రామాయణం అయోధ్యా కాండం

 అయోధ్యా కాండం


దశరథునికి పుత్రులమీద ఎంతో ప్రేమ వారిని తన శరీరం నుండి పుట్టిన నాలుగు చేతులుగ భావించాడు. ఈ నలుగురు కుమారులలో భరత, శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడంవల్ల బెంగపెట్టుకున్నాడు. వాళ్ళను మళ్ళీమళ్ళీ తలచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరామునిమీద మక్కువ ఎక్కువ దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు. మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు. శరణన్నవారిని కాపాడతాడు. కోపం, గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు. పరుల సంపదను ఆశించనివాను దీనులను ఆదుకొనేవాడు. కాలాన్ని వృథాచేయకుండా జ్ఞానులతో, సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. వినయశీలి, తల్లిదండ్రులపట్లా, గురువులపట్లా నిశ్చలభక్తి కలవాడు. సోమరితనం, ఏమరుపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ, మాత్సర్యం లేనివాడు, ప్రజలపట్ల వాత్సల్యం కలవాడు... ఇన్ని మంచిగుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు, ప్రజబందరికీ పరమ ప్రీతి.


సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక దీనికి తోడు "నేను జీవించి ఉన్నప్పుడి శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది? నేనెంతగా సంతోషిస్తానో?" అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు, మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముని యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరకు నచ్చినట్లైతేనే. అనుమతినివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలుకలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెవియన్నాడు (ప్రజానురంజకపాలన అంటే ఇదే.) సభలోనివారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశాడు.


రాజాజ్ఞమేరకు వసిష్ఠుడు మంత్రులను, అధికారులను యౌవరాజ్యపట్టాభిషేకమహోత్సవానికి ఏర్పాట్లను ఆదేశించాడు. దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశనమడు శ్రీరాముక అక్కున జేర్చుకున్నాడు. బంగారు సింహాసనంమీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ "రామా! నీ సుగుణ మెప్పించావు. కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంద జితేంద్రియుడివి కావాలి..." అంటూ రాజధర్మాలను నూరిపోశాడు.. తండ్రివద్ద సెలవుతీసుకొని అయినా కావ్యవ వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులందుకున్నాడు. వసిష్టుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను గైకొన్నారు.


శ్రీరామ పట్టాభిషేక మహోత్సవంకోసం అయోధ్య తననుతాను అలంకరించుకుంది. నగరమంతా ఆనందశోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంధర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంటవచ్చిన అరణపుదాసి మంథర, పరుగు పరుగున కైకేయి దగ్గరకి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి, వార్త చెప్పినందుకు మంథరకు విలువైన బహుమానాన్నందించింది. నిశ్చేష్టురాలైంది మంధర, "దుఃఖించవలసిన సమయంలో ఎందుకుసంతోపిస్తున్నావని నిలదీసింది కైకేయిని. "నాకు రాముడు, భరతుడు అద్దరూ సమానమే. రాముడు పట్టాలికుడు టి అంతకన్నా నాకు ఆనందమేముంటుం దన్నది కైకేయి..


కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర, 'రాముడు రాజైతే గౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు. మాతోపాటు నీవు కూడా అమెకు దాసినవుతావు రామునికి నీ కొదుకు దాస్యం చేయాల్సివస్తుంది. రాష్ట్రంది సంతానానికి తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయిజ మనును మారింది. (నెప్పుడు మాటలు వేటుకు కారణం.) తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరను కోరింది కైకేయి, గతంలో దశరథుడు ఇచ్చిన రెండు వరాలను ఇప్పుదుపయోగించుకొమ్మని సూచించింది మంధర. ఈ సూచన మేరకు దశరథుని వలన వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి.


దశరథుడు శ్రీరాను పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయివద్దకు వచ్చాడు. కటికనేలపై ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కాని అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. వీల నేయాలో పాలుపోలేదు. విషయమడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి "నాకొక కోరిక ఉంది. దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వలన్నది ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముని మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకెల మనసులోని మాటను చెప్పేసింది. "గతంలో మీరిచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముని కోసం ఏర్పాటుచేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరెలు, జింకచర్మం ధరింది. జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపసవృత్తిలో పదునాల్గు సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరాలి" అని కోరింది.


కైకేయి మాటలకు స్పృహకోల్పోయాడు దశరథుడు కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో 'నైజా! రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడికన్నా ఎక్కువగా నిన్సు సేవించాడు. అటువంటివాణ్ణి అడవుల పాజ్జేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను వేతులు జోడిస్తున్నా నీ పాదాలు పట్టుకొంటా... రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్ద"ని బతిమాలాడు. కైకేయి మారలేదు (కఠినశిల కన్నీటికి కరుగుతుండా?)


శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది రాజాపై కావాలన్నాడు సుమంత్రుడు. "శ్రీరాముణ్ణి చూడాలని ఉంది వెంటనే తీసుకురొమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు, శ్రీరాముడు వచ్చి, దశరథుడికి, కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు కన్నీళ్ళు తప్ప తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు. దాశరథి కైకేయిని అడిగాడు. "గతంలో నాకిచ్చిన రెండు వర్గాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని. వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణంచేస్తే చెపుతాను" అన్నది కైకేయి.


రాముడు క్షణం కూడా ఆలోచించలేదు "నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా, సముద్రంలో దూకరానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెపితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడినమాట తప్ప"డని పలికాడు. (శ్రీరాముని పిశృభక్తి, సత్యానురక్తి అలాంటివి.)


కైకేయి రెండు వరాలను గురించి చెప్పింది. రాముని ముఖంలో ఎలాంటి మార్పులేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం, స్థితప్రజ్ఞుని లక్షణం. "అమ్మా! నీవు చెప్పినట్లే చేస్తా భరతుడంటే నాకు ప్రాణం. అతన పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెపితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యకాంక్ష లేదు, తండ్రికి సేవచేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడంకున్నా మించిన ధర్మాచరణం బాసలరు ఇంకోవటి. టీవేలేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా! అది చాలు నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు.


శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహకోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు సమస్పరించారు. అంతఃపురం నుండి బయటకు వచ్చారు. లక్ష్మణునితో కలసి కౌసల్యామాతను దర్శించుకున్నారు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలిచేత నరికిన మద్దిచెట్టులా నేల మీద పడిపోయింది.. అంతులేని అవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్యా లక్ష్మణులు పరిపరివిధాల శ్రీరామునికి నచ్చజెప్పజూశారు. కాని శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గారు. వెళ్ళక తప్పదన్నారు. కైకేయిపట్ల తనకు ఏమాత్రం అనాదరభావం లేదన్నారు. తన పట్టాభిషేకం ఆగిపోవడానికి కైకేయి కారణం కాదని, వీధి (ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్ధించాడు. తనకు రాజ్యమైనా వనవాసమైనా సమానమేనని ప్రకటించాడు.


పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కాని భర్తను వదలిరావడం ధర్మంకాదన్నాడు. శ్రీరాముడు ఎలాగో మనసును స్తిమితపరచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. "రామా! సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకురక్ష నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్య బలం నీరు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలుగనుండుగాకా అని శుభాశీస్సులందించింది.


అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసలుకోవాలో సీతకు తెలిపాడు. కాని సీత రామునివెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. "మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించినా ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముడు ప్రాధేయపడ్డాడు.  శ్రీరాముని సేవాభాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేసన్నారు. శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నారు.


సీతారామలక్ష్మణులు దశరథుని దర్శించడానికి బోయ్లుచేరారు. కాలినడకన వన్న శ్రీ ముడ్డి చూసి ప్రజలు బావురుమన్నారు. లక్ష్మణునిలాగ తామందరూ రాముని వెంట వెళ్లాలనుకొన్నారు. రాముడు ఉంటే చాలు అది అధనియోనా తము పాలిటి అయోధ్యేననుకున్నారు. సీతారామలక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందని అందరూ విలపిస్తున్నారు కైకేయి తప్ప దశరథుని మందిరం కన్నీటి శాల అయింది.


కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నార చీరలను సీతారామలక్ష్మణులు ధరించారు. తల్లిదండ్రులకు నమస్కరించారు. సుమిత్ర లక్ష్మణునితో "నాయనా, శ్రీరాముణ్ణి నీ తండ్రి అయిన దశరథులవారిలాగా, సీతను నన్నుగా భావించు. ఆడవా అనుకో. సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. సుమంత్రుడు రథాన్ని సిద్ధంచేశాడు. సీతారామలక్ష్మణులు రథాన్ని వేగంగా ముందుకు సాగుతున్నది శ్రీరాముణ్ణి విడవలేక కొందరు పౌరులు ఆ రథానికి రెండువైపులా, వెనుక భాగంలో ఎంచారు. మంగళ వాద్యఘోషతో మార్మోగవలసిన అయోధ్య దుఃఖసంద్రమైంది. దశరథుడు తీవ్రమైన బాధతో కౌసల్యామందిరానికి వచ్చాడు. కౌసల్యాదేవి శోకమూర్తిలా ఉంది. సుమిత్రాదేవి ఆమెను ఓదార్చింది.


శ్రీరాముని రథాన్ని నీడలా అనుసరిస్తున్నారు ప్రజలు, అయోధ్యకు మళ్ళిపొండని వాళ్ళకు శ్రీరాముడు ఎంతగానో చెప్పుతున్నాడు. "మీరే అయోధ్యకు రండి లేదా మేము మీ వెంట రావడానికి అనుమతించండి" అని వేడుకుంటున్నారు ప్రజలు. రధం తమసానదీ తీరానికి చేరింది. ఆ రాత్రి అందరూ అక్కడే విడిది చేశారు. తెల్లవారుతున్నది. అలసటచేత పౌరులందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇంకా వాళ్ళను శ్రమపెట్టడం శ్రీరామునికి ఇష్టంలేదు. అందుకని వాళ్ళు నిద్రలేచేలోపే అక్కడి నుండి వెళ్ళాలని లక్ష్మణునితో అన్నాడు. సుమంత్రుని సారథ్యంలో సీతారామలక్ష్మణులు అక్కడినుంచి బయలుదేరారు. నిద్రలేచిన పౌరులు శ్రీరాముడు కనబడకపోవడంతో తికమకపడ్డారు. తమ మొద్దునిద్రను తామే నిందించుకున్నారు. చేసేదిలేక అయోధ్యకు తిరుగుముఖం 

రథం వేర్చుకుని, గోమతీ, సనందికా నదులను దాటింది. కోసల దేశపు పొలిమేరలకు చేరుకుంది. అక్కడి నుండి అయోధ్యవైపుగా


తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. ముందుకు సాగుతూ గంగాతీరానికి చేరుకున్నారు. ఆ తీరంలో శంగిబేరపురమున్నది. గుహుడు' ఆ ప్రదేశానికి రాజు. అతడు శ్రీరామభక్తుడు శ్రీరాముడు వచ్చాడన్న వార్త విని తనవారితో శ్రీరాముని దగ్గరకు బయల్దేరాడు. గుహుడి చూసి రాముడు లక్ష్మణుడితోపాటు ఎదురువెళ్ళి కలుసుకున్నాడు. ఆ రాత్రి గుహండి అతిథ్యం తీసుకున్నాడు. మరునాడు శ్రీరాముని ఆదేశం మేరకు గుహుడు నాపను సిద్ధం చేశాడు. శ్రీరాముడు మర్రిపాలను తెప్పించాడు. వాటితో తనకు లక్ష్మణునకు జడలను సిద్ధపరచాడు. రామలక్ష్మణులు జటాధారులయ్యారు. సీతారామలక్ష్మణులు పడవ ఎక్కారు. అవతలి తీరానికి తీసుకు వెళ్ళాలని నావికులకు సూచించాడు గుహుడు శ్రీరాముడు సుమంట్రునికి, గుహునికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు. బావను ముందుకు సాగించవలసిందిగా నావికులను ఆదేశించాడు.


నది మధ్యలో నావ సాగుతున్నది. సీత గంగను ప్రార్ధించింది. నావ దక్షిణ తీరానికి చేరింది. నావదిగిన శ్రీరాముడు నీతా లక్ష్మణ సమేతుడై వనాలకు బయలుచేరాడు. శ్రీరాముని ఆదేశం మేరకు ముందు లక్ష్మణుడు వెనక సీత, ఆమె వెనక శ్రీరాముడు నడుస్తున్నారు. సాయంకాలానికల్లా భరద్వాజాశ్రమానికి చేరారు. ఇది గంగా యమున సంగమ ప్రదేశంలో ఉంది. ముని వాళ్ళకు చేశాడు. వనవాసకాలాన్ని ఆ ప్రాంతంలోనే గడపమని కోరాడు. కాని రాముడు. సుతిమెత్తగా తిరస్కరించాడు.


జనులకు అందుబాటులో ఉందని, ఆశ్రమవాసానికి అనువైన ప్రదేశమేదైనా సూచించమని శ్రీరాముడు కోరాడు. పది కోసుల దూరంలో 'చిత్రకూటం' అనే పవిత్రమైన పర్వత ప్రదేశం ఉందని, మహర్షుల నివాసస్థానమైన అదే తగిన చోటని భరద్వాజుడన్నాడు. మహర్షి సూచనననుసరించి యమునానదిని దాటి చిత్రకూటం చేరుకున్నారు సీతారామలక్ష్మణులు. అన్న ఆదేశం ప్రకారం అక్కడ నేరేడు కర్రలతో కుటీరాన్ని నిర్మించాడు లక్ష్మణుడు. సశాస్త్రీయంగా అందులోకి ప్రవేశించారు.

ఈ విషయాన్నంతా గూఢచారుల ద్వారా గుహుడు తెలుసుకున్నాడు. గుహుని ద్వారా సుమంత్రుడు గ్రహించాడు. సుమంత్రుడు. గుహుడి దగ్గర సెలవు తీసుకొని అయోధ్యకు వెళ్ళాడు. దశరథుడు సుమంత్రుడి ద్వారా రాముని విషయాలను తెలుసుకున్నాడు. కౌసల్యాదశరథుల ఆవేదనకు అంతులేదు. దశరథుడు గతంలో తాను మునిబాలకుణ్ణి పొరపాటుగా చంపిన సంఘటనను, అతని తల్లిదండ్రులిచ్చిన శాపాన్ని గుర్తుచేసుకున్నాడు. అదే పుత్రవియోగానికి కారణమన్నాడు. శ్రీరాముని ఎడబాటుకు మనసు కకావికలమైంది, దశరథునికి దుఃఖాగ్నికి తట్టుకోలేక గుండె చల్లబడింది. అర్ధరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు. అందరూ బావురుమన్నారు.

దశరథుని దేహాన్ని ఒక తైలద్రోణిలో భద్రపరచారు. వసిష్ఠుడి అజ్ఞమేరకు దూతలు భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి వెళ్ళారు. ఏడురోజులు ప్రయాణం చేసి ఎనిమిదవనాడు అయోధ్యకు చేరుకున్నారు భరత శత్రుఘ్ములు, తండ్రి మరణానికి తల్లడిల్లాడు భరతుడు. తండ్రి అంత్యక్రియలను భరతుడు నిర్వర్తించాడు.

శ్రీరామ వనవాస విషయంలో తల్లిని తప్పుబట్టాడు భరతుడు, మంధరను చంపడానికి ఉద్యుక్తుడైన శత్రుఘ్నుడు భరతుని మాట విని విరమించుకున్నారు. మంత్రులు భరతుణ్ణి రాజ్యాధికారం చేపట్టమన్నారు. కాని భరతుడు అంగీకరించలేదు. "పెద్దవారం. శ్రీరాముడే రాజు కావాలి. ఆయనకు బదులు నేను పదునాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తాను. చతురం సిద్ధపరచండి. నేను వెళ్ళి శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకువస్తాను" అని తెలిపాడు.

భరతుడు అయోధ్యావాసులతో కూడి బయలుదేరాడు. శృంగిబేరపురం చేరాడు. గుహుడు భరతునిఅందం యుద్ధసన్నద్ధువయాడు. తీరా విషయం తెలిశాక ఎదురువెళ్ళి భరతుణ్ణి ఆహ్వానించాడు. గుహుని సహకారంతో ధరణా చేరుకున్నాడు భరతుడు. మహర్షి సత్కారాలనంది చిత్రకూటం వైపు ప్రయాణించారందరు.

అడవిలో మృగాల అలజడి మొదలైంది. కారణమేమిటో చూడమన్నాడు లక్ష్మణునితో శ్రీరాముడు. వెంటనే పెద్ద మద్ది చెట్టెక్కాడు. విషయం అర్థమైంది. చెట్టు దిగి శ్రీరాముని వద్దకు వచ్చాడు. "భరతుడు దుర్భుద్ధితో ససైన్యంగా వస్తున్నారు.. మన ధనుర్భాణాలను సిద్ధంచేసుకుండా "మన్నాడు లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుని ఆలోచనలో పొరపాటు ఉందని చెప్పాడు. భరతుడలాంటివాడు కాదన్నాడు. "లక్ష్మణా! ఒకవేళ నీకు రాజ్యకాంక్ష ఉంటే చెప్పు భరతునికి చెప్పి ఆ రాజ్యాన్ని నీకే ఇప్పిస్తా పెన్నాడు. ఇంతలో భరతుడు పర్ణశాలకు చేరుకున్నాడు. శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. శత్రుఘ్నుడు. శ్రీరాముని పాదాల మీద బడ్డాడు. శ్రీరాముని కళ్ళ నుంచి అశ్రుధారలు కురిశాయి. కొంతసేపటికి తేరుకున్నాడు. భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేశాడు. ప్రసంగవశాత్తు రాజనీతి ధర్మాలను బోధించాడు. శ్రీరాముడు తండ్రి మరణవార్త విని విలపించాడు. శ్రీరాముణ్ణి అయోధ్యకు రమ్మని, రాజువుకమ్మని సవినయంగా ప్రార్ధించాడు భరతుడు. కాని తండ్రిమాటే శిరోధార్యమని శ్రీరాముడు అంగీకరించలేదు. శ్రీరాముని నాస్తికవాదంతో ఒప్పింపజూచాడు. జాబాలి. ఇతడు దశరథుని పురోహితుడు. కాని జాబాలి వాదాన్ని శ్రీరాముడు ఖండించాడు.

భరతుని అభ్యర్ధన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు "అన్నా! ఈ పాదుకలమీదనే రాజ్యపాలనాభారాన్ని ఉంచుతాను. ఈ పదునాలుగు సంవత్సరాలు, నేనుకూడా జటలను ధరించి, నారచీరలు కట్టి, వనవాస నియమాలతో, నగరం వెలుపల ఉంటాను. పదునాల్గవ సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తా"నన్నాడు. సరేనన్నాడు శ్రీరాముడు. ఆదర్శ సోదరభావమంటే ఇది భరతుడు నందిగ్రామం చేరుకొని, పాదుకలకు పట్టాభిషేకం చేశాడు.

శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అత్రిమహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అత్రి అనసూయలు వీరికి సముచిత మర్యాదలు చేశారు. మహాపతివ్రత అయిన అనసూయాదేవి సీతకు దివ్యవస్త్రాభరణాలనిచ్చింది. మునీశ్వకుల ఆశీస్సులు తీసుకొని సీతా రామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు.



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana