రామాయణం బాలకాండం
ఉపవాచకం
మన ఇతిహాసం
రామాయణం
(వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచనరూపం)
రామాయణాన్ని ఎందుకు చదువాలంటే...
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. 'అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం- అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం గురుభక్తి, శిష్యానురక్తి- స్నేహఫలం, ధర్మబలం- వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం -జీవకారుణ్యభావన, ప్రకృతిలాలన' ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం, రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథంకాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది. "రామో విగ్రహవాన్ ధర్మః సత్యధర్మ పరాక్రమః" అన్న మహితోక్తిని మారీచుని నోటినుండి మహర్షి పలికించాడు. రామునివంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం 'సభూతో నభవిష్యతి!' మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది.
ప్రపంచ సాహిత్యంలోనే ఆదికావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి 'ఆదికవి'గా కీర్తిపొందాడు. 'రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్' అనే మూడు పేర్లు దీనికున్నాయి. ఆరు కాండల (విభాగం) తో, ఇరవై నాలుగు వేల శ్లోకాలతో, సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలుదేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభననుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులూ ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు.
వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత ని సమాజాన్ని నిర్మించడమే లక్ష్మణడా ముందు తరాలవారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది.
శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారదమవార్ని ఒకనాడు మునిశ్రేష్టుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాడ్చతుదుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో వారధుల వారినడిగాడు (జిజ్ఞాన్ విజ్ఞానానికి మూలం) "ఓ మహా అన్నీ మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొణకనివాడు, ధర్మంతెలిసినవారు, ఆశ్రయించినవారిని ఆదుకునేవాడు, మాటతప్పనివాడు, సకల ప్రాణులకు మేలుచేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయలేనివాడు, అందమున్నవాడు... ఇలాంటి శుభలక్షణాలు కలవాదు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా?" అని ప్రశ్నించాడు. వారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. "మహామునికి ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ, నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించినవాడు శ్రీరాము"డని తెలిపాడు. రామాయణగాధను సంక్షిప్తంగా వాల్మీకికి వినిపించాడు నారదుడు. అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు.
రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతున్నాయి. గంగానదీ సమీపానగల తమసానదికి స్నానం చేయడానికి బయల్దేరాడు. భరద్వాజాదీ శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసానది మంచివాని మనసువలె స్వచ్ఛంగా ఉంది.
స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మపైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చటగొలుపుతున్నది. వాటి మధురధ్వనులు వీసులవిందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూరబాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది, హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని మాశాడు వాల్మీకి కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా...
మానిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతః సమాణ యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
("ఓ కిరాతుడా! క్రౌంచపక్షి జంటలో పరవశమైయున్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు") అన్న మాటలు వచ్చాయి.
అననైతే అన్నాడు కానీ తరవాత అతనికే ఆశ్చర్యంవేసింది. ఈ మాటలు సమానాక్షరాలుగల నాలుగు పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగివచ్చారందరూ. కాని క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసునుంచి వెనుదిరగడం లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో -సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికివచ్చాడు. అతనికి శాస్త్రోక్త ఉపచారాలన్నీ చేశాడు వాల్మీకి. బ్రహ్మ కూర్చోమన్నారు. బ్రహ్మ అననంకన్నా కొంచెం తక్కువ ఎత్తుగల ఆసనంపైన కూర్చున్నాడు వాల్మీకి ఇది పెద్దలపట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి వాడ వాల్మీకిని వదలడం లేదు మనసులో 'సనిషాల శ్రీకమ్ మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చించిస్తూ 1 ఋషీశ్వరా! నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు (అనుష్టుప్) లోనే శ్రీరామచరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథా రహస్యాలు కూడా స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణగాను జ కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణరచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి
అయోధ్యా నగరం :
సరయూనదీతీరంలో 'కోసల' అనే సుప్రసిద్ధ దేశముంది. అందులోనిదే 'అయోధ్యా' అనే మహానగరం 'అయోధ్యా' అంటే యోధులకు జయించడానికి శక్యంకానిది. మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథమహారాజు పరిపాలిస్తున్నారు. అతడు. సూర్యవంశం వాడు, మహావీరుడు దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నోమార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపరాయణుడు. ప్రజలను కన్నబిడ్డలవలె చూసుకునేవాడు. వసిష్ఠ, వామదేవులు అతని ప్రధానపురోహితులు, సుమంత్రుడు మొదలుగాగం ఎనిమిది నుండి మంత్రులు, ఇతని పాలనలో కోసల దేశం భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖసంతోషాలతో ఉన్నారు. "యథా రాజా తథా ప్రజాః రాజు ఎలా ఉంటే ప్రజలూ అలాగే ఉంటారు.).
ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుణ్ణి కుంగదీసింది. సంతానప్రాప్తి కోసం అశ్వమేధయాగం చేయాలన్న ఆలోచు. కలిగింది. వెంటనే పురోహితులు, గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూనదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. మంత్రీ, సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋుష్యశి మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమౌతుందని సూచించాడు. ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి, దశరథుని ఆజ్ఞమేరకు ఋుష్యశృంగుణ్ణి సగౌరవంగా తోడ్కొనివచ్చారు. మూడు రోజులపాటు ఆశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తరవాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తికోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్ధనను మన్నించిన ఋష్యశృంగుడు 'పుత్రకామేష్టి' అనే యాగాన్ని ప్రారంభించారు. హవిస్సులందుకోవడానికి బ్రహ్మాదిచేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు.
అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమగోడు వెళ్ళబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావంచేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమేగాక ఇంద్రుణ్ణి సైతం రాజ్యభ్రష్టుణ్ణి చేయడానికి పూనుకొన్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతేలేదన్నారు. ఋషుల, యక్షగంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజస్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు.
బ్రహ్మ దేవతలతో "రావణుడు గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకనభావం. అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉంద"ని అన్నాడు.
ఇంతలో శ్రీమహావిష్ణువు శంఖచక్రగదాధారి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. నరగర్వంచేత కన్నూమిన్నూగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించారు. దశరధ మహారాజుగారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు ఆశ్రితవత్సలుడు అందరి పూజలందుకొని అంతర్ధానమయ్యాడు.
దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండంనుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మపంపగా వచ్చినవాడు. చేతిలో బంగారు పాత్ర వెండిమూతతో అందులో దివ్యపాయనముంది. దాన్ని దశరధునకందించాడు. "ఈ పాయనం సంపదలనిస్తుంది. ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అన్నిటినీ మించి వంశానాన్ని " ప్రసాదిస్తుందన్నాడు. పేదవానికి పెన్నిది దొరికినట్టైంది దశరథునికి అతని మనస్సు ఆనందతాండవం చేసింది. దివ్యపాయసాన్ని తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకీయలకు వంచాడు. సంవత్సరకాలం గడిచింది. చైత్రశుద్ధనవమిగారు
కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దశమినాడు కైకేయిడ్ భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనందసంద్రమైంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలనభ్యసించారు. ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానఖనులయ్యారు. సద్గుణాలకు ఆటపట్టైనారు. (ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణాలివి.) రాముడు " ఎప్పుడూ తల్లిదండ్రుల సేవలో నిమగ్నమయ్యేవాడు. చిన్ననాటి నుంచీ అన్నసేవే మిన్నగా భావించేవాడు లక్ష్మణుడు. ఇతరు
రాముడికి బహిఃప్రాణం, భరత శత్రుఘ్నులు అన్యోన్య ప్రేమాభిమానాలు కలవారు.
కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులు పురోహితులు మొదలైనవారితో సమావేశమయ్యాడు. తన కుమారుల వివాహ ప్రస్తావన చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహాతేజశ్శాలియైన విశ్వామిత్ర మహర్షి సృష్టికి ప్రతిసృష్టి చేయగల సమర్థుడతడు. దశరథుడు ఎదురేగి సాదరంగా స్వాగతించాడు. అతిధిదేవోభవ - అతిథి మనకు దేవునితో సమానం. ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రునకు సముచితరీతిన మర్యాదలు గావించాడు. వినయపూర్వకంగా చేతులు జోడించి విశ్వామిత్రుని రాకకు కారణాన్ని బడిగాడు. తనపైన కార్యభారం పెడితే నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి మురిసిపోయాడు విశ్వామిత్రుడు. "వసిష్ఠుని ఉపదేశాలను పొందినవాడివి. నీవు ఇలాగే ప్రవర్తిస్తానని మెచ్చుకొన్నాడు.
విశ్వామిత్రుడు దశరథునితో తాను వచ్చిన పనిని తెలుపుతానన్నాడు. దానిని ఆచరించమన్నాడు. ఆడినమాట తప్పవద్దన్నారు. అసలు విషయం చెప్పాడు. "ఓ రాజా! నేనొక యజ్ఞాన్ని సంకల్పించాను. కాని మారీచ, సుబాహులనే రాక్షసులు ఆ యజ్ఞానికి విఘ్నాలు కలిగిస్తున్నారు. వారిని కోపించడానికి, శపించడానికి శక్తి ఉన్నా యజ్ఞదీక్షలో ఉన్నాను కాబట్టి అది నాకు తగనిపని (ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగపరచగూడదు.) అందుకు సత్యపరాక్రముడు, శూరుడు అయిన శ్రీరాముణ్ణి పదిదినాలపాటు నా వెంట వంపు. అతడే ఆ రాక్షసులను చంపగల సమర్థుడు. నా వెంట వచ్చి యాగసంరక్షణ చేయడంవల్ల శ్రీరామునికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి, శ్రీరాముని పరాక్రమమెలాంటిదో నాకు బాగా తెలుసు. నాకే కాదు వసిష్ఠులవారికి, వామదేవాది మహర్షులకూ తెలుసు, వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు.
ఈ మాటలు వింటూంటే దశరథుని గుండెలో రాయిపడ్డది. చేతులు జోడించి "మహరీ! నా రాముడు పదహారేండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తికాలేదు. యుద్ధవిషయాలతో తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణపాణినై నేను మీ వెంటవస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది, ఇవన్నీ ఎట్లా. ఉన్నా రాముణ్ణి వదలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు, ఇంతకూ ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు.
విశ్వామిత్రుడు సమాధానమిస్తూ "పౌలస్త్యవంశజుడైన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలాలు కలవాడు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాలవల్ల అతని గర్వం ఇబ్బడిముబ్బదైంది. ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటివాడికి యజ్ఞం భగ్నంచేయడమనేది అల్పంగా తోస్తున్నది. అందుకే ఇటువంటి పనులలో పాల్గొనడు. మారీచ, సుబాహులు ఇతనిచేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరధుడు మరింత భయపడ్డారు. "యుద్ధంలో యమునితో సమానులైన వారి నెదుక్కోవడానికి నా చిన్నిపాపణ్ణి పంపను. నేను కూడా యుద్ధ విషయంలో ఆశక్తుడనని
దశరధుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలమైనాడు. "ఇచ్చినమాట తప్పటం మీ ఇంటా వంటా లేదు. నీవందుకు సిద్ధపడితే రక్తహస్తాలతో తిరిగి వెళతాను. మీరు సుఖంగా ఉండండి" అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించారు. వసిష్టమహర్షి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మకార్యాలగాచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాం ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండగూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు.
వసిష్ఠుని పాతవచనాలకు దశరథుడు తలొగ్గాడు రామలక్ష్మణులను పిలిపించాడు. కౌసలుతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించాడు.
విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూనదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురూ, తరవాత రామలక్ష్మణులకు 'బల' 'అతిబల' విద్యలనుపదేశించాడు. విశ్వామిత్ర మహర్షి వీటి ప్రభావంవల్ల అలసట, ఆకలిదప్పులుండవు. రూపకాంతులు తగ్గవు. నిద్రలో ఉన్నా, ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేదు. ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలచేవారుండరు.
రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు. సేవలు చేశాడు. (గురుసేవ విశేష ఫలితాన్నిస్తుంది.) సరయూనదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు.
తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు.
కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్.
"కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామా! తూర్పున ఉషఃకాంతులు ప్రసరిస్తున్నాయి. నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించ మన్నాడు. గురువాక్యం శిరసావహించాడు రాముడు, లక్ష్మణునితో కలసి, మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. (జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం.)
ప్రయాణం సాగుతున్నది. 'మలద', 'కరూశ' అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషంచేత ఈ ప్రాంతాలు ధనధాన్యాలసమృద్ధిని కలిగి ఉండేవి. కాని 'తాటక' అనే యక్షిణి ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు. 'అగ్నికి అజ్యంతోడైనట్లు ఈమెతోబాటు ఈమె కుమారుడు 'మారీచుడు' విరుచుకపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటకను వధించడాని రామునితో అన్నారు. విశ్వామిత్రుడు. ఒక్కక్షణం రాముడు మౌనముద్ర రాల్చాడు. రాముని భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. "స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాలికను చంపితే దోషం రారని కర్తవ్యముపదేశించారు. వెంటన రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు. "మీరు చెప్పినట్లుగా నడుచుకొమ్మని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాసక్తిని చాటాడు. అలాగే గురువు మిము పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమన భావించి తాటకవధకు ఉద్యుక్తుడైనాడు.
వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో బండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలైంది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళ వానకురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నారు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పదలోకానికి వంపమని పురమాయించాడు. అసురసంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏ మాత్రం అలస్యం చేయకుండా రాముడు శబ్దవేధి బాణ ప్రయోగం చేశాడు. క్షణశాలంలో తాటక వేలపైబడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకొన్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. (గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి? శిష్యుడు పొందలేనిదేమిటి?)
రామలక్ష్మణ సహితుడయి విశ్వామిత్రుడు 'సిద్ధాశ్రమం' చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువుగారిని యజ్ఞదీక్షను స్వీకరించమని ప్రార్ధించారు. మన్నించాడు మహర్షి యజ్ఞదీక్షితుడయ్యాడు. మరునాడే. యజ్ఞం ప్రారంభమైంది. ఆరు రోజులపాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు, ఐదురోజులైంది. కంటిమీద కునుకులేకుండా యజ్జాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు (కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి.) చివరిరోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండంనుండి జ్వాలలు ఎగసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన.
మారీచ, సుబాహులు అనుచడులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు "శీతేషువు' అన్న మానవాస్త్రాన్ని మారీచుడిపైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు నూరు యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహకోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరు నిమిషంలో 'ఆగ్నేయాస్త్రం'తో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు. 'వాయవ్యాప్తం'తో మిగతా రాక్షసుల భరతంపట్టాడు. రాక్షసబాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. (సమర్థులైన శిష్యులను చూసి ఏ గురువు సంతోషించడు?)
మరునాడు ఉదయాన్నే రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఎదుట వినయంతో నిలిచారు. ఇంకా ఏమి చేయాలో అజ్ఞాపించమన్నారు. విశ్వామిత్రుడు “ఓ రామా! మిథిలానగర ప్రభువు, పరసుధార్మికుడైన జనక మహారాజు ఒక యజ్ఞాన్ని చేయ సంకల్పించాడు. మనం అక్కడికి వెళుదాం. అక్కడ అద్భుతమైన ఒక మహాధనుస్సుంది. నీవు చూడవచ్చు”నన్నాడు. సంసిద్ధులయ్యారు. రామలక్ష్మణులు, మునిననుసరిస్తూ మిథిలవైపుగా ముందుకు సాగుతున్నారు.
అడుగులతోపాటు మాటలూ సాగుతున్నాయి. రాముని కోరిక మేరకు తమ వంశ పుట్టు పూర్వోత్తరాలను వివరించాడు. విశ్వామిత్రుడు. ఆ రాత్రి శోణానదీ తీరంలో విశ్రమించారు. మరునాడు పవిత్ర గంగానదిని దర్శించారు. స్నానాలాచరించి విధ్యుక్త ధర్మాలను నెరవేర్చారు. గంగావృత్తాంతాన్ని వినగోరుతున్నానని వినయంగా అడిగాడు రాముడు. వినిపించాడు విశ్వామిత్రుడు. జిజ్ఞాసువులైన శిష్యులు, విజ్ఞాని అయిన గురువు ఇక జ్ఞాన ప్రసారానికి అడ్డుంటుందా?)
( పాతాళంలో బూడిదకుప్పలై పడి ఉన్న తన పితరులైన సగర పుత్రులకు ఉత్తమగతులు కల్పించడానికి సంకల్పించాడు. భగీరథుడు. అందుకు ఒకటే మార్గం ఉంది. సురగంగను వారి బూడిదకుప్పలపై ప్రవహింపజేయడం. కాని ఆకాశంలోని గంగను పాతాళానికి దింపడం ఒక పట్టాన జరిగే పనేనా? అయినా దృఢసంకల్పానికి అసాధ్యమైనది లేదు. భగీరథుడు తీవ్రమైన తపస్పులేశాడు. అన్నాడు. శివడ్డి వెచ్చించాడు ఎన్ని అడ్డంకులు ఎదురైనా సంకట్నం నుంచి పళ్ళుకు తప్పుకోలేదు. గుగన పాఠకందారా తీసుకు చెడులో సఫల మనోరథుడయ్యారు. (అందుకే పట్టుదల విషయంలో 'భగీరధ ప్రయత్నం' అన్న జాతీయం ఏర్పడింది) భగీరమని వంశంలోని రాముడు...
గంగావతరణాన్ని గురించి విశ్వామిత్రుడు రామునికి చెప్పడంలో ఒక అంతర్వమున్నది. తన పూర్వీకులు ఎంతగొన్నవాలో తెలుసుకుని దానికనుగుణంగా చదవటు పితరులపట్ల ఎంత భక్తి ప్రపత్తులుండాలో తెలుపదం వట్టిన పని ఫలవంతమయ్యేవరకు పట్టుదల ఎలా ఉండాలో చెప్పటం. అయితే ఇవన్నీ నేరుగా చెప్పలేదు విశ్వామిత్రుడు. అయినా అంతర్యాన్ని గ్రహించాడు. రాముడు (ఇది ఉత్తమ గురుశిష్యుల వ్యవహారం)
మిథిలానగర సమీపానికి చేరుకున్నారు విశ్వామిత్ర రామలక్ష్మణులు, అక్కడ ఒక ఆశ్రమాన్ని చూశాడు రాముడు. అది పాతదైనా అందంగా అగుపిస్తున్నది. కానీ జనసంచారమే లేదు. "ఏమిటీ చిత్రమని అడిగాడు రాముడు. అది గౌతమ మహర్షి ఇశ్రమముని, ఆ కథనంతా వివరించాడు విశ్వామిత్రుడు. "మహాతపస్సంపలైన గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో ఈ ఆశ్రమంలో ఉండేవాడు. ఒకానొక సందర్భంలో అపాల్య అపరాధం చేసిందని భావించి అగ్రహోదగ్రుడయ్యాడు గౌతముడు. వేల సంవత్సరాలు అన్నపానాదులు లేక వాయువునే ఆహారంగా తీసుకుంటూ ఈ ఆశ్రమంలోనే బూడిదలో పడి ఇంద..: ఆమెను తపించాడు. ఎవ్వరికీ కనబడకుండా ఉంటామన్నాడు. రాముని బాకతో శాపవిముక్తి కలిగి నిజరూపాన్ని పొందుతామ "రామా! గౌతమాశ్రమంలో కాలుమోపి అహల్యకు శాపవిముక్తి కలిగించు" అని విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు..
చుట్టూ బూడిన ఆవరించి ఉండి కఠోరదీక్షలో ఉన్న ఆహల్య పొగకమ్ముకొన్న అగ్ని తేజస్సులా ఉంది. మహాతురా రాముడు చూశాడు. రాముడి దర్శనంతో ఆమెకు శాపవిముక్తి కలిగింది. అహల్యా గౌతములు రాముణ్ణి యధావిధిగా గౌరవిం వారు వారి సత్కారాలందుకొని రాముడు విశ్వామిత్రుని వెంట లక్ష్మణ సహితుడై మిథిలా నగరానికి బయలుచేరాడు.
మిథిలానగరంలో ప్రభువైన అనకమహారాజు వీరిని సముచితంగా సమాదరించాడు. మిథిలలో అహల్యా గౌతములు కుమారుడైన శతానందుడు రామదర్శనం చేసుకున్నాడు తన తల్లినుద్ధరించినందులకు కృతజ్ఞతాంజలులు సమర్పించాడు. మహాతపశ్శాలియైన విశ్వామిత్రుని అనుగ్రహం పొందగలగడం చాలా విశేషమని రాముణ్ణి మెచ్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షి అసాధారణ శక్తిసామర్థ్యాలను వివరించాడు శతానందుడు.
మరునాడు ప్రాతఃకాలంలో జనకుడు విశ్వామిత్ర రామలక్ష్మణులను ఆహ్వానించారు. కర్తవ్యోపదేశం చేయవలసిందిగా విశ్వామిత్రుణ్ణి ప్రార్ధించాడు. అప్పుడు ప్రత్యుత్తరమిస్తూ విశ్వామిత్రుడు "వీరు దశరథమహారాజు కుమారులు జగత్ప్రసిద్ధులైన వీరులు, మీ దగ్గర ఉన్న ధనుస్సును చూడాలనుకుంటున్నారు. దాన్ని చూపించండి. శుభం జరుగుతుంది వాళ్ళ ముచ్చటా తీరుతుందన్నాడు. అప్పుడు జనకుడు తనదగ్గరున్న 'శివధనుస్సు' చరిత్రను వివరించాడు. యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగటిచాలున దొరికినందువల్ల ఈమెకు 'సీత' అనే పేరు వచ్చిందనీ చెప్పుతూ ఆమెను గొప్ప పరాక్రమవంతుడికివ్వాలన్న తన అభిమతాన్ని వెలిపుచ్చాడు. శివధనుస్సును ఎక్కుపెట్టగలవాడే సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రాజులు వచ్చి శివధనుస్సు ఎక్కుపెట్టడానికి విఫలప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదలించలేకపోయారన్నాడు.
ఇదంతా విని శివధనుస్సును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠులు, దీర్ఘకాయులైన ఐదువేల మంది అతికష్టం మీద శివధనుస్సుతో కూడిన పేటికను తీసుకువచ్చారు.
విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుస్సు మధ్యభాగాన్ని అవలీలగా పట్టుకున్నాడు. రాముడు. ధనుర్విద్యయందు ఆరితేరిన రాముని చెయి పోకనం. ఆ ధనుస్సు వంగింది. వింటివారిని సారించాడు. వేలకొలది సదస్యులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. జనతాదును ఆకర్ణాంతంగా లాగాడు రాముడు, పిడుగుపాటులా భయంకరశబ్దాన్ని చేస్తూ విల్లు ఫెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణులు తప్ప మిగతావారంతా మూర్ఛనోయారు.
ఇచ్చినమాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు. దశరథమహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్యనుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీత ఊర్మిళలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలైన మాండవిని, భరతునకు, శ్రుతకీర్తిని శత్రుఘ్నునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అంగరంగవైభవంగా జరిగాయి కల్యాణాలు.
మరునాడు విశ్వామిత్ర మహర్షి కొత్త దంపతులను ఆశీర్వదించి, అనకమహారాజులను వీడాడ్కొని హిమాలయవర్ష్వతానికి వెళ్ళాడు. తరవాత బంధుమిత్ర సమేతంగా దశరథుడు అయోధ్యకు బయలుదేరాడు.
దారిలో వీళ్ళకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని, ధనుర్భాణాలను ధరించాడు. ప్రజ్ఞరిల్లే అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలిచేశాడు.
పరశురాముడు శ్రీరామునితో తనదగ్గరున్న వైష్ణవ ధనుస్సునెక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలీలగా ఎక్కుపెట్టాడు. ఓటమినంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్రపర్వతానికి వెళ్ళిపోయాడు.
దశరథుడు సపరివారంగా అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి