకు గాను పద్మభూషణ్', 'పద్మవిభూషణ్'తో పాటు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'తోను భారత ప్రభుత్వం సత్కరించింది. దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు "గౌరమ డాక్టరేట్'తో ఆయనను గౌరవించాయి.

జననం 15-10-1931


27-07-2015


ప్రవేశిక

 అందరిలా అతి సామాన్య కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో అనేక ఒడిదుడుకులను,

కష్టాలను ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించాడు. చిన్నప్పుడే స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ లక్ష్యం చేరాలని కలలుకున్నాడు. నిరంతర కఠోర సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసి అందరి మన్ననలు అందుకున్న ఆ మహానుభావుడు చిన్నారులకు ప్రీతిపాత్రుడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ. ఆయన విద్యాభ్యాసం, లక్ష్యసాధన ఎట్లా జరిగిందో చూద్దాం.


1వ భాగం


నేను రామనాథపురంలో హైస్కూల్లో స్థిరపడగానే నాలోని పదిహేనేళ్ళ జిజ్ఞాసి మేల్కొన్నాడు. తనముందు పరచుకొని ఉన్న జీవితావకాశాల గురించి ప్రత్యామ్నాయాల గురించీ ఇదమిత్థంగా ఏమీ తెలుసుకోలేని ఒక నవ ఔత్సాహికుడికి నా ఉపాధ్యాయుడు ఇయదురై సోలోమోన్ ఆదర్శపథ నిర్దేశకుడయ్యాడు. తన ఉదార విశా దృక్పథంతో ఆయన తన తరగతిగదిలోని విద్యార్థుల్ని ఉత్సాహపరిచేవాడు. 'మందబుద్ధి శిష్యుడు ఉత్తమగురువు నుంచి నేర్చుకోగలిగిన దానికన్నా ఉత్తమ విద్యార్థి చెడ్డఉపాధ్యాయుడి నుంచి కూడా ఎక్కువ నేర్చుకోగలడ'నే వాడాయన. నేను రామనాథపురంలో ఉన్న కాలంలో మా అనుబంధం గురుశిష్యబంధాన్ని దాటి వికసించింది. ఆయన సాహచర్యంలో ఒకరి జీవితగమనాన్ని ఎవరైనా ఏ మేరకు ప్రభావితం చేయగలరో తెలుసుకున్నాను. ఇయదురై సోలోమోన్ అంటూండేవారు, జీవితంలో విజయం పొందడానికీ ఫలితాలు సాధించడానికీ నువ్వు మూడు అంశాలమీద పట్టు సాధించాల్సి ఉంటుంది - అవి "కోరిక”, “సమ్మకం”, “ఆశ పెట్టుకోవడమూ”ను.


తరువాతి రోజుల్లో రివరెండ్ గా మారిన సోలోమోన్ నాకు నేర్పిందిదే. నాకేదన్నా సంభవించాలని నేననుకునే ముందు నేను దాన్ని గట్టిగా ఆకాంక్షించాలనీ, అది తప్పక జరిగి తీరుతుందనీ ప్రగాఢంగా విశ్వసించాలనీను. నా జీవితం నుంచి ఒక ఉదాహరణ ఇస్తాను. నాకు చిన్నప్పటినుంచీ ఆకాశపు రహస్యాలన్నా, పక్షుల ప్రయాణమన్నా అమితాసక్తి. కొంగలూ, సముద్రపు గువ్వలు ఎగురుతుండటం చూస్తూ నేను కూడా ఎగరాలని కోరుకునేవాణ్ణి. సాధారణ గ్రామీణ బాలుడినయినప్పటికీ, నేను కూడా ఏదో ఒకరోజు ఆకాశంలో విహరించగలననీ ఎంతగా నమ్మానంటే మా రామేశ్వరం నుంచి ఆకాశయానం చేసిన మొదటి బాలుణ్ణి నేనే కావటం విశేషం.


ఇయదురై సోలోమోన్ ఎందుకు గొప్ప ఉపాధ్యాయుడంటే ఆయన విద్యార్థులందరిలో ఏదో ఒక విలువ గురించి స్పృహని మేల్కొల్పేవాడు. ఆయన నా ఆత్మగౌరవాన్ని ఏ మేరకు మేల్కొల్పాడంటే ఏ మాత్రం చదువుకోని తల్లిదండ్రుల బిడ్డనైన నేను కూడా ఏది కావాలనుకుంటే అది కాగలనని నమ్మాను. "విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు" అనే వారాయన. 1950లో ఇంటర్మీడియెట్ పరీక్షకు చదవడానికి తిరుచినాపల్లిలోని ట్రిచీ సెంట్ జోసఫ్ కాలేజీలో చేరాను. పరీక్షల గ్రేడుల లెక్కన చూస్తే నేనేమంత చురుకైన విద్యార్థిని కాను,


మా అన్నయ్య ముస్తఫా కమల్కి స్టేషన్లోడ్లో ఒక కిరాణా దుకాణముండేది. హైస్కూల్లో చదువుకునే టప్పుడు నేను రామేశ్వరం వెళ్ళినప్పుడల్లా నన్ను సాయం చెయ్యమంటూ పిలిచి, షాపులో కూచోబెట్టి ఇంక గంటల తరబడి అతను అదృశ్యమైపోయేవాడు. నేను అక్కడ ఆ షాపుని కనిపెట్టుకు కూచొని బియ్యం, నూనె, వాటిలో తొందరగా చెల్లిపోయేవి సిగరెట్లూ, బీడీలూను. బీదవాళ్ళు తమ కష్టార్జితాన్ని ఎందుకట్లా అన్నయ్య ముస్తఫా నన్ను వదిలి పెట్టగానే మా తమ్ముడు కాశిం మహమ్మద్ నన్ను తన ఫ్యాన్సీషాపులో అలంకార సామగ్రి అమ్మేవారు.


ఉల్లిపాయలు ఒకటేమిటి అన్నీ అమ్ముతుండే వాణ్ణి. (ఆలోచించండి - చెప్పండి.


* 'నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు' అంటే పొగపీల్చేస్తుంటారని ఆశ్చర్యం కలిగేదినాకు. మా మీకేమైంది?


* మీరు మీ కుటుంబసభ్యులకెప్పుడైనా సహాయం చేశారా? ఏ సందర్భంలో ఏం చేశారు?


కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉండేవాడు. అక్కడ * కోరిక, నమ్మకం, ఆశపెట్టుకోవడం అనేవి నత్తగుల్లలతోను, శంఖాలతోను చేసిన రకరకాల విజయాన్నిస్తాయికదా! వీటిపై మీ అభిప్రాయ మేమిటి?






కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana