పోస్ట్‌లు

chaduvu padajalam 7th class | చదువు పదజాలం 7వతరగతి

చిత్రం
హరి: ఓమ్ ఓం శ్రీమహాగణాధిపతయే నమః । ఓం శ్రీగురుభ్యో నమః ।  భో దీప! బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థితః | అతస్త్వాం స్థాపయామ్యద్య మదజ్ఞానమపాకురు ॥ ఓం దేవీం వా చ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవోవదంతి | సానో మంద్రేష మూర్జందుహానా ధేనుర్వాగస్మా నుపసుష్టుతైతు ॥ అయం ముహూర్తః సుముహూర్తో అస్తు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ చతుర్భుజమ్ | విఘ్నోపశాంతయే  తదేవలగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ | విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘియుగంస్మరామి  యత్ర యోగేశ్వరః కృష్ణా యత్ర పార్థో ధనుర్ధరః | తత్ర శ్రీర్విజయో భూతిథ్రువానీతిర్మతిర్మమ స్మృతే కళ్యాణ భాజనం యత్రజాయతే | పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్ ॥ లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరశ్యామో హృదయస్తో  జనార్దనః ॥ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్  సుముఖశ్చైకదంతశ్చ కపిలో లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః  ధూమకేతుర్ గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః | వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః  షోడశైతాని నామాని యఃపఠేత్ శ్రుణుయాదపి | విద్యారంభే...

జయ జయ హే తెలంగాణ | jaya jaya he telangana | keeravani style without music

చిత్రం

ఆరుట్ల కమలాదేవి

 అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది... నాటి సామాజికస్థితికి అనుగుణంగా బాల్యవివాహం జరిగింది... భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఒక్కో మెట్టు ఎదిగింది... రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది... సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది... శాసనసభ్యురాలై ప్రజాసమస్యల్ని పరిష్కరించింది... తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది... ఆమె ఎవరో ఇంతవరకూ చెప్పలేదుకదూ! ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళాతేజం ఆరుట్ల కమలాదేవి!  ప్రజలే తన దేవుళ్ళన్న పవిత్ర ఆత్మకు జేజేలు! సమానత్వమే సార్థకతయని నమ్మిన సాధ్వికి జేజేలు!! కొందరు పుట్టి భూమికి భారమవుతారు. ఎక్కువమంది కుటుంబం కోసం శ్రమిస్తారు. కొద్దిమంది మాత్రమే అందరికోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అట్లాంటి కొద్దిమందిలో ఆరుట్ల కమలాదేవి ఎర్రగులాబీలా వికసించి తాను పుట్టిన నేల తల్లి పాదాలపై రాలిపోయింది. తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు. ఉన్నత ఆశయాలు కల్గిన కమ్యూనిస్టు. ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీరవనిత. నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్స్వార్థంగా, అంకితభావంతో పోరాటం చేసిన వీరవనిత ...

WWW.కారడవి.కామ్

 ఆధునిక సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోయే జనం పర్యావరణానికి మూగజీవాలకు హానిచేస్తున్నారు! మితిమీరిన సాంకేతికతతో ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఒకవేళ జంతువులు సైతం కంప్యూటర్లు వాడితే ఏం జరుగుతుంది? మానవాళిని అంతం చేస్తాయా? తమని తాము సంరక్షించుకుంటయా? ఏం జరుగుతుందో చూద్దాం.  ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలోని దారులు తికమక పెట్టేవిగా ఉండేవి. అందువల్ల ఈ అడవిలోకి వెళ్ళడానికి వేటగాళ్ళు కూడ భయపడేవారు. చాలా ఏండ్లకిందట కొందరు వేటగాళ్ళు కారడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు తిరిగిరాలేదు. దాంతో ప్రజలు ఈ అడవి గురించి రకరకాల కథలు అల్లేవారు. అడవి దట్టంగా ఉండడంవల్ల తొవ్వ మరచిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖవాళ్ళు అనేవారు. పైగా, ఏ చెట్టుమీద కూర్చున్న ఏ పులి ఎప్పుడుదాడిచేస్తుందో? ఏ చిరుత ఎప్పుడు మెడపట్టుకుంటుందో? హఠాత్తుగా ఏ ఎలుగుబంటి ఎదురువస్తుందో? అనే భయం ఉండేది. అటవీశాఖవాళ్ళు నిర్మించిన రోడ్లమీద నుంచి కలపమోసే ట్రక్కులు వస్తూపోతూ ఉండేవి. కాని అడవికి 'గూండా జగ్గు దౌర్జన్యం విస్తరించినప్పటి నుంచి కాంట్రాక్టర్లకి కలపతో ట్రక్కులు నింపి పట్టుకొని వెళ్ళడం కష్టమైంది. జగ్గూ మనుషులు ప్రతి కాంట్రాక్టర...

మన పండుగలు

 తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది! తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది! హిందూ ముస్లింల అలయ్బలయ్ లు తెలంగాణతో మమైకం! గంగాజమునా తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం! మనకంటూ ప్రత్యేక విశిష్టత... మనదంటూ ప్రత్యేక సంస్కృతి... మన సంస్కృతిలోని పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం! మనం ఎన్నో పండుగలు జరుపుకొంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏండ్లకేండ్లుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నవి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకొనే ముఖ్యమైన కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం! బతుకమ్మ పండుగ : తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూలజాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. బతుకమ్మ : వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలున్నవి. చోళరాజు అయిన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుడతా...

రుద్రమదేవి

 16... అబలలు సబలలు అని నిరూపించింది! వనితలు వీరవనితలుగా నిలబడతారని ఋజువు చేసింది! కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది! రణరంగంలో కత్తిపట్టి యుద్ధంచేసి... విజయదుందుభి మ్రోగించింది! వీరనారిగా... ధైర్యసాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధ్రువతారగూర్చి చదువుకుందాం! మార్గదర్శకంగా తీసుకుందాం! తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు, కాకతీయులలో ప్రసిద్ది చెందిన మొదటి రాజు ఇతడు. ఆ వంశంవాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు క్రీ.శ. 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్రసంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణభారతదేశంలో మొదటిమహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమకు పుత్రసంతానం లేనందున ఆమె కూతురు ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1289 నుండి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమయింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీ.శ. 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతిదేవుడు పుత్రసంతానం కొరకు నారమ్మ, పేరమ్మ...