పోస్ట్‌లు
జూన్, 2024లోని పోస్ట్‌లను చూపుతోంది
ఆరుట్ల కమలాదేవి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అందరిలాగే సామాన్య కుటుంబంలో జన్మించింది... నాటి సామాజికస్థితికి అనుగుణంగా బాల్యవివాహం జరిగింది... భర్త ప్రోత్సాహంతో చదువుకుంది. ఒక్కో మెట్టు ఎదిగింది... రాజకీయ అవగాహనతో చురుగ్గా ఉద్యమాల్లో పాల్గొంది... సాయుధ పోరాటంలో పాల్గొని తుపాకీ పట్టింది... శాసనసభ్యురాలై ప్రజాసమస్యల్ని పరిష్కరించింది... తెలంగాణ జనం గుండెల్లో చిరస్మరణీయురాలైంది... ఆమె ఎవరో ఇంతవరకూ చెప్పలేదుకదూ! ఇన్ని విశిష్టతలున్న తెలంగాణ మహిళాతేజం ఆరుట్ల కమలాదేవి! ప్రజలే తన దేవుళ్ళన్న పవిత్ర ఆత్మకు జేజేలు! సమానత్వమే సార్థకతయని నమ్మిన సాధ్వికి జేజేలు!! కొందరు పుట్టి భూమికి భారమవుతారు. ఎక్కువమంది కుటుంబం కోసం శ్రమిస్తారు. కొద్దిమంది మాత్రమే అందరికోసం తమ జీవితాలను అంకితం చేస్తారు. అట్లాంటి కొద్దిమందిలో ఆరుట్ల కమలాదేవి ఎర్రగులాబీలా వికసించి తాను పుట్టిన నేల తల్లి పాదాలపై రాలిపోయింది. తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు. ఉన్నత ఆశయాలు కల్గిన కమ్యూనిస్టు. ఆంధ్రరాష్ట్ర మహిళా ఉద్యమ నిర్మాణంలో నిరంతర కృషి చేసిన ధీరవనిత. నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్స్వార్థంగా, అంకితభావంతో పోరాటం చేసిన వీరవనిత ...
WWW.కారడవి.కామ్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఆధునిక సాంకేతిక ప్రవాహంలో కొట్టుకుపోయే జనం పర్యావరణానికి మూగజీవాలకు హానిచేస్తున్నారు! మితిమీరిన సాంకేతికతతో ప్రమాదాలకు కారణమౌతున్నారు. ఒకవేళ జంతువులు సైతం కంప్యూటర్లు వాడితే ఏం జరుగుతుంది? మానవాళిని అంతం చేస్తాయా? తమని తాము సంరక్షించుకుంటయా? ఏం జరుగుతుందో చూద్దాం. ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలోని దారులు తికమక పెట్టేవిగా ఉండేవి. అందువల్ల ఈ అడవిలోకి వెళ్ళడానికి వేటగాళ్ళు కూడ భయపడేవారు. చాలా ఏండ్లకిందట కొందరు వేటగాళ్ళు కారడవిలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళు తిరిగిరాలేదు. దాంతో ప్రజలు ఈ అడవి గురించి రకరకాల కథలు అల్లేవారు. అడవి దట్టంగా ఉండడంవల్ల తొవ్వ మరచిపోయే ప్రమాదం ఉందని అటవీ శాఖవాళ్ళు అనేవారు. పైగా, ఏ చెట్టుమీద కూర్చున్న ఏ పులి ఎప్పుడుదాడిచేస్తుందో? ఏ చిరుత ఎప్పుడు మెడపట్టుకుంటుందో? హఠాత్తుగా ఏ ఎలుగుబంటి ఎదురువస్తుందో? అనే భయం ఉండేది. అటవీశాఖవాళ్ళు నిర్మించిన రోడ్లమీద నుంచి కలపమోసే ట్రక్కులు వస్తూపోతూ ఉండేవి. కాని అడవికి 'గూండా జగ్గు దౌర్జన్యం విస్తరించినప్పటి నుంచి కాంట్రాక్టర్లకి కలపతో ట్రక్కులు నింపి పట్టుకొని వెళ్ళడం కష్టమైంది. జగ్గూ మనుషులు ప్రతి కాంట్రాక్టర...
మన పండుగలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
తెలంగాణ పడుచు బోనమెత్తితే దుర్గమ్మ పరవశిస్తుంది! తెలంగాణ పడుచు బతుకమ్మ ఆడితే ప్రకృతి పులకరిస్తుంది! హిందూ ముస్లింల అలయ్బలయ్ లు తెలంగాణతో మమైకం! గంగాజమునా తెహజీబ్ తెలంగాణకే ప్రత్యేకం! మనకంటూ ప్రత్యేక విశిష్టత... మనదంటూ ప్రత్యేక సంస్కృతి... మన సంస్కృతిలోని పండుగల వైభవాన్ని ఆస్వాదిద్దాం! మనం ఎన్నో పండుగలు జరుపుకొంటాం. ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. కొన్ని చరిత్రకు సంబంధించి, కొన్ని భక్తికి సంబంధించి, కొన్ని కాలగమనానికి సంబంధించిన పండుగలు. ఏండ్లకేండ్లుగా మనిషిలో ఒక స్ఫూర్తిని నింపి మంచిని బోధించేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నవి. ఇప్పుడు మన తెలంగాణలో జరుపుకొనే ముఖ్యమైన కొన్ని పండుగల గురించి తెలుసుకుందాం! బతుకమ్మ పండుగ : తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకువచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూలజాతర. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజశుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తూ జరిపే పండుగ. ఇది తెలంగాణకు మాత్రమే సంబంధించిన పండుగ. బతుకమ్మ : వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక కూడా అనేక కథలున్నవి. చోళరాజు అయిన ధర్మాంగదునికి వందమంది కుమారులు పుడతా...
రుద్రమదేవి
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
16... అబలలు సబలలు అని నిరూపించింది! వనితలు వీరవనితలుగా నిలబడతారని ఋజువు చేసింది! కార్యాలోచనలో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకుంది! రణరంగంలో కత్తిపట్టి యుద్ధంచేసి... విజయదుందుభి మ్రోగించింది! వీరనారిగా... ధైర్యసాహసాలు ప్రదర్శించి రాణి రుద్రమగా నిలిచిన చారిత్రక ధ్రువతారగూర్చి చదువుకుందాం! మార్గదర్శకంగా తీసుకుందాం! తెలంగాణను పాలించిన రాజవంశాలలో కాకతీయులు చిరస్మరణీయులు. కాకతి వంశ మూలపురుషుడు వెన్నరాజు, కాకతీయులలో ప్రసిద్ది చెందిన మొదటి రాజు ఇతడు. ఆ వంశంవాడైన మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుడు క్రీ.శ. 1198 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. ఇతనికి పుత్రసంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీ.శ. 1262 నుండి 1289 వరకు పాలించింది. అట్లా దక్షిణభారతదేశంలో మొదటిమహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. రుద్రమకు పుత్రసంతానం లేనందున ఆమె కూతురు ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడు క్రీ.శ. 1289 నుండి 1323 వరకు పాలించాడు. ఇతని కాలంలోనే ఓరుగల్లు పతనమయింది. గణపతిదేవ చక్రవర్తి, సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీ.శ. 1220 సంవత్సరంలో జన్మించింది. గణపతిదేవుడు పుత్రసంతానం కొరకు నారమ్మ, పేరమ్మ...
అద్భుతమైన సెలవులు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
అద్భుతమైన సెలవులు సెలవులు వచ్చాయంటే పిల్లలందరికి ఎంతో సంబురం! అమ్మమ్మ తాతయ్యల దగ్గరకో... మరో చుట్టాల దగ్గరకో వెళ్ళాలని తాపత్రయం... సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారందరూ... సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు... అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సాయపడ్డారో పాఠంద్వారా తెలుసుకుందాం! అవి శీతకాలపు సెలవురోజులు, సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలసి ఆడుకోవటం తప్ప వేరే పనే లేదు. ఏ మాత్రం సాహసోపేతంగా గానీ, ఉత్సాహంగా గానీ లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మానాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాల పని ఉండడంవల్ల ఇదివరకటివలె కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళలేకపోయారు. మెత్తలతో కొట్టుకుంటూ, ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే, వాళ్ళ పిన్ని సావిత్రి, "ఏమిటిది? వెళ్ళండి. పనికి అడ్డురాకండి," అన్నది. అబ్బా ఇంకేం చేయాలె మేము?" " వాళ్ళ విసుగును లెక్కపెట్టకుండా, "ఈ మెత్త తొడుగులూ, కుషన్లూ, పాడుచేయకండి, మీలాంటి పిల్లలు ఆడవలసిన ఆట కాదిది," అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని. విసుగ్గా, గట్టిగా “...
పి.వి. నరసింహారావు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
పి.వి. నరసింహారావు భారత రాజకీయాలలో అపరచాణక్యుడనే పేరు, గాంధీ, నెహ్రూ కుటుంబాలకు చెందని తొలి కాంగ్రెస్ నేతగా ప్రధాని పదవీకాలాన్నీ పూర్తిచేసిన అరుదైన ప్రతిష్ఠ, మైనారిటీ ప్రభుత్వాన్ని నిలకడగా నిబ్బరంగా అయిదేళ్ళు నడిపించిన 'తెలుగు నేతృత్వం' ఇవన్నీ తలచుకోగానే గుర్తుకువచ్చే పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. స్థిత ప్రజ్ఞుడు.... సంస్కరణశీలి ... అపర చాణక్యుడు న్యాయశాస్త్రజ్ఞుడు ... బహుభాషా కోవిదుడు ... అందరికీ అయిన వాడు. మన తెలంగాణ మహనీయుడు సాహిత్య సుగంధాలను వెదజల్లినవాడు "లోపలి మనిషి'ని అందంగా ఆవిష్కరించినవాడు.. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండట మెట్లాగో తెలిసినవాడు.... దక్షిణ భారతం నుండి మొట్ట మొదటగా ప్రధాని పీఠం అధిష్ఠించిన వాడు పై మాటలు వింటుంటే గుర్తుకు వచ్చే వారెవరో తెలుసా? భారతదేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతూ పతనోన్ముఖంగా పరుగులు తీస్తున్న దశలో 'ప్రధాని' పగ్గాలు చేపట్టి చక్కదిద్దిన ధీశాలి, మన తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వేంకట నరసింహారావు. పి.వి. నరసింహారావు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి, బహుభాషా కోవిదుడు. నిజాం వ్యతిరేక పోరాటంలో రాటు దేలిన తరానికి చెం...
జానపద కళలు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
జానపద కళలు తెలంగాణ పల్లెల్లో ఆటలకు, పాటలకు విడదీయలేని బంధం ఉన్నది. ఇక్కడి సాహిత్యం ప్రజా సాహిత్యం. ఇక్కడి కళలు ప్రజాకళలు, పాటలు, గేయాలు, కథలు మొదలైన అపారమైన సారస్వతము అనేక కళారూపాల్లో వైభవాన్ని పల్లె ప్రజల నాలుకల మీద నాట్యమాడుతాయి. అవే జానపదకళలు. ఇవి తెలంగాణ ప్రజల కళాభిరుచికి చక్కని నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆ జానపద కళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం. జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, చిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి జానపద కళలకు ఉదాహరణలు, భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం. యక్షగానాలు : కొన్నిచోట్ల వీటిని బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలగ...
ఇల్లు-ఆనందాల హరివిల్లు
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఇల్లు-ఆనందాల హరివిల్లు భారతీయ కుటుంబ వ్యవస్థ అనుసరణ యోగ్యమైనదని అంతర్జాతీయ సమాజం అనేక ప్రశంసలు కురిపించింది. తీయని అనుబంధాల సమాహారం, ఆత్మీయతల మందిరం అయిన ఇల్లు, కుటుంబం యొక్క గొప్పదనం తెలుసుకుందాం. కుటుంబ విలువలు కాపాడుకుందాం. పక్షి ఆకాశమంతా విహరించి వచ్చినా తిరిగి చేరుకునేది తన గూటికే. మనిషికూడా ప్రపంచంలోని నగూటికే అద్భుతమైన ప్రదేశాలెన్నింటినీ తిరిగినా చివరకు చేరుకునేది తన ఇంటికే. అందుకే మనిషి జీవితంలో ఇంటికి చాలా ప్రాధాన్యం ఇంటికే. ఉన్నది! ఇల్లంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, రాళ్ళతో కట్టిన నాలుగు గోడల నిర్మాణమో, ఓ పూరిగుడిసో, ఓ బంగళానో, భవనమో కాదు. ఇల్లంటే మన భావోద్వేగాలన్నింటినీ పంచుకునే అనుబంధాల వేదిక. ఇల్లంటే అమ్మ, ఇల్లంటే నాన్న, ఇల్లంటే కుటుంబసభ్యులు అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు తాతయ్య, నాన్నమ్మ, ఇదే కుటుంబం. ఇట్లు సుఖసంతోషాల వాకిలి. ఆనందాల లోగిలి. ప్రేమానురాగాల పల్లకి, తల్లిదండ్రులు పిల్లలు కలిసి ఉండే ఒక అందమైన ఆత్మీయ ప్రదేశం. సామాజిక, మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయంలో "ఒకే గొడుగునీడలో ఉంటూ, మానసిక, ఆర్థిక సహాయ సహకారాలందుకుంటూ, సహజ ఆమోదయోగ్యమైన సంబంధాలున్న స్త్రీ, పురుషులు,...
చిందు ఎల్లమ్మ
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
చిందు ఎల్లమ్మ మూలం : డా|| కె. ముత్యం జానపదకళల్లో ఒక ప్రత్యేకతను సంతరించుకున్న కళారూపం చిందు బాగోతం. తన అలంకారంలో స్త్రీ, పురుష పాత్రలను సమర్థంగా పోషిస్తూ, ఆబాలగోపాలాన్ని రంజింపచేసిన చిందు కళాకారిణి చిందు ఎల్లమ్మ. చిందు బాగోతం ప్రదర్శన గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నేను చిందుల ఎల్లమ్మను. మాది నిజామాబాద్ జిల్లాలోని చిన్నాపురమనే పల్లెటూరు. మేము మాతాతల కాలం నుండి ఇదే ఊర్ల ఉంటున్నం. నాకుబాగా యాదికున్నది. ఒకనాడు మా నాయన ఏమన్నడంటే "ఆ శెరువు కట్ట కడుతున్నప్పుడు పుట్టినవు బిడ్డా" అని. దాన్నిప్పుడు మనం నిజాంసాగర్ అంటున్నం. నేను బాసరల పుట్టిన్నట. అందుకే మా నాయన నాకు సరస్వతి అని పేరు పెట్టిండు. తర్వాత ఎల్లమ్మ తల్లిగ మార్చిండ్రు. మాచిందులోల్లకు పూర్వం ఇనాములేమి లేకుండె. చిందాట ఆడుకుని బతుకుతుండేటోళ్లం. మా ఊళ్లో ఎక్క అయ్యగారు అని ఒకాయన చదువు చెప్పుతుండె. ఆయన దగ్గరకు సదువుకునెటందుకు పోదామనుకుంటే మాకు పలకలు దొరకక పోయేవి. అక్షరాలు పెట్టిచ్చినందుకు మేము ఆయనకు ఏమీ ఇచ్చెటోళ్లం గాదు. ఎందుకంటే ఇచ్చెతందుకు మాతాన ఏముండేదిగాదు! ఇంకోముచ్చట జెప్పుడు మర్చిపోయిన! మాతాన పలకలు లేకుండే అని చెప్పిన గ...
షోయబుల్లాఖాన్
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
షోయబుల్లాఖాన్ మూలం : చెర్విరాల బాగయ్య పత్రికలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నకాలం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తా ప్రచురణ చేయడానికి సాహసించని పరిస్థితులు. అయినప్పటికీ తన 'ఇమ్రోజు’ పత్రికద్వారా నిజాం ప్రభుత్వ విధానాలను, రజాకార్ల దుశ్చర్యలను ఎండగట్టిన కలం యోధుడు. సత్యప్రకటన తన జీవితానికి చరమగీతం పాడుతుందని తెలిసినా వెనుకంజవేయని ధీశాలి. నిజాన్ని నిర్భయంగా రాసి రజాకార్ల చేతిలో బలైన అమరుడు షోయబుల్లాఖాన్ జీవితాధ్యాయాన్నిచదువుదాం. వీరజనని శ్రీ భారతమాతను మహామహుండగు మహాత్మగాంధిని జనవందితుడగు జవహర్లును పూజనీయుడగు బోసుబాబును వందనీయుడగు వల్లభ్ భాయిని పరిపరి విధముల భారత వీరుల ప్రస్తుతింతు నా భావము లోపలనూ తందాన తాన ఆస్తికత్వమున ఆనందముతోనూ తందాన తాన తందాన భాయి రాజవందనాన తందాన తాన హాస్యం : అరే భాయి యేదైనా కథ మొదలు పెట్టేటప్పుడు మూలపురుషులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో లేక విఘ్నేశ్వరున్నో గ్రామదేవతనో తలంచుటొప్పుగాని భారతమాత నట, మహాత్మాగాంధీయట, జహ్వారులాలట C ఈ క్రొత్తక్రొత్త దేవతలెవరో కాని నేనవి విని యెరుంగలేదు. కథ : ఓహో! నీవింకా నిద్రలో నుండి కలలుగంటున్నావన్నమాట. పైన పేర్కొన్న వారలు మన భార...