https://www.youtube.com/watch?v=7TgSCEQYUpI&list=RD7TgSCEQYUpI&start_radio=1 పల్లవి:  ‘ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..  చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..  చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా..  వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా  ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..  ఒక్కసారి చూడరా.. పిల్లడా  చక్కనైన.. చుక్కరా చక్కనైనచుక్కరా..  నిన్నుకోరు కుందిరా సుందరా..  ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..  చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..  చరణం:1  నీ ప్రేమలో ఆరాధనై.. నీ నిండుగా మునిగాకా  నీ కోసమే.. రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ  చేరునో.. చేరదో తెలియదు ఆ కానుక..  ఆశనే వీడకా.. వెనుక పడెను మనసు పడిన మనసే  ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..  ఒక్కసారి చూడరా.. పిల్లడా  చరణం 2:  ఉన్నానిలా.. ఉంటానిలా నీ నీడగా కడదాకా  కన్నీటిలో కార్తీకపు దీపాన్నిరా నువులేక  దూరమే భారమై.. కదలదు నా జీవితం  నీవు నా చేరువై.. నిలిచి మసలు మధుర క్షణములెపుడో..  ‘ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా..  చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా..  చెలి చూపు తాకినా.. ఉలకవా పలకవా..  వలవేసి వేచి చూస్తున్నా.. దొరకనే దొరకవా  ఇష్టమైన సఖుడా.. ఇష్టమైన సఖుడా..  ఒక్కసారి చూడరా.. పిల్లడా  చక్కనైన.. చుక్కరా చక్కనైన చుక్కరా..  నిన్నుకోరు కుందిరా సుందరా..

సింగర్: చిన్మయి శ్రీపాద  సంగీతం: గోపి సుందర్  లిరిక్స్: చైతన్య ప్రసాద్  నటీనటులు: సమంత, నాగ చైతన్య  కథ, దర్శకత్వం: శివ నిర్వాణ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana