రామాయణం సుందరకాండ

 సుందర కాండం


మహాబలుడైన మారుతి సూర్యునికి, మహేంద్రునికి, వాయువుకు, బ్రహ్మకు, ఇతరదేవతలకు నమస్కరించాడు. తన శరీరాన్ని పెంచాడు. ఒళ్ళువిరిచాడు. ప్రళయకాల మేఘగర్జనలా మహానాదంచేశాడు. చేతులను నడుముమీద ఉంచాడు. పాదాలను దట్టించాడు. చెవులను రిక్కించాడు. తోకను విదల్చాడు. అంగదాది మహావీరులతో, "వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగ లంకకు వెళతాను. అక్కడ సీతామాతను చూడలేకుంటే అదే వేగంతో స్వర్గానికి వెళ్ళటం. అక్కడ కూడా సీతామాత దర్శనం కాకుంటే రావణుని బంధించి తీసుకువస్తా ఏది ఏమైనా కార్యసఫలతతో తిరిగివస్తా"నని పలికాడు. ఒక్క ఉదుటున అంతరిక్షంలోకి ఎగిరాడు. శ్రీరామకార్యమునకు వెళుతున్న హనుమంతునికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు. వాయువు చల్లగా ప్రసరించాడు. దేవతలు, గంధర్వులు, మహర్షులు కీర్తించారు.


సముద్రముపై సాగిపోతున్న హనుమంతుణ్ణి చూసి సాగరుడు సహాయపడదలచాడు. తానింతవాడు కావడానికి ఇక్ష్వాకు ప్రభువైన సగరుడి కారణమని సాగరుని అభిప్రాయం. ఆ ఇక్ష్వాకు కులతిలకుడైన శ్రీరాముని కార్యంకోసం వెళుతున్న హనుమంతునికి శ్రమ కలగకూడదనుకున్నాడు. సముద్రంలో ఉన్న మైనాకుణ్ణి బయటకు రమ్మన్నాడు. అతని బంగారు గిరిశిఖరాలమీద హనుమంతుడు ఒకింతసేపు విశ్రాంతి తీసుకోగలడని భావించాడు. మైనాకుడు సరేనన్నాడు. ఒక్కసారిగా సముద్రంమధ్యనుంచి పైకి లేచాడు. అకస్మాత్తుగా పైకి లేచిన మైనాకుణ్ణి తనకు ఆటంకంగా తలచాడు మారుతి. తన ఎదతో నెట్టివేశాడు. మైనాకుడు అబ్బురపడ్డాడు. మానవరూపంలో గిరిశిఖరం మీద నిలచాడు. సముద్రుని కోరికను తెలిపాడు. హనుమంతుడు మైనాకునితో "నీ ఆదరపూర్వకమైన మాటలకు తృప్తిపడ్డాను. ఆతిథ్యం అందుకున్నట్లే భావించు. సమయంలేదు. ఆగడానికి వీలులేదు" అని చెప్పి చేతితో అతణ్ణి తాకాడు. ఆతిథ్యం గ్రహించినట్లుగా తెలిపి ముందుకుసాగాడు.


హనుమంతుణ్ణి పరీక్షించడానికి వచ్చిన 'సురస' అనే నాగమాత అతని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి ఆనందించి ఆశీర్వదించింది. 'సింహిక' అనే రాక్షసి హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో సింహికను చీల్చేశాడు.


త్రికూట పర్వతంమీదున్న లంకకు చేరాడు హనుమంతుడు. నూరు యోజనాలు ప్రయాణించినా అణుమాత్రమైనా అలసిపోలేదు. శత్రుదుర్భేద్యమైన లంకను చూశాడు. అందులో ప్రవేశించడానికి రాత్రి సమయమే అనుకూలమనుకున్నాడు. అంతవరకు వేచి ఉన్నాడు. రాత్రికాగానే పిల్లి ప్రమాణంలోకి తన శరీరాన్ని కుదించుకుని లంకలోకి ప్రవేశించాడు. ఇంతలో లంకాధిదేవత (లంకిణి) అతన్ని చూసింది. "నీవెవరు? ఎందుకొచ్చా"వని నిలదీసింది. యథార్థం చెప్పమని గద్దించింది. తనను కాదని లంకలో ప్రవేశించడం సాధ్యంకాదన్నది. తన చేతిలో చావు తప్పదని హనుమంతుణ్ణి బెదిరించింది. హనుమంతుడు "లంకానగరం అందంగా ఉంటుందని విన్నాను. ఒకసారి చూసిపోవాలని వచ్చాను. చూశాక వచ్చిన దారినే వెళతా"నని చెప్పాడు. లంకిణి భయంకరంగా అరుస్తూ తన అరచేతితో హనుమంతుని బలంగా కొట్టింది. హనుమంతుడు మహానాదం చేస్తూ ఎడమచేతితో లంకిణిపై ఒక్కదెబ్బవేశాడు. స్త్రీ అని గట్టిగా కొట్టలేయ కాని ఆమాత్రం దెబ్బకే కూలబడి పోయింది లంకిణి, బ్రహ్మవడం జ్ఞాపకం “చేసుకుంది. ఒక వానరుడు వచ్చి అలకిడిని అయినప్పుడు రాక్షసులకు కీడుమూడుతుందని బ్రహ్మ చెప్పాడు. ఆ ఆసన్నమైందని హనుమంతునితో పలికింది లంకలోకి వెళ్ళమని చెప్పింది.


హనుమంతుడు ముఖద్వారం గుండా అంకలోకి వెళ్ళలేదు. ప్రాకారంపై నుండి దూకి వెళ్ళాడు. అది కూడా ఎడుము పొరణ ముందుబెట్టి, (శత్రువుల వద్దకు వెళ్ళే సంప్రదాయం ఇది) లంకలో ప్రవేశించిన చిత్రపన ఇండ్లను దూకాడు. సంగీత మాధుర్యాన్ని దివిచూశాడు. వేరికోషను విన్నాడు. రకరకాల వాళ్ళను రూశాడు. సర్వాంగ సుందరమైన రావణున భవనాన్ని చూశాడు. ఎక్కడా సీత జాడ కనిపించలేదు. మహాపార్శ్వు కుంభకర్ణ, విభీషణ, మహోదర, విరూపాక్ష విద్యుద్డహ్వాము భవనాలన్నీ వెతికాడు.


కావణాంతఃపురంలోకి వెళ్ళాడు. ఎందరో స్త్రీలు వెల్లా చెదరుగా పడుకొని నిద్రపోవడం దూశాడు ప్రత్యేక తయ్యపై నవశించిన ఒక స్త్రీని చూశారు. మహా సౌందర్యంతో వెలిగిపోతున్న ఆమె రావణుని భార్య మండోదరి, కాని హనుమంతుడు సీత అని భ్రమించాడు. సీతను చూశాననుకొని గంతులు వేశాడు. కొద్దిసేపటికే తన ఆలోచన తప్పని గ్రహించాడు. శ్రీరాముని ఎదబోసి సీత ఇలా ఉండగలుగుతుందా? అని అనుకున్నాడు. ఆమె సీతకానేకాదని నిశ్చయించుకున్నారు.


ఎక్కడా సీత జాడ తెలియకపోయేసరికి సీత మరణించిదేమోనని సందేహించాడు హనుమంతుడు. సీత జాను కనిపెట్టలేకపోయిన తాను ఏ ముఖం పెట్టుకుని తిరిగివెళ్ళాలని బాధపడ్డాడు. అయినా నిరుత్సాహపడగూడదని నిర్ణయించుకున్నాడు. ఇంత వరకు వెతకని ప్రాంతాలకు వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. ఎక్కడకు వెళ్ళినా నిరాశే కలుగుతున్నది, సీత కనబడలేరు చెపితే శ్రీరాముడు జీవించడు. అతడు లేక లక్ష్మణుడుండడు. వీరి మరణ వార్త విని భరత శత్రుఘ్నులుండరు. పుత్రులు మరణానికి తట్టుకోలేక కౌసల్యా సుమిగ్రా కైకేయీ తనువులు చాలిస్తారు. ప్రియమిత్రుణ్ణి వీడి సుగ్రీవుడు బతకడు. దానితో రుము, తార అంగదుడు మిగులరు. ఇది చూసి వానరజాతి ఈ లోకాన్ని వీడుతుంది. ఇందరి మరణానికి కారణం కావడంకన్నా ప్రాయోపవేశంతో ప్రాణాలు వదలడమే మంచిదనిపించింది మారుతికి, కాని తర్కించి చూస్తే ఆత్మహత్యకన్నా బతికుండరమే ఎన్నో విధాల ఉత్తమమనిపించింది. చచ్చి సాధించేదేమిటి? బతికితే సుఖాలను, శుభాలను పొందవచ్చు. బతికి ఉన్నవాళ్ళు ఎన్నడైనా కలుసుకోవచ్చు. అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు.


అప్పటివరకు వెతకని అశోకవనంలోకి వెళ్ళాలనుకున్నాడు హనుమంతుడు సీతారామలక్ష్మణులకు, రుద్ర, ఇంద్ర యమ వాయుదేవులకు సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కరించాడు. అశోకవనంలోకి అడుగుపెట్టాడు ఇంద్రుని నందనవనం బాగా ఉంది అశోకవనం.


అణువణువునా వెదికాడు హనుమంతుడు. ఎత్తైన శింశుపావృక్షాన్ని ఎక్కాడు. దానికింద మలిన వస్త్రాలను కట్టుకొని ఉన్న ఒక స్త్రీని చూశాడు. ఆమె చుట్టూ రాక్షన స్త్రీలున్నారు. ఆమె కృశించి ఉంది. దీనావస్థలో ఉంది. ఆమె సీతే అనిపించింది హనుమంతునికి, ఆమె ధరించిన ఆభరణాలను చూశాడు. రాముడు చెప్పిన వాటితో సరిపోలాయి, ఋష్యమూక పర్వతంమీద పడిన ఆభరణాలు ఆమె శరీరంపై కనిపించడంలేదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె సీతే అని ధ్రువపరచుకున్నాడు. ఆ వృక్షంపైనే ఉండిపోయాడు.


సీతాదేవిని చూడగానే హనుమంతుని కన్నుల నుండి ఆనందాశ్రువులు జారాయి. శ్రీరాముని స్మరించుకొని నమస్కరించాడు.


వేకువజామయింది. వేదఘోషలు వినబడుతున్నాయి. నిద్రలేచిన రావణుడు అశోకవనంవైపు అడుగులు వేస్తున్నాడు. సుగంధతైలాలతో తడిసి ఉన్న కాగడాలను ధరించిన స్త్రీలు ముందు నడుస్తున్నారు. రావణుని తేజస్సు చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు హనుమంతుడు, సీత దగ్గరికి వచ్చి రావణుడు నయానా భయానా సీత మనసుమార్చే ప్రయత్నం చేశాడు. కాని ఎలాంటి ప్రలోభాలకు తాను లొంగనని సీత తేల్చిచెప్పింది. శ్రీరాముని నుంచి తప్పించుకోవడం సాధ్యంకాదని హెచ్చరించింది. రావణునిలో ఆవేశం పెల్లుబికింది. రెండు నెలలు గరువు విధించాడు. ఎలాగైనా సీతను భవనానికి చేరుకున్నాడు. స్త్రీలు అదేశించి తన


రాక్ష స్త్రీలు ఎన్నో రకా సీతకు నిచ్చితిప్పే ప్రయత్నం చేశారు. మెకరించింది వివరకు సం భయపెట్టారు. ఈ దుస్థితికి సీత ఏంతో విజపించింది. శ్రీరామునికి దూరమై అకడమలాన్ని ఈ మాటలను విని కొందరు లక్షకి స్త్రీలు రావణుడికి ఈ విషయం చెప్పటానికి వెళ్ళరు అలంకొండని. తక్షణమే సీతను బంధించగలమన్నారు. అంతవరకు విరురించిన త్రిజట అప్పుడే నీల్కొంది విభీషణుని కూతురు రాక్షస స్త్రీలను అరరించింది. తనకు వచ్చిన కలను చెప్పింది. "వేయి హంసలతో కూడిన పల్లకి లక్ష్మ శ్రీరాముడు కూర్చునట్లు దశాను. మధ్య ఒక తెల్లని పర్వతంమీద సీత కూర్చోవడం చూశాను ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద పూసుకొని పని శరీరంతో లావణను నేలమీదడం నను కట్టిడకు కట్టి దక్షిణవైపుగా చూశాను, వరాహం మీద రావణుడు మొసలిమీద ఇంద్రజిత్తూ ఒంటెమీద నుంభకర్ణుడు దక్షిందులుగా వెళ్ళడం చూశాను. లంక చిన్నభిన్నం కావడం చూశాను" అన్నది. సృష్నంలో విమాదదర్శనం కాపదాన్ని బట్టి సీత కోరిక సిద్ధుడని కారణానికి వినాశం తప్పదని, శ్రీరామునికి జయం కలుగుతుందనీ చెప్పింది.


ప్రాణత్యాగానికి సిద్ధపర్ల సీతకు శుభశకునాలు తోచాలు, చెట్టుపైన ఉన్న హనుమంతుడు సీతాదేవిని ఎలా కాపాడుకోవా అని మధనపడ్డాడు. రామకథాగానమే సరైన మార్గమని ఎంచుకున్నారు. సీతాదేవికి వినపడే మన వర్ణించారు. సీతాదేవి అన్నివైపులా చూసింది. చెట్టుమీదున్న హనుమంతుణ్ణి చూసి ఆశ్చర్యానికి లోనైంది. హనుమంతుడు చెట్టుదిగి సమస్కరించాడు. "అమ్మా నీవెవరు? ఒకవేళ సీతాదేవివే అయితే శుభమగుగాక, దయతో విషయాలు చెప్పుమని ప్రార్థించారు. తనను సీ అంటారని తెలిపిందా సార్వి వృత్తాంతమంతా వివరించింది.


హనుమంతుడు తాను శ్రీరామ దూతనని చెప్పుకొన్నాడు. దగ్గరిగా వస్తున్న అనుమానించింది నీశ, నిజంగా రామదూతవే అయితే రాముణ్ణి గురించి వినిపించమంది. సీత కోరికపైన హనుమంతుడు శ్రీరాముని రూపగుణాలను వివరించాడు. శ్రీరాముని ముద్రికను సమర్పించాడు. దాన్ని చూసి, పరమానంద భరితురాలైంది సీత. తనదైన్యాన్ని వివరించి శ్రీరాముడ్డి త్వరగా లంకకు తీసుకువచ్చి రాక్షసుల చెరనుండి తనను విడిపించమని మారుతితో చెప్పింది. అంతడాకా ఎందుకు? తన వీపుమీద కూర్చుంటే తక్షణమే శ్రీరాముని సన్నిధికి చేరుస్తానన్నాడు హనుమంతుడు. ఇంత చిన్నవాడివి ఎలా తీసుకెళ్ళగలవని ప్రశ్నించింది. సీత హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సంతోషించింది సీత. అయినా హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది. పరపురుషుని తాకనన్నది. శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి తనను తీసుకుపోవడమే ఆయన స్థాయికి తగినదన్నది.  

అమ్మా నా వెంటు గావము నీకు అంగీకారయోగం కంటే శ్రీను గుర్తించగల ఏదైనా సవాలు తొమ్మ అడిగాడు పొదుమంతుడు. తమ అనుబంధానికి గుర్తుగా చెప్పింది. కొంగుముడి విప్పి అందులోని దివ్యహదా హనుమంతునికిచ్చింది.


సేనాపతులైదుగురు సీతా దర్శనంతో ప్రధాన కార్యం ముగిసింది పోణుడు అతని వైద్యపు శక్తిసామర్థ్యాలను కూడా. తెలుగు వానితో మున్ని ద్విందం చేయడమే మార్గంగా భావించాడు. అనుకున్నంతా చేశాడు. ఆ కధను రాక్షణ స్త్రీలు పరుగుపరుగున వెళ్ళే అంకేశుడికీ విషయం చెప్పారు. రావణుడు ఎనభైవేల మంది హనుమంతుడు వాళ్ళను సుట్టు పెట్టాడు తనపైకి వచ్చిన అంబుమాలిని, మంత్రి పుత్రులేడుగురిని రావణుడి అక్షకుమారుణ్ణి అంతమొందించాడు. చివరకు ఇంద్రజిత్తు అధ్యాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుణ్ణి బంధించాడు. బ్రహ్మనరిండి అది హనుమంతునిమీద క్షణకాలమే పనిచేస్తుంది. అయినా తాను దానికి కట్టుబడి ఉన్నట్టు నటించాడు హనుమంతుడు రావణుని ముందు ప్రవేశపెట్టాకతన్ని, రావణుండుగగా తాను రామదూతనవి చెప్పారు. శ్రీరాముని పరాక్రమమెలాంటిటి సభాముఖంగా చాటారు. సహించలేని రావణుడు హనుమంతుణ్ణి చంపమని ఇచ్చాడు. దూతను చంపడం భావ్యం కాదని విభీషణుడు. ఇతర పద్ధతుల్లో దూతను వండించవచ్చునన్నారు.


హనుమంతుని తోకకు నిప్పంటించి లంకంతా కలయ దిప్పమన్నాడు రావణుడు. బట్టలతో హనుమంతుని తోకను చుట్టారు. నూనెతో తడిపారు. తోకకు నిప్పు పెట్టి ఊరంతా ఊరేగిస్తున్నారు. హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాడు. విభీషణును. భవనం తప్ప లంకకంగా నిప్పుపెట్టాడు. (అందుకే 'సీతను) చూపిరమ్మంటే (లండను) కాల్చివచ్చాడని' సామెత పుట్టింది. లంకలో హాహాకారాలు మిన్నుముట్టాయి.


బంధము కాల్చాక హనుమంతుడు సముద్రంలో తోకను చల్లార్చుకున్నాడు. తోకతోపాటు ఆయన కోసంకూడా చల్లారింది. తాను తప్పు చేశాననుకున్నాడు. కోసం ఎంతో అనర్థదాయకమనుకున్నారు. లంకంతా కాలి సీతామాత కూడా కాలిపోటు ఉంటుందని బాధపడ్డాడు. వచ్చిన పనిని రేజేతులా పాడుచేసుకొన్నందుకు తనను తాను నిందించుకున్నాడు. కాని ఎక్కడో చిన్న అశ తన తోకనే కాల్చని అగ్నిదేవుడు పరమ పూజ్యురాలైన సీతను దహిస్తాడా? అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఇంతలో నీ క్షేమంగా ఉందని చారణుల ద్వారా తెలుసుకొని చాలా సంతోషించాడు. సీతమ్మ దగ్గరికి చేరి పాదాభివందనం చేశాడు. ఆమె అనుమతితో తిరుగు ప్రయాణమయ్యాడు.


'అరిష్టం' అనే పర్వతాన్ని ఎక్కారు. అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగరాదు. మధ్యలో ఆత్మీయపూర్వకంగా మైనాకుడిని తాకి వేగంగా ప్రయాణం కొనసాగించారు. మహేంద్రగిరికి చేరుకోబోతుండగా మహానాదం చేశాడు. జాంబవంతుడు దానిని విని పొంగిపోయారు. హనుమంతుడు విజయుడై తిరిగివస్తున్నాడని వానరులకు తెలిపాడు.


హనుమంతుడు మహేంద్రగిరి శిఖరంమీద అడుగుపెట్టాడు. వానరులంతా చుట్టూచేరారు. పెద్దలకు నమస్కరించాడు. హనుమంతుడు. "చూశాను సీతమ్మ"ను అని ప్రకటించాడు. అందరూ ఆనందించారు. లంకా ప్రయాణ విశేషాలను వారికి వివరించాడు మారుతి. అంగదుడు ఓ వీరులారా! సీతాదేవి జాడ తెలిసిన తరువాత కూడా ఆమె లేకుండా శ్రీరాముని దగ్గరికి వెళ్ళడం సబబుకాదు. లంకకు వెళ్ళి రావణుని చంపి సీతను తీసుకొని శ్రీరాముని వద్దకు వెళుదా"మని అన్నాడు. జాంబవంతుడు అంగదుడి మాటలను ఖండించాడు. శ్రీరామసుగ్రీవులు సీతను చూసిరమ్మన్నారేకాని తీసుకురమ్మనలేదు. పైగా రావు. సంహరిస్తానని శ్రీరాముడు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. దానికి భంగం కలగనీయగూడదన్నాడు. అందరం వెళ్ళి జరిగిన నివేదిద్దామన్నాడు.


దారిలో అందరూ మధువనంలోకి వెళ్ళారు. తేనెలు తాగారు. మధువనాన్ని ధ్వంసంచేశారు. మధువనం మరచి ఉన్నది. అతని మేనమామ దధిముఖుడు. దాన్ని కాపాడుతున్నాడు. వానరుల ధాటికి దధిముఖుడు గాయాల పాలయ్యాడు. వెంటనే వెళ్ళి సుగ్రీవునికీ విషయం చెప్పాడు. ఇదంతా శుభసూచకంగా భావించాడు సుగ్రీవుడు.


అంగద హనుమదాదులు శ్రీరాముడు సుగ్రీవుడున్న చోటుకు చేరారు. హనుమంతుడు శ్రీరామునికి సాప్తం చేశాడు. "చూశాను సీతమ్మను" అని చెప్పాడు. రామలక్ష్మణుల ఆనందానికి అంతులేదు. సీత ఇచ్చిన చూడామటని సమర్పించాడు హనుమంతుడు. శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్ని చెప్పాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana