మన పండుగలు
తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది! తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది! హిందూ ముస్లింల అలయ్బలయ్ లు తెలంగాణతో మమైకం! గంగాజమునా తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం! మనకంటూ ప్రత్యేక విశిష్టత... మనదంటూ ప్రత్యేక సంస్కృతి... మన సంస్కృతిలోని పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం!
మనం ఎన్నో పండుగలు జరుపుకొంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏండ్లకేండ్లుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నవి.
ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకొనే ముఖ్యమైన కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం!
బతుకమ్మ పండుగ :
తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూలజాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ.
బతుకమ్మ : వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ
వెనుక కూడా అనేక కథలున్నవి. చోళరాజు అయిన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఓ ఆడపిల్ల పుడుతుంది. పుట్టక పుట్టక పుట్టిన పిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి, నిండు నూరేళ్ళు బతకాలని ఆ పిల్లను అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయే బతుకమ్మగా పూజలందుకొన్నది. గునుగు, చామంతి, తోకచామంతి, తంగేడు, కట్ల, పిట్టకాలి, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, రుద్రాక్ష, బీర, గుమ్మడి, బంతి, ముద్దబంతి లాంటి రకరకాల పూలను సేకరించి రంగులు రంగులుగా పేర్చి పైన పసుపు ముద్దను నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకుని చెరువులోనో బావిలోనో నిమజ్జనం చేస్తారు.
సద్దుల బతుకమ్మ: దసరాకు ఒకటి, రెండురోజుల ముందు సద్దుల బతుకమ్మను జరుపుకొంటారు. ఆరోజు
కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉంటారు. బతుకమ్మను పెద్దగా పేర్చుకుంటారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆడబిడ్డలను, బంధువులను పిలుచుకుంటారు. బతుకమ్మను ఎత్తుకుని సద్దులు తీసుకుని ఆడుకున్న తర్వాత చెరువుకు వెళ్తారు. జొన్నపిండి, మక్కపిండి, బెల్లం, పెసరపిండి, నెయ్యితో చేసిన మలీద, సత్తుపిండి, దోసకాయ, పెసరపప్పు, బెల్లంతో సద్దులను తయారుచేస్తారు. చెరువు దగ్గర బతుకమ్మలను దించి మరోసారి ఆడుకుని చెరువులో సాగనంపుతారు.
తర్వాత తెచ్చిన సద్దులను ఒకరికొకరు పంచుకుంటారు. బతుకమ్మను నీళ్ళలో వదలడం కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తారు. మోకాలిలోతు నీటివరకు వెళ్ళి నీటిపై బతుకమ్మను ఉంచి ఏమాత్రం చెదరకుండా ఒడుపుగా వదిలి ఇత్తడి తాంబాళాన్ని పక్కకు తప్పిస్తారు. తర్వాత నీటిని మూడుసార్లు ముందుకు నెట్టి దండం పెట్టి వెనుకకు తిరుగుతారు.
రోజుకోతీరు : తొమ్మిదిరోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. తొమ్మిది రకాల ఫలాహారాలను
సమర్పిస్తారు. మొదటిరోజు మహాలయ అమావాస్య (పెత్రమాస) నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినంక బతకమ్మను పేరుస్తారు. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు నువ్వులు, బెల్లం, చక్కెరను ఫలహారంగా పెడుతారు. రెండవరోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈరోజు పప్పు, బెల్లం, అటుకులు ప్రసాదం చేస్తారు. మూడోరోజున ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. ఈరోజు ముద్దపప్పు బెల్లం ప్రసాదంగా చేస్తారు. నాలుగవరోజు నానబియ్యం, ఐదవరోజు అట్లబతుకమ్మ, ఆరోరోజు అలకల బతకమ్మ. ఈ ఆరో రోజును అర్రెమి అంటారు. ఈరోజు ఎవరి ఇళ్ళల్ల వాళ్ళు బతుకమ్మ ఆడుతారు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవరోజు వెన్నముద్దల బతుకమ్మగా పిలుస్తారు. తొమ్మిదోరోజున సద్దుల బతుకమ్మగా పిలుస్తారు.
అన్నికులాలు (సబ్బండ వర్ణాలు): బతుకమ్మ ఆటలో అన్నికులాలవారు పాల్గొంటారు. ఏ వాడకు ఆ వాడవాళ్ళు వాళ్ళ వాకిట్లో బతుకమ్మను ఆడుకున్నాక ఊరి బొడ్రాయి దగ్గరో, కచేరు దగ్గరో, గ్రామంలోని కీలక ప్రదేశంలోనో బతుకమ్మలు పెట్టి చుట్టూ తిరుగుతూ చప్పట్లుకొడుతూ పాడుతూ ఆడుతారు. ఆడవాళ్ళు బతుకమ్మ ఆడుతుంటే పిల్లలు వచ్చి మధ్యలో కూర్చుంటారు. మగవాళ్ళు సద్దులు పట్టుకుని అరుగుల మీద తీరిగ్గా కూర్చుంటారు.
ఆటలో లయ, చప్పుడు : బతుకమ్మ ఆటలో ఓ ప్రత్యేకత ఉన్నది. ఓపద్ధతి ప్రకారం అడుగులు వేస్తూ చప్పట్లుకొడుతూ గుండ్రంగా తిరుగుతూ వంగి లేస్తూ లయబద్ధంగా ఆడుతారు. ఆట, పాట, నాట్యం ఈ మూడింటితో పాటు పాటల్లో గొప్ప సాహిత్యం ఉంటుంది.
బతుకమ్మ పాటలు : బతుకమ్మ పాటల బాణీలు, ఎంతో ప్రసిద్ధిగాంచినవి. ఆయా ప్రాంతాల ఆచారాలు, పేర్లు,
అలవాట్లను, భాషను కలబోసుకుని ప్రాంతీయ కథలతో ఉయ్యాలో అని, కోల్ అని, చందమామ అని, గౌరమ్మ అని, వలలో అని, ఎన్నెలో అనే మాటలను చివరన చేరుస్తూ పాటలు పాడుతారు. ఈ పండుగకు ఆడపిల్లలు ఎక్కడున్నా పుట్టింటికి చేరుకుంటారు. తోబుట్టువులు, కన్నవారు ఆడపిల్లలకు కట్నకానుకలను బహుకరిస్తారు. అత్తవారింట్లో ఉన్న అమ్మాయి ఈ పండుగ వచ్చిందంటే చాలు పుట్టింటివారికోసం ఎదురుచూస్తుంది. ఆ ఎదురుచూపును కూడా పాటల రూపంలోనే చెబుతుంది. ఎక్కువగా ఆడపిల్లల జీవితాలు, కష్టాలు, వారు అత్తగారింట్లో ఎదుర్కొనే సమస్యలు, వీటి గురించిన పాటలే ఎక్కువగా ఉంటాయి.
ఆడబిడ్డల ఎదురుచూపులు :
తల్లిగారింటికి వెళ్ళడానికి అనుమతి :
ఇద్దరక్క చెల్లెండ్లు ఉయ్యాలో ఒక్కూరికిచ్చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్నవోడు ఉయ్యాలో వచ్చన్న వోడు ఉయ్యాలో చూసన్నవోడు ఉయ్యాలో ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డమాయె ఉయ్యాలో...
కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో వంటింట్లో కూసుండి ఉయ్యాలో బియ్యమేరుతుంటె ఉయ్యాలో అప్పుడే కామాక్షి ఉయ్యాలో అన్నవచ్చినాడు ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీళ్ళు దీసె ఉయ్యాలో ఎందుకూ చెల్లెలా ఉయ్యాలో ఏడువకమ్మ నీవు ఉయ్యాలో కట్టుకో బట్టలు ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో... మల్లెతోటల ఉన్న ఉయ్యాలో ఓమామగారు ఉయ్యాలో మాయన్న వచ్చిండు ఉయ్యాలో మమ్మంపరాదా ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీఅత్తనడుగు ఉయ్యాలో పత్తి తోటలఉన్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో....
శ్రమ జీవనం :
శ్రీరాముడు మోటగొట్ట వలలో సీతా నీళ్ళుగట్ట వలలో రఘురాముడు గొర్రుగొట్ట వలలో జానకి నాటులెట్ట వలలో...
పెద్ద బతుకమ్మను వేసి ఇంటికి వచ్చేప్పుడు:
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయొప్పునే గౌరమ్మ...
తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ: తెలంగాణ ఉద్యమకాలంలో బతుకమ్మ ప్రస్తావన, ఆట లేని సమావేశం
లేదంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మ ఆట, పాటతో, ఉద్యమం ఒక పోరాటరూపమై ఎదిగింది. ఉద్యమంలో కూడా స్త్రీలను భాగస్వామ్యం చేసింది. మహిళలు బోనం, బతుకమ్మలను ఎత్తుకొని వచ్చి పోరాట బిడ్డలకు స్వాగతం చెప్పి నుదుటన వీరతిలకం దిద్దారు.
బతుకమ్మ - పర్యావరణం: బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. పువ్వులనే దేవుడుగా కొలవడం, తమ బతుకులను కష్టాలనే పాటలుగా పాడుకోవడం ఒక్క తెలంగాణ ప్రజలకు మాత్రమే చెల్లింది. ఇంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మకు తెలంగాణలో ఎక్కడా గుడి కనిపించదు. ఎవరికీ బతుకమ్మ పేరు పెట్టుకోరు.
బతుకమ్మ పేర్చడంలో వాడే ఆకులు, పూలు, మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలపడం వల్ల నీటిశుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అయింది.
హోళీ పండుగ
వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్లను తొడుక్కుంటవి. కోకిలలు కూస్తాయి. కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి. ఆ సమయంలో జరుపుకునే రంగుల పండుగ ఇది. ఆడ, మగ, చిన్నా, పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగ హోళీ. ఇది అతి ప్రాచీనమైన పండుగ.
కామదహనం : హోళి పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. దీనివెనుక ఎన్నో కథలున్నా అవన్నీ చెప్పేది "చెడుపై మంచి విజయం సాధిస్తుంది" అన్నది ఒక్కటే. ప్రతియేడు ఫాల్గుణ మాసంలోని పున్నమిరోజున వచ్చే ఈ పండుగను కాముని పున్నం అని కూడా పిలుస్తారు. మనిషిలోని చెడు ప్రవర్తనను అంతం చేసి మంచిని పెంచే పండుగగా దీనిని అందరు భావిస్తారు. కామదహనం తర్వాత ఆ బూడిదను పొలాలల్లో కలుపుకుంటే పంటలు బాగా పండుతాయని రైతులనమ్మకం. ఇప్పటికీ కామదహనం రోజున తెలంగాణలో ఇంటింటికి ఒక పిడకను లేదా ఇంట్లోని పాతకట్టెలు, చెక్క వస్తువు లను ఒక్కచోట చేర్చి కామదహనం చేస్తారు. కామదహనవేళ వాటిచుట్టూ తిరుగుతూ, డప్పులు కొడుతూ, పాటలు పాడుతారు. తర్వాత కాలిస పిడక బూడిదను తెచ్చుకుని రైతులు కొత్త విత్తనాల్లో
కలుపుకుంటారు.
రంగుల పండుగగా హోళీ: మోదుగ పూలను తెచ్చి నీటిలో ఉడికించి రంగుగా తయారుచేసుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు, ఆనందిస్తారు. వివిధ చెట్ల ఆకులు, పూలతో రంగులు తయారు చేసుకొని చల్లుకోవడం వల్ల హెూళీ రంగుల పండుగగా ప్రసిద్ధి పొందింది.
పాటల పండుగగా హోళీ : తెలంగాణలో హెూళీ ఆనందదాయకంగా జరుగుతుంది. తెలంగాణలో పండుగ అనగానే పాట గుర్తుకొస్తుంది. ఇక్కడ ఏ పండుగైనా పాటతోనే ముడిపడి ఉంటుంది. పాట, ఆటలు కలబోసుకొని పండగ చేసుకుంటారు.
హోళీ పండగకు పదిరోజుల ముందు నుంచే పల్లెల్లో జాజిరిపాటలు, హెూళీ పాటల మోత మొదలవుతుంది. రాత్రిపూట మగపిల్లలయితే కోలలతో కొడుతూ ఆడపిల్లలయితే చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ డబ్బు, ధాన్యం వసూలు చేస్తారు. పండుగనాడు స్త్రీలు, యువతులు, పాటలు పాడుతూ ఎవరైనా డబ్బులుఇస్తే తీసుకొని పోతారు.
పిల్లలపాటలు : (
1) రింగురింగు బిల్లా రూపాయి దండ దండగాదురా దామెరమొగ్గ మొగ్గ గాదురా మోదుగ నీడ. నీడగాదురా నిమ్మలబాయి బాయిగాదురా బసంతకూర కూరగాదురా గుమ్మడిపండు
(2) ఆగుండీగుండు ఇత్తడి గుండు గుండువొయి బండతో రమ్మనిచెప్పె బండతో గుండు నేను రానని చెప్పె చెప్పేది చెప్పక కట్టెతో గొట్టె కొట్టిన కట్టెనే చెట్టయి మొలిచే
(3) అడేల్ తొడేల్ జింకపిల్ల జీడిమేకల గాయవొతె కేకకేకకు నన్నే పిలిచె చిక్కుడు కళ్ల బోడదిరా బోడదంటె బోడదిరా
TELANGANA హౌళీలరంగ
బోడి కొమ్ముల పయ్యదిరా..
పొద్దంతా పెద్దవాళ్లు పాడే పాటలు: (1) హొళి
హోళీ... చెమ్మ కేళీల హోళి హొళెంత రంగాయె హోళీ చెమ్మకేళీల హోళి.... నిమ్మచెట్టు కింద నిమ్మ చెట్టుకింద పోకురాజన్నా ... నిమ్మెక్కి వదినమ్మ నిమ్మెక్కి వదినమ్మ నీళ్ళు ఎగజల్లో...
వరుసైన వారిని పొగడుతు
పావు శేరు బుక్కగొని పక్క జేబులవోసుకుని వంగి వంగి సల్లవోతే ఓ దేవరెడ్డి సల్లవోతే సల్లనీయదో ఓ దేవలక్ష్మి కట్టినవు పట్టంచుదోతి పెట్టినవు జోడుంగురాలు తొవ్వనడిచి నువ్వేపోంగనో ఓ దేవరెడ్డి తొవ్వకడ్డం తానెవచ్చునో ఓ దేవలక్ష్మి..
ఈ పాటలన్నీ జానపద గీతాలే! ఎవరికివారు ఎప్పటికప్పుడు కట్టుకుని పాడుకున్నవే. మౌఖికంగా వేల ఏండ్లుగా అవి ప్రచారంలో ఉన్నాయి.
ఉద్యమంలో జాజిరి పాటలు: తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన అనేక పాటల మాతృకలన్నీ ఈ జాజిరి పాటల్లోనే ఉన్నవి. అచ్చమైన తెలంగాణ యాసలో ప్రజలభాషకు దగ్గరగా, ప్రజల నాలుకలమీద ఆదే
ఈ బాణీలు ఒక్క తెలంగాణ ఉద్యమంలోనే కాకుండా అంతకుముందు జరిగిన రైతాంగ పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు కూడా స్ఫూర్తినిచ్చే గేయాలయినవి. సుద్దాల హనుమంతు లాంటి ప్రజా కళాకారులు ఈ బాణీల్లోనే పాటలు అల్లుకున్నారు.
మిలాదున్నబీ :
మిలాదున్నబీ ముహమ్మదీయులు అత్యంత సంతోషముగా జరుపుకొను పండుగ. ఈ పర్వదినము ఇస్లామీ మాసమైన రబీయుల్ అవ్వల్ యొక్క 12వ తారీకున జరుపుకొంటారు. ముహమ్మదీయులు అంతిమ దైవ ప్రవక్తగా నమ్మే ముహమ్మద్ గారు మక్కా నగరము నందు జన్మించిన సందర్భముగానే ఈ పర్వదినము.
ముహమ్మద్ గారు బహుదైవారాధనను, విగ్రహారాధనను వ్యతిరేకించి విగ్రహ రహిత ఏకేశ్వరుని ఆరాధన వైపు ప్రజలను ఆహ్వానించారు. వారి అనుయాయులనే ముహమ్మదీయులనీ, వారు అనుసరించే మతమునే ఇస్లాం మతమని అంటారు. మనము సామాజిక జీవులమని, మన ప్రవర్తనతో మనం జీవించే సమాజము యొక్క సుఖ శాంతులు ప్రభావితమవుతాయని కావున సత్ప్రవర్తన కలిగి వుండాలని ఇస్లాం మతం బోధిస్తుంది. దైవారాధనతో పాటు సత్ప్రవర్తన కలిగిన వారితోనే దైవం సంతృప్తి చెందుతుందని, వారికే మోక్షం - స్వర్గం లభిస్తుందని ప్రవక్త బోధించారు.
మిలాదున్నబీ రోజున ముహమ్మదీయులు తమ ప్రవక్త జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటారు. ఈ పండుగకు రంజాన్, బక్రీద్ లాగా ఈద్గాహ్ వెళ్ళి సామూహిక నమాజు చేయడం ఉండదు. ఆ రోజు అత్యంత భక్తిశ్రద్దలతో రాత్రి మస్జిద్ లో ఇషానమాజ్ చేసిన తరువాత ప్రవక్త జీవన విధానాన్ని వారి బోధనలను కొనియాడుతారు.
ప్రవక్త ముహమ్మద్ గారి జీవన విధానం: ముహమ్మద్ ప్రవక్త గారు తమ జీవితంలో ఏ విషయం లోనూ
ఇతరులెవ్వరినీ నొప్పించకుండా ఇతరుల సాధక బాధకాలను తమవిగా భావించి వారికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తూ ఉండే వారు. తను చేసిన హితోపదేశాలన్నింటినీ తను పాటించి మరీ అవన్నీ ఆచరణ యోగ్యమే అని నిరూపించినారు. దైవ సందేశాన్ని తను ఆచరిస్తూ చక్కగా తన అనుయాయులకు బోధించారు. వారి జీవితాన్నే ఆదర్శంగా చేసుకుని ముహమ్మదీయులు తమ జీవితాన్ని నీతి-నిజాయితీగా గడుపుతారు. ప్రవక్త గారు బోధించిన ముఖ్యమైన హితోపదేశాలు- ఇస్లాం మతానికి మూల స్థంభాలు,
తను ఆరాధించే ఏకేశ్వరుని పై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండడం. (తౌహీద్)
ప్రతి రోజూ సూర్యోదయానికి ముందు, మధ్యాహ్నము, సూర్యాస్తమయమునకు ముందు, సూర్యాస్తమయము తరువాత మరియు రాత్రి పడుకునే ముందు ఇలా అయిదు పూటలు నమాజు S చేయటము. (నమాజ్)
రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష పాటించడం. (రోజా)
◆స్తోమత గలవారు ముహమ్మద్ ప్రవక్త గారి జన్మ స్థానమైన మక్కాలో కల కాబాను సందర్శించి ప్రదక్షిణలు చేయుట. (హజ్)
* స్తోమత కలిగినవారు తమ ఆదాయంలో నిర్ణీత భాగాన్ని దానం చేయడం. (జకాత్)
ప్రవక్త ముహమ్మద్ గారి బోధనలు :
మిలాదున్నబీ సందర్భంగా కొనియాడే ప్రవక్త గారి బోధనలు :
* ప్రపంచంలో కనిపించే ఏ వస్తువు అల్లాహ్ శక్తి కంటే పెద్దది కాదు.
* మనం ఆరాధించే ప్రభువు అల్లాహ్ ను పూర్తిగా విశ్వసించాలి, వారికి సమానమైన హోదాను వేరెవరికి కల్పించ కూడదు.
* ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరి మనసూ నొప్పించ కూడదు. గర్వపడ కూడదు.
విశ్వంలో జీవించే ఏ ప్రాణికీ ఎటువంటి హాని కలుగ చేయరాదు. ప్రాణులన్నింటికీ తమ వంతు సహాయ సహకారాలు అందించాలి. GANA
ఎట్టి సమయములోనూ నైతిక విలువలను వీడరాదు.
సత్యమును వీడరాదు. అబద్ధము మహా పాపము.
కోపమును నిగ్రహించుకొనాలి. కోపం వచ్చినప్పుడు మౌనాన్ని గ్రహించాలి. ఎవ్వరినీ అవమానించ కూడదు. వేరే వారి తప్పులను ఎత్తి చూపుట నేరము.
మన కోరికలను ఇతరులకోసం త్యాగం చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి.
మనం సంపాదించిన ధనమునే కాక ఏ వస్తువును కూడా వృధాగా ఖర్చు చేయరాదు. (నీటిని కూడా)
ఎల్లప్పుడూ పవిత్రంగానే ఉండాలి. అశ్లీలతను దరి చేరనీయ వద్దు. స్త్రీలను గౌరవించాలి.
ఆహార పదార్ధాలను, అన్న పానీయాలను జాగ్రత్తగా చూసి, సంతృప్తి చెందాకే సేవించాలి.
ఎవరి వద్ద నుండి ఏ వస్తువునూ ఆశించ కూడదు.
తల్లిదండ్రులను ఎట్టి పరిస్థితిలోనూ బాధ పెట్టకూడదు. వారిని సుఖ పెట్టి వారి ఆశీస్సులు పొందాలి.
మన హక్కులకై పోరాడుట కంటే ఇతరుల హక్కులను రక్షించుట పై ధ్యాస పెట్టాలి.
మన ప్రతి సుఖములోనూ పొరుగు వారినీ బంధు మిత్రులను భాగస్వాములను చేయాలి.
రోగులకు, అంగ వైకల్యం కల వారికి ఎల్లప్పుడు అండగా నిలవాలి. దయాగుణం కలిగి ఉండాలి.
ఇతర మతస్తులతో మర్యాదగా మెలగాలి. వారి భావజాలాలను గౌరవించాలి.
ఛాందసవాదాన్ని మన దరి చేరనివ్వ కూడదు.
మానవులే కాక ఏ ప్రాణిని కూడా బాధలో ఉంటే చూస్తూ ఊరుకో కూడదు. చేతనైనంత
సహాయాన్ని తప్పకుండా చేయాలి.
మత్తు పదార్థాలను సేవించడం మహా పాపం.
ఈ విధంగా మిలాదున్నబీ పండుగ రోజున ప్రవక్త జీవిత విశేషాలను మరియు వారి బోధనలను కొనియాడుట పరిపాటి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి