WWW.కారడవి.కామ్

 ఆధునిక సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోయే జనం పర్యావరణానికి మూగజీవాలకు హానిచేస్తున్నారు! మితిమీరిన సాంకేతికతతో ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఒకవేళ జంతువులు సైతం కంప్యూటర్లు వాడితే ఏం జరుగుతుంది? మానవాళిని అంతం చేస్తాయా? తమని తాము సంరక్షించుకుంటయా? ఏం జరుగుతుందో చూద్దాం. 


ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలోని దారులు తికమక పెట్టేవిగా ఉండేవి. అందువల్ల ఈ అడవిలోకి వెళ్ళడానికి వేటగాళ్ళు కూడ భయపడేవారు. చాలా ఏండ్లకిందట కొందరు వేటగాళ్ళు కారడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు తిరిగిరాలేదు. దాంతో ప్రజలు ఈ అడవి గురించి రకరకాల కథలు అల్లేవారు. అడవి దట్టంగా ఉండడంవల్ల తొవ్వ మరచిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖవాళ్ళు అనేవారు. పైగా, ఏ చెట్టుమీద కూర్చున్న ఏ పులి ఎప్పుడుదాడిచేస్తుందో? ఏ చిరుత ఎప్పుడు మెడపట్టుకుంటుందో? హఠాత్తుగా ఏ ఎలుగుబంటి ఎదురువస్తుందో? అనే భయం ఉండేది. అటవీశాఖవాళ్ళు నిర్మించిన రోడ్లమీద నుంచి కలపమోసే ట్రక్కులు వస్తూపోతూ ఉండేవి. కాని అడవికి 'గూండా జగ్గు దౌర్జన్యం విస్తరించినప్పటి నుంచి కాంట్రాక్టర్లకి కలపతో ట్రక్కులు నింపి పట్టుకొని వెళ్ళడం కష్టమైంది. జగ్గూ మనుషులు ప్రతి కాంట్రాక్టరుతో వేరువేరుగా మామూళ్ళు వసూలు చేసేవాళ్ళు.


కారడవిలో గత కొన్నిరోజుల కింద ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. బిహారి అనే కోతి చాలారోజుల నుంచి కనబడలేదు. అకస్మాత్తుగా అతడు తిరిగి కనబడగానే అడవి జంతువులు అతడు కనబడక పోవడానికి కారణం అడిగాయి. అందుకు బిహారి తాను పక్కనున్న పట్టణానికి కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళానని చెప్పాడు. ఇప్పుడు తను ఒక వెబ్సైట్ కూడ తెరిచానని చెప్పాడు. దానిపేరు www. కారడవి.కామ్. తరువాత అందరిని తను కంప్యూటర్ మొదలైనవి పెట్టిన చోటుకి తీసుకుని వెళ్ళాడు. అడవికి రాజయిన సింహం అడిగాడు. "బిహారీ! దీనివల్ల అడవి జంతువులకు ఏమిటి లాభం?” అని.


బిహారి అన్నాడు "ప్రభూ! ఇది కొత్త ప్రపంచపు అద్భుతం. కంప్యూటర్వల్ల ప్రపంచమంతా ఒకటే కుటుంబమైంది. మన కారడవి రహస్యాలు, సంగతులన్నీ నా వెబ్సైట్ ద్వారా ప్రపంచానికి తెలుస్తాయి.


"మూర్ఖుడా! ఎంత పనిచేశావు! మనందరి చావును పిలుచుకువచ్చావు." సింహం కోపంగా గద్దించింది. "లేదు ప్రభూ! అలా ఏమి జరుగదు. ఎవరికైనా ఏ సమాచారమైనా కావలసి ఉంటే ఈ-మెయిల్ ద్వారా నన్నే కదా అడగాలి. నేను నా ఈ-మెయిల్ చిరునామా - "బిహారి @ మెయిల్. కామ్" ఇచ్చిన. ఏ జంతువు నివాసం ఎక్కడ ఉందో దాన్ని చేరుకునే దారి ఏమిటో నేను ఎప్పుడూ చెప్పను".


సింహం వెళ్ళిపోయిన తర్వాత కోతి బిహారి అక్కడున్న జంతువులకు కంప్యూటర్ గేమ్లు చూపిస్తూ వినోదం కలిగించసాగాడు.


కారడవికి దగ్గరగా ఉన్న పట్టణం అనూప్ గంజ్. ఇక్కడ ముఖార్్సంగ్ ఎం.ఎల్.ఏ., ముఖ్యమైన నాయకుడు. గూండా జగ్గు దౌర్జన్యాన్ని నిలువరిస్తానని ఆయన ప్రజలకు మాట ఇచ్చాడు. ఇది విని జగ్గు మండిపడ్డాడు. ముఖార్సింగ్ను కిడ్నాప్ చేసి కారడవి మధ్యలో బంధించాడు. ప్రభుత్వానికి, పోలీసులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆ రాత్రి పోలీస్కమీషనర్ ఇంట్లో సమావేశం జరుగుతున్నది. అకస్మాత్తుగా కమీషనర్ గారి పది సంవత్సరాల కొడుకు రాజు ఆయాసపడుతూ వచ్చాడు. "నాన్నా! నేనిప్పుడే ఇంటర్నెట్లో ఒక కొత్త వెబ్సైట్ చూశాను. దానిపేరు www. కారడవి. కామ్, దాంట్లో నీకు కారడవి వివరాలు దొరకవచ్చు".


ఈ వింత వెబ్సైట్ గురించి అందరు పోలీసు అధికారుల్లో ఆసక్తి పెరిగింది. వాళ్ళు వెంటనే ఆ వెబ్సైట్ తెరిచారు. అందులో నిజంగానే కారడవి గురించి వివరాలు ఉన్నాయి. ఆ వెబ్సైట్లో, మరిన్ని వివరాల కోసం ఈ-మెయిల్ చిరునామా www. బిహారి.కామ్ అని ఉన్నది. ఇది ఎవరై ఉంటారు. ఒక కోతి వెబ్సైట్ని ఎట్లా తెరిచి ఉంటుంది? అయితే పోలీసు అధికారులు ఇప్పుడీ ప్రశ్నలన్ని వదిలిపెట్టి ముఖార్ సింగ్ గురించి తెలుసుకోవడానికి ఈ-మెయిల్ పంపారు. "అడవి దొంగ జగ్గునే ఎం.ఎల్.ఏ ముఖార్సింగ్ను ఎత్తుకు వెళ్ళిండు. నువ్వు అతడి నివాసమెక్కడ ఉందో, అక్కడికి చేరే మార్గమేమిటో చెప్పగలవా?" ఈ-మెయిల్ చదివిన కోతి బిహారికి ఈ విషయమంత అర్థమైపోయింది. అతడు వారికి పూర్తి అడవిమ్యాపుని పంపడంతో పాటు అక్కడిదాకా వారు చేరుకోవడానికి కోతుల ద్వారా దారిచూపే ఏర్పాటు చేశాడు.


బిహారి పంపిన మ్యాపు ప్రకారం వారు సరైనచోటుకు చేరుకున్నారు. అక్కడికి అసలు ఎవరైన చేరుకో గలరని జగ్గు కలలో కూడ ఊహించలేదు. అతడు తన అనుచరులతో జల్సా చేసుకుంటున్నాడు. హఠాత్తుగా పోలీసు కమాండోలు వారిని చుట్టుముట్టారు. జగ్గుకు సంభాళించుకునే అవకాశం కూడ దొరకలేదు. కన్నుమూసి తెరిచే లోపల అక్కడి దృశ్యం మారిపోయింది. ముఖార్సింగ్ విడుదలయ్యాడు. జగ్గు అతడి అనుచరులు నిర్బంధంలోకి తీసుకోబడ్డారు.


దీంతో కారడవిలో జగ్గు ముఠా అంతం అయింది. అందరు పోలీసులను మెచ్చుకున్నారు. పోలీసుల సిఫార్సుతో ప్రభుత్వం అత్యుత్తమ వెబ్సైట్గా www. కారడవి.కామ్.ను ప్రకటించింది. దీనితో కోతి బిహారి ధైర్యం ఇంకా పెరిగిపోయింది.


కోతి బిహారి తన గుహ బయట ఒక సైన్బోర్డు తగిలించేసరికి అడవంతా సందడి వ్యాపించింది. అక్కడ బిహారి ఒక కంప్యూటర్ సెంటరుని తన పేరు మీద ప్రారంభించాడు. 'కోతి బిహారి కంప్యూటర్ సెంటర్' అంటే కెబిసిసి అని సైన్బోర్డు కింద రాసి ఉన్నది. “రిజిస్ట్రేషన్ తెరచి ఉన్నది"... దానితో సాయంత్రానికల్లా రిజిస్ట్రేషన్ చేయించేవారితో పెద్దలైన్ ఏర్పడింది. ఇందులో ఎక్కువగా జంతువులు-పక్షులు, యువకులు, పిల్లలు ఉన్నారు.


బిహారి అడవిలోని పిల్లలకి, యువకులకి కాలుక్యులేటరు, మొబైలు ఫోను తెచ్చినప్పటి నుండి అడవంతా విప్లవం వచ్చినట్లయింది. మొబైలుఫోను దొరకడం వల్ల అడవిలోని జంతువులన్నింటికి ప్రమాదానికి అప్రమత్తమయ్యే సూచన లభిస్తూ ఉండేది. షేర్ సింగ్ సింహం లేళ్ళ వేటకి బయలుదేరగానే అన్ని జింకలు, తెల్లచుక్కల లేళ్ళు ఆఖరికి కుందేళ్ళు కూడ షేర్సింగ్ ఎక్కడినుంచి వస్తున్నాడో, ఒకరికొకరు వార్త నందించుకోసాగారు. ఫలితంగా షేర్ సింగ్ చాల రోజులవరకు ఆకలితో ఉండవలసి వచ్చింది. అందువల్ల షేర్ సింగ్ మనసులోనే కోతి బిహారిపైన కోపంగా ఉన్నది.


అడవిలోని మరికొన్ని జంతువులు కూడ కోతి బిహారి చేసిన పని లేదన్నవి. కంప్యూటర్ల వల్ల మన పిల్లలు పాడైపోతున్నారని అన్నవి. చిరుతపులి ఖాన్ మాత్రం దీనికి భిన్నంగ మాట్లాడింది. "మీరంత ముసలివాళ్ళయిపోయారు. మీ బతుకు మీరు బతికేశారు. మీ పిల్లలను వాళ్ళ బతుకెందుకు బతుకనీయరు? వారిమీద మీ అభిప్రాయాలను ఎందుకు మోపుతున్నారు ఈనాడు కంప్యూటర్ మొత్తం ప్రపంచంలో విప్లవం తెచ్చింది. బిహారి కారడవిలో ఎలక్ట్రానిక్ వస్తువులు తెచ్చినప్పటి నుండి మనం ఎంత ధనికులమయ్యామో! షేర్సింగ్ వేటాడ్డం మానివేసి శాకాహారి కావాలి. మామూలుగా కూడా ప్రభుత్వం అడవిలో వేటాడటం చట్టం ప్రకారం నేరమని ప్రకటించింది. అందువల్ల సోదరులారా! మీ పిల్లలను కొత్త ప్రపంచంతోపాటు నడువ నివ్వండి. జరుగుతున్నది మంచికే జరుగుతున్నది" అన్నది. మరి కొన్ని వాదనల తరువాత ఆ సమావేశం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది.


షేర్ సింగ్ వేటాడటం మానేశాక నక్క భోఖల్ ఆకలితో మాడసాగాడు. ఎందుకంటే నక్క భోఖల్ సింహం ఎంగిలిచేసిన మాంసం తిని బతికేవాడు. వాడి గూండా కొడుకు జయకాల్ (అందరు వాడిని జె.కె. అనే వాళ్ళు) కూడ తండ్రి తెచ్చినవి తిని హాయిగా ఉండేవాడు. ఇప్పుడు చాలా రోజులనుండి పస్తులుంటున్నాడు. ఒకరోజువాడు తన తండ్రి భోఖల్ను కోపగించు కున్నాడు. అప్పుడు భోఖల్ నక్క అన్నాడు. "నువ్వు ఏ బిహారి దగ్గర కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళుతున్నావో అతడు మన నెం. 1 శత్రువు అతడి పనులను ఆపకపోతే మనం తొందరలోనే చచ్చి పోతాం". నక్క జె.కె.కి విషయమేమిటో ఇప్పుడర్థమైంది. "అట్లా అయితే నేను కోతి బీహారికి జీవితంలో మరచిపోలేని గుణపాఠం చెబుతాను" అన్నాడు. మరునాడు జె.కె. పట్టణం వెళ్ళి కోతి బిహారీ కంప్యూటర్లను నాశనంచేసే వైరస్ ఉన్న ఫ్లాపీ తెచ్చాడు. కానీ కొండముచ్చు 'కాలూ' దీన్ని పసిగట్టి బిహారికి చెప్పింది. జయకాల్ బండారం బయటపడింది.


బిహారి సెక్యూరిటీ గార్డులు అతడిని ఎంతగా చితక్కొట్టారంటే, అతడు చాలా రోజులవరకు తన గుహ


లోపలనే ఉండి కేకలు పెడుతుండేవాడు.


బిహారిని ఎట్లాగైనా దెబ్బ తీయాలని జయకాల్ మళ్ళీ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ మల్లిక్ సైబర్కెఫేలో దూరాడు. వారి గురించి తెలుసుకోవాలనిపించి, "ఇంటర్నెట్ అంటే ఏమిటి?" అని అడిగాడు.


“ఇంటర్నెట్ ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే కంప్యూటర్ల నెట్వర్కు ఇది ప్రజలకు ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడంలో సాయపడుతుంది. కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా మీరు ఎన్నో వెబ్సైట్ల నుండి సమాచారాన్ని పొందవచ్చు. ఎవరితోనైనా మాట్లాడవచ్చు. స్నేహం చేయవచ్చు. అని చెప్పాడు షాపు యజమాని మల్లిక్, 'మరి సైబర్కెఫే అని రాశారు!' మళ్ళీ అడిగిండు జయకాల్,


“ఓ అదా! సైబర్ అన్న పదం సైబర్నెటిక్స్ నుంచి వచ్చింది. దీని అర్ధం యంత్రాలు, జీవం గల ప్రాణులు రెండింటిలో సమాచారం మరియు స్వయంగా నడిచే నియంత్రణ ప్రణాళికకు సంబంధించిన శాస్త్రం. దీనితో ఇంటర్నెట్లో సంచరించడానికి తీసుకున్న పదం సైబర్ అర్థమైందా?" "మరి కేఫే అంటే?” “దీనిని కాఫీ హౌసు అంటారు. అంటే ప్రజలు కాఫీ హౌజ్కు వెళ్ళి బాతాఖానీ కొట్టినట్టే, కొందరు కంప్యూటర్ గురించి మాట్లాడ్డం, బాతాఖానీ, సూచనల నిచ్చిపుచ్చుకోవడం మొదలైనవి చేస్తారు. అందువలన వీటిని కేఫే అంటే సైబర్ కేఫే అని అంటారు" అన్నడు మల్లిక్. బిహారీని ఓడించడానికి ఇదే సరైన మార్గమని భావించి 'జయకాల్ సైబర్ కెఫే' మొదలుపెట్టి సరిగా నడపలేక మళ్ళీ చేతులు కాల్చుకున్నాడు జయకాల్.


కానీ గుంటనక్క జయకాల్ తన కుటిల ప్రయత్నాలు మాత్రం మానుకోలేదు. తను కూడా కొన్ని


తెలివితేటలు సంపాదించి 'www. లకీఆజ్వీకె.కామ్' పేరుతో ఓ వెబ్సైట్ మొదలుపెట్టాడు. కారడవి సమాచారాన్ని అడవిదొంగలకు పెద్ద మొత్తాలకు అక్రమంగా అందించడం మొదలుపెట్టాడు. దీనివల్ల కారడవిలో ఐదు ఏనుగులు వేటగాళ్ళ తుపాకీలకు బలైపోయాయి. జంతువులన్నీ బిహారి దగ్గరకొచ్చి "నీవల్లే ఇదంతా జరిగింది. కంప్యూటర్లు వద్దని మొత్తుకున్నా వినిపించుకోలేదని" నిందించాయి. బిహారి వారిని శాంతపరిచి ఈ రహస్యాన్ని ఛేదిస్తాను. భయపడవద్దని హామీ ఇచ్చాడు. NA


మరుసటిరోజు పట్టణంవెళ్లి అక్కడే మూడురోజులుండి తిరిగి వచ్చాడు.


పట్టణం నుంచి బిహారి ఎంతో చాతుర్యంగా పాస్వర్డ్ డిటెక్టర్ సాఫ్ట్వేర్ తీసుకొని వచ్చాడు. ప్రతి వెబ్సైట్లో ఒక పాస్వర్డ్ అంటే ఒక రహస్యసంకేతం ఉంటుందని అతనికి తెలుసు, దానిద్వారా వెబ్సైట్లో ఏదైనా వివరాన్ని పెట్టవచ్చు లేదా తొలగించవచ్చు. ఆ సాఫ్ట్వేర్ సాయంతో బిహారి జయకాల్ వెబ్సైట్ పాస్వర్డ్ని కనిపెట్టాడు. తరువాత వెబ్సైట్ తెరిచి వివరాలన్నీ తారుమారుచేసేసి వెబ్సైట్ని హైజాక్ చేశాడు. అతడికి తెలుసు తాను హైజాకింగ్ చేసి సైబర్ం చేస్తున్నానని, కాని అందరి మంచికోరి చేసేపని నేరం కాదు.


జయకాల్ మరునాడు ఈ-మెయిల్ చెక్చేసినపుడు ఒక సందేశం ఇట్లా ఉంది. ముఖ్యమైన కొంత సరకు కావాలి. పోలీసులు జాగరూకులై ఉన్నారు. కలిసిన తరువాతే మాట్లాడుకుందాం. అమెరికన్ డాలర్లలోనే  చెల్లిస్తాం. ఎప్పుడు ఎక్కడ కలుస్తావో వెంటనే చెప్పు. పంపినవాళ్ళు బీబీ @ మెయిల్. కామ్. ఇది ఎవరో దొంగరవాణా కోసం వేటాడే వారి సందేశంలా ఉంది. జయకాల్ జవాబు పంపిండు. "సోమవారం-రాత్రి ఒంటిగంట. నల్లనది పాత మర్రిచెట్టు" పంపినవాళ్ళు 'లకీఆజ్ @ వీకె యాహూ.కామ్.'


మరునాడే సోమవారం రాత్రి జయకాల్ తన గుహనుంచి బయలుదేరాడు. మెల్లమెల్లగ, జాగ్రత్తగా నడవసాగాడు. అడవి నిశ్శబ్దంగా ఉంది. చాలసార్లు జయకాల్ తన కాలికిందపడి నలిగిన ఎండుటాకుల చప్పుడుకే ఉలికిపడ్డాడు. మర్రిచెట్టును సమీపించడానికి ముందు జయకాల్ నాలుగుదిక్కుల పరిశీలించి చూశాడు. అంత సరిగ్గా ఉండటంచూసి మర్రిచెట్టు కిందికివెళ్ళి నిలుచున్నాడు.


హఠాత్తుగా, కోతి బిహారి చెట్టుమీద నుండి దుంకి, అక్కడికివచ్చాడు. జయకాల్ అతడిని చూస్తూనే గాబరాపడ్డాడు.


"వంచకుడా! నీ ఆటలింక సాగవు. ఏనుగుల హత్యలు చేయించింది నువ్వే. నీ వెబ్సైట్ దీనికి సాక్ష్యం". కోతి బిహారి అన్నాడు. జయకాల్ పరిగెత్తబోయాడు. కానీ అప్పటికీ షేర్సింగ్, చిరుతఖాన్, గజరాజసింగ్ మొదలైన జంతువులు వానిని చుట్టుముట్టేశారు. కోపంగ ఉన్న గజరాజ్సంగ్ జయకాల్ను తొక్కెయ్యడానికి తన కాలు పైకెత్తిండో, లేదో ఇంతలో ముసలి నక్క ఖోఖల్ అతని కాలుపట్టుకొని, "నా ముసలితనంలో వీడే నా ఆసరా. వీడిని విడిచిపెట్టండి' అంటూ బతిమాలుకోవడం మొదలుపెట్టాడు. జయకాల్ బాగా తన్నులు తిని ఉన్నాడు. షేర్ సింగ్ అన్నాడు 'సరే, వీడిని వదిలెయ్యండి. కానీ వీడు ఇంక ఎప్పుడూ కారడవిలో కనబడకూడదు." మరునాడు బిహారి పోలీసులకు చెప్పి జయకాల్ వెబ్సైట్ను మూయించాడు.


ఒకరోజు అడవిలో జంతువులన్నీ టీవీలో ఒక సంచలన వార్త చూశాయి. పులులు, తోడేళ్ళు మొదలైన ఇరవైఅయిదు జంతువుల చర్మాలతోపాటు వాటిని దొంగరవాణా చేసే అయిదుగురిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. అడవికి రాజైన షేర్ సింగ్ మరునాడు ఉదయం పేపరు వచ్చినపుడు మొదటిపేజీలో వార్తనంతటినీ పూర్తిగా చదివాడు. అది అతణ్ణి కలవరపరచింది. అతడు గుహనుండి బయల్దేరి తిన్నగా బీహారి-కంప్యూటర్ సెంటరుకి వెళ్ళాడు. ఇలాంటి విషయాలలో బిహారి తెలివిగా సలహా ఇస్తాడని షేర్ సింగ్ కి తెలుసు.


"ఇదేవిధంగా పులులు, తోడేళ్ళ హత్యలు జరుగుతూపోతే పులివంశం అంతరించడానికి ఎంతోకాలం పట్టదు. డయనోసర్ లాగానే ప్రజలు, ఎపుడో పులులు భూమి మీద అడవులలో ఉండేవి అని పుస్తకాలలో మాత్రమే చదువుతారు" అని షేర్సింగ్ అన్నాడు.


"అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యగురించి ఆలోచించాలి. ప్రపంచంలోని ఇతరదేశాల పులులు, సింహాలను కూడ ఈ పనిలో చేర్చుకోవాలి. అప్పుడే ఈ సమస్య గురించి అందరు గంభీరంగా ఆలోచిస్తారు" అని ఈ సమస్యకు పరిష్కారం చెబుతూ బిహారీ అన్నాడు. "కాని, ఇతర దేశాల పులులు, సింహాలతో మాట్లాడటం ఎలా జరుగుతుంది?" షేర్ సింగ్ అడిగాడు.

ఇంటర్నెట్ ద్వారా" బిహారి అన్నాడు. "అదేమిటి?” షేర్సింగ్ ప్రశ్నించాడు.


అప్పుడు బిహారి ఇంటర్నెట్లోని అన్ని సౌకర్యాల గురించి వివరించాడు. షేర్సింగ్ ఇతర దేశాల పులులతో ఏవిధంగా చాట్ (సంభాషణ) చేయగలడో కూడా చెప్పాడు. షేర్ సింగ్ చాట్ చేయడానికి సిద్ధపడ్డాడు. కోతి బిహారి ఇంటర్నెట్లో షేర్సింగ్ ఛాట్చేసే ఆహ్వానాన్ని ప్రసారం చేశాడు. నిర్ణీత తేదీన నిర్ణీత సమయానికి షేర్ సింగ్ బిహారి కంప్యూటర్ ఎదుట ఛాట్ చేయడానికి కూర్చున్నాడు.


షేర్సింగ్ ఇంటర్నెట్లో ప్రపంచంలోని పులులన్నింటికీ నమస్కారం చెప్పాడు. చాట్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు. తరువాత అతడు పులులు, తోడేళ్ళు మొదలైన వాటిపై త్వరితంగా జరుగుతున్న హత్యలు, వాటి తోళ్ళ దొంగతనం, అంతర్జాతీయ మార్కెట్లో తోళ్ళ గిరాకి మొదలైన సమస్యలను


ప్రస్తావించాడు. సింహాల జాతి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందన్న విషయంపై తన ఆవేదన తెలిపాడు. ఆఫ్రికా సింహం సందేశం వచ్చింది. "ప్రపంచ వన్యజీవుల సంరక్షణ నుంచి సాయం ఎందుకు తీసుకోరు?"


షేర్సింగ్ : "ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో చిక్కుకుని ఈ పనులు ఆగిపోతున్నాయి."


మలేషియా సింహం. "మా అడవులలో చాలా ఖాళీ • చాలా ఖాళీ స్థలం ఎయిర్లైన్స్ విమానంలో కూర్చొని ఉంది. మీ పులులు, తోడేళ్ళు అన్నీ మా వచ్చేయండి. రాజకీయ రక్షణ దొరుకుతుంది."


చైనా నుంచి ఒక పులి 'ఎన్ని పులుల కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు పంపమంటారో చెప్పండి. నాయకుల్లాగా మీరు కూడ మీ రక్షణ ప్రయత్నాలు ఎందుకు చేసుకోరు? మీకు కావాలంటే మేము మీలో కొందరికి కమెండోల ట్రైనింగు ఇప్పిస్తాం."


షేర్ సింగ్ మలేషియా, చైనా పులులు ఇచ్చిన సలహాలకి ఆలోచించి సమాధానం ఇస్తానని చెప్పాడు. అమెరికాలోని ఏదో జూ నుంచి ఒక పులి సందేశం పంపింది. "మా సలహా ఏమిటంటే జాతిని రక్షించడం అవసరం. దీనికోసం అమెరికా శాస్త్రవేత్తలతో ఎందుకు మాట్లాడకూడదు? వారు క్లోనింగ్ ద్వారా పులులు, తోడేళ్ళ కొత్తజాతిని పుట్టించి పూర్తిసైన్యాన్ని తయారుచేస్తారు.”


షేర్ సింగ్కు క్లోనింగ్ అంటే అర్ధంకాలేదు. కోతి బిహారి చెప్పాడు. "ఏదైనా ప్రాణి నుంచి ఒక ప్రత్యేక (జన్యువు) జీన్ ను వేరుచేసి దానిని మరొక ప్రాణి కోశంలో చేరుస్తారు. ఈవిధంగా ఆ జీన్ కొత్త ప్రాణిలో పాతప్రాణియొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలని కలుగజేస్తుంది. 'డాలీ' అనే గొర్రె ఈవిధంగానే పుట్టింది."


"ఏమన్నావు? గొర్రెల్లాగ సింహాలను పుట్టిద్దామనుకున్నవా?” షేర్సింగ్ చికాకుగా ప్రశ్నించాడు.


తరువాత షేర్సింగ్, అమెరికాపులి మధ్య ఈరకంగా సంభాషణ జరిగింది. "అవి నిజం సింహాలవుతాయా?".


"పూర్తిగా నిజమైనవే. ఆకారం, పని, అలవాట్లు అన్నీ సింహంలాగే ఉంటాయి.”


“వీటిని ఎవరుపుట్టిస్తారు? వీటి తల్లి ఆడసింహమే అవుతుందా?"


“రాబోయేకాలంలో ఆడసింహం అవసరం కూడా ఉండదు. అంతా టెస్టట్యూబ్లోను, ప్రయోగశాలల్లోను అయిపోతోంది."


"ఏమన్నావు? ఆడసింహం లేకుండా కూడా పుడుతాయా? కాని అప్పుడు వాటిని సింహం పిల్లలని


ఎలాగా అంటారు? వాళ్ళెలా అనగలరు. మేము సింహం పాలుతాగామని నీకు తెలియదా, మేము


జాతిసింహాలం. మాకు పూర్తి వంశసంప్రదాయం ఉన్నది."


"ఈ పాతమాటలన్నీ మరచిపో, ప్రపంచం మారిపోతున్నది. శాస్త్రవేత్తలు, మనుషుల జాతిని కూడ మార్చబోతున్నారు."


షేర్ సింగ్ కోపంతో అరిచాడు, "నాకక్కరలేదు క్లోనింగ్ సింహం".


"క్లోనింగ్ సింహాలను పుట్టించి నేను భారతదేశం సింహాలను అవమానం చేయను. నువ్వు చూస్తూ ఉండు, నేను తొందరలోనే ఇక్కడి అన్ని సింహాలను ఒకచోట చేర్చి, వారిని రక్షించడానికి ఒక ప్రణాళికను తయారుచేస్తాను. మేము సింహాలం మరి" కోతి బిహారి కంప్యూటరు సెంటరు నుంచి బయటికి వచ్చి ఎంత గట్టిగా గర్జించాడంటే. పూర్తి అడవికి తెలిసిపోయింది రాజు అతడేనని.


జయకాల్ పెద్దన్న మైకాల్ పరమక్రూరుడు. జయకాల్ కొన్నాళ్ళు అతనితో కలసి కారడవికి ద్రోహం చేద్దామని చూశాడు. ఆ ఎత్తుగడలేవీ ఫలించలేదు.


ఒకసారి మైకాల్ కారడవిని మట్టుపెట్టడంలో సొంత తమ్ముడి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడ లేదు. ఈ సంఘటన జయకాల్ కన్ను తెరిపించింది. అతడికి జన్మస్థలమైన కారడవిపై ప్రేమకూడా పెరిగింది. మనసు మారిన జయకాల్ షేర్సింగ్, బిహారీ మొదలైనవారిని శరణువేడి తిరిగి కారడవిలోకి ప్రవేశించాడు.


జయకాల్ తన దుష్టస్వభావాన్ని వదిలిపెట్టి అడవికి పనికివచ్చే పనులు చేయసాగాడు. అతడి ఏకాగ్రతని చూసి కోతి బిహారి సలహాతో జయకాల్ని అడవికి సమాచారమంత్రిగా చేశారు. జయకాల్ సలహాతో అడవిలో రేడియో స్టేషను, టీవీ స్టేషను ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి జంతువులు కారడవిలో మొబైలు ఫోనుతోపాటు, పాకెట్ ట్రాన్సిస్టర్లని కూడా పట్టుకుని తిరుగసాగారు. తుఫాను, వరదలువంటి వాతావరణం సూచనలు తెలియడంవలన వారికి చాలా లాభమైంది. వేసవికాలంలో మండుతున్న ఎండలో చెట్టునీడన కూర్చుని పాటలు వినే ఆనందం దొరికింది. చలికాలపు సుదీర్ఘ రాత్రుళ్ళలో టెలివిజన్ సినిమాలు చూసి ఆనందం పొందసాగారు.


జయకాల్ తాను ప్రసారంచేసే కార్యక్రమాలు మనోరంజకంగా, ఉత్తేజంగా ఉండేలా చేయడానికెప్పుడూ సతమతమవుతూ ఉండేవాడు. అప్పుడే అతనికి ఒక ఆలోచన తట్టింది. అతడు జర్మనీ, జపాను, చైనా, అమెరికా వంటి ఎన్నో దేశాలకు ఉత్తరాలు రాసి, వారు తమ దేశాల్లో సర్కసుల్లో బంధించిన జంతువులను విడిచిపెట్టి కారడవికి పంపమని విన్నవించుకున్నారు. వారు మా గౌరవనీయ కళాకారులు. వారు ఇక్కడ మా ప్రసార కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పనికి జయకాల్ ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణకు చెందిన సంస్థల సహకారం కూడా అడిగాడు. జయకాల్ విన్నపానికి ప్రపంచంలోని అన్ని దేశాలవారు సహకారం అందిస్తామని ఉత్తరాలు రాయసాగారు. ఎందరో పర్యావరణవేత్తలు అతనికి అభినందనలు చెబుతూ 'ఇది చాలా మంచిపని అనీ, దీనికి సాయపడడానికి తాము సిద్ధంగా ఉన్నామని' సందేశాలు పంపారు.


నేను ప్రపంచదేశాలకి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు నా విన్నపంతో సర్కసు జంతు కళాకారు లను కారడవికి పంపుతున్నారు. మీరంతా తొందరలోనే వాటి కార్యక్రమాలని కారడవి రేడియో, టీవీలలో వినవచ్చు, చూడవచ్చు." అన్నాడు జయకాల్.


కారడవి టీవీలో అన్ని సర్కసులనుంచి వచ్చిన సింహాలు, ఎలుగుబంట్లు, కోతులు, పక్షులు తమ మనోహరమైన విన్యాసాలను చూపిం చూపించసాగారు. నృత్యాలు, సంగీతం, నాటకం మొదలైన కార్యక్రమాలు కూడా ప్రసారమవుతూ ఉండేవి. ఆ టీవీ ఛానెల్ తొందరలోనే జనుల ప్రియమైన ఛానెల్ అయిపోయింది. అన్ని దేశాలవాళ్ళు దీనిని చూడసాగారు.


కారడవి టీవీ చానెల్ జనప్రియ ఛానెల్గా మారడానికి మరొకకారణం దీనిలో కార్టూన్ చిత్రాల కథలు సజీవంగా చూపబడేవి. ప్రపంచంలోని పిల్లలందరూ దీనిని ఇష్టపడేవాళ్ళు. ప్రపంచంలోని ఎందరో పర్యావరణ ప్రేమికులు కూడ దీనిని ప్రశంసించేవారు. ఎందుకంటే ఈ ఛానెల్ వన్యజంతువుల భద్రత, వివిధరకాల జంతువుల నుంచి రక్షించుకోవడానికి సంబంధించిన వివరాలు తెలియజేసేది. దీనిలో ఒక వార్తాబులెటిన్ కూడ ప్రసారం చేయబడేది. దీనిలో ప్రపంచంలోని వన్యప్రాణుల నేటిపరిస్థితి, వాటిమీద జరుగుతున్న అత్యాచారాల వాస్తవకథలు ప్రసారమవుతూ ఉండేవి.


కారడవి వెబ్సైట్, కారడవి టి.వి. ఛానెల్, కోతి బిహారి కంప్యూటర్ సెంటర్ మొదలైనవాటితో కోతి బిహారి కారడవి ప్రతిష్ఠని మరింత పెంచాడు. ఇప్పుడు కారడవి ప్రపంచంలోని అడవులన్నింటికీ ఆదర్శ వంతమైన అడవి. దీని వెనుకనున్న ముఖ్యపాత్ర కోతి బిహారీయే!


www. కారడవి. కామ్.


నేషనల్ బుక్ ట్రస్ట్



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana