జానపద కళలు
జానపద కళలు
తెలంగాణ పల్లెల్లో ఆటలకు, పాటలకు విడదీయలేని బంధం ఉన్నది. ఇక్కడి సాహిత్యం ప్రజా సాహిత్యం. ఇక్కడి కళలు ప్రజాకళలు, పాటలు, గేయాలు, కథలు మొదలైన అపారమైన సారస్వతము అనేక కళారూపాల్లో వైభవాన్ని పల్లె ప్రజల నాలుకల మీద నాట్యమాడుతాయి. అవే జానపదకళలు. ఇవి తెలంగాణ ప్రజల కళాభిరుచికి చక్కని నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. ఆ జానపద కళా వైభవాన్ని గురించి తెలుసుకుందాం.
జానపదులు అనగా పల్లె ప్రజలు. పల్లెల్లో అలరారు కళలను జానపద కళలు అంటారు. ఒగ్గుకథ, బుర్రకథ, యక్షగానం, చిందుబాగోతాలు, చిడుతలరామాయణం, కోలాటం, భజన, తుపాకిరాముడు, పిట్టలదొర మొదలగునవి జానపద కళలకు ఉదాహరణలు, భాగవతం, రామాయణం, భారతం, గ్రామదేవత కథలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు, వీరుల కథలు లాంటివి ఏండ్లకేండ్లుగా ఈ జానపద కళల ద్వారానే ప్రచారంలోకి వచ్చినాయి. పల్లె ప్రజలు నిరక్షరాస్యులు. అట్లాంటి కాలంలో వాళ్లకు వినోదంతో పాటు నీతిసూత్రాల ఆలోచనను కలిగించేందుకు జానపద కళలు ఉపయోగపడేవి. వీటిలో యక్షగానాలు, గొల్లసుద్దులు, తుపాకిరాముడు గురించి తెలుసుకుందాం.
యక్షగానాలు
: కొన్నిచోట్ల వీటిని బాగోతాలని, నాటకాలని కూడా అంటారు. పాటలు, పద్యాలు, దరువు, ఆదితాళం మొదలగు ప్రక్రియలతో ఇది సాగుతుంది. ఎక్కువగా వీటిని రాత్రిపూట ప్రదర్శించేవారు. గ్రామంలోని కొందరు యువకులు 'మ్యాల్లం' గట్టి యక్షగానాన్ని నేర్చుకుని ప్రదర్శించేవారు. ప్రజాకళలు ఎప్పుడూ ప్రజల వినోదానికి మాత్రమే ఉపయోగించేవారు కాని సంపాదన కోసం కాదు. నృత్య, నాటక, సంగీత గాత్రాల కలబోత ఇది. ఆయాపాత్రల్లో నటులు నటించి సవరసాలు ఒలకబోస్తుంటే ప్రజలు పరవశంగా స్పందించేవారు. యక్షగానాలు కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన ఒక
SC ప్రక్రియ.
నాటకాలు అయినా యక్షగానాలు అయినా దైవ ప్రార్ధనతో మొదలుపెట్టేవారు.
పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతితపావన సుప్రకాశ వరదాయక సకలలోక వాంఛిత గుణదాప్రమేయ నీకు వందనములు రామ సొగతో మమ్మేలుకోవా పాకశాసనాభివినుత పంకజమన బ్రోవుమిక పరమేశ్వర మొక్కెదా....
ఎక్కువగా ప్రచారంలో ఉన్నపాట ఇది. యక్షగానాల్లో స్వదేశీయక్షగానాలు కూడా ఉంటాయి. ఎక్కువగా పల్లెల్లో ప్రదర్శించేది ఈ యక్షగానాలే. బాలనాగమ్మ, చంద్రహాస, శకుంతల, అల్లీరాణి, క్రూరసేన, సత్యహరిశ్చంద్ర లాంటివి యక్షగానాలకు ఉదాహరణలు, యక్షగానాల్లో జానపదులు సులభంగా పాడుకోవడానికి వీలుండే రాగాలు, పాటలు, పద్యాలుంటాయి. ఇందులో భాష, వచనం జనాలకు సులభంగా అర్థమయ్యేరీతిలో ఉంటాయి. ముఖ్యంగా రూపక, ఏక, ఆది, జులువ తాళాలలో పాటలుంటాయి.
మంగలాంగుడనురా రుఖ్మాంగుడాను భూపాల చంద్రుడను ॥ ॥
సంగర రంగము నందు శత్రువుల బంగమొనర్చిన బలవిక్రముడను ॥ మం॥
యక్షగానాల్లో స్త్రీలపాత్రలు కూడా పురుషులే ధరించేవారు.
వాయిద్యాలు : తబల, తాళం, హార్మోనియంలను ఇందులో వాయిద్యాలుగా వాడతారు. వేషకాడు పాట పాడుతుంటే పాటకు అనుగుణంగా తబల తాళం మోగుతుంది. హార్మోనియం వీటితో జతకడుతుంది. తబల తాళం కొట్టెవాళ్లు మ్యాల్లంలో సభ్యులై ఉంటారు. వీరు కూడా వేషం వేస్తారు. వీరు స్టేజిమీదికి వెళ్లినప్పుడు ఆ బాధ్యతను మరొకరు తీసుకుంటారు.
వేదిక S యక్షగానాలకు, నాటకాలకు వేదిక ఏర్పాటు చేసుకోవడం చాలా తేలిక. ఆటను ఆడేరోజు సాయంత్రమే ఈ వేదికను ఏర్పాటుచేసుకుంటారు. మామూలుగా వేదికను నాలుగు బజార్లకాడనో కచేరు దగ్గరనో ఏర్పాటుచేసుకుంటారు. నాలుగు వైపుల నాలుగు గుంజల్ని పాతి ఎలిత బొంగులతోనో కర్రలతోనో పందిరివేస్తారు. ఎదురుగా తెల్లటిబట్టనో చెద్దర్లనో రంగు రంగుల చీరలనో కడతారు. వీలైతే పక్కలకు పరదాలను వేలాడదీస్తారు. లేదంటే వదిలేస్తారు. ఒక్కోసారి గ్రామంలో తిరిగి నాలుగు పెద్ద బల్లలను అడుక్కొచ్చి వేస్తారు. లేదంటే నేలమీదనే వేదికను ఏర్పాటుచేస్తారు. వేదికకు రెండు వైపుల రెండు కరంటు బల్బులను ఏర్పాటుచేస్తారు. లేదంటే రెండు వైపుల పెట్రమాక్స్ లైట్లను పెట్టేవారు. ఇవేవీ అందుబాటులో లేని కాలంలో దీవిటీలను వెలిగించి పట్టుకుని ఆటను ప్రదర్శించేవారు.
ప్రదర్శన : తెరచాటున వేషకాళ్లు కూర్చునేవారు. తెరకు ముందు జనం కూర్చుండేవారు. ముందువరుసలో కూర్చోవడానికి పోటీపడేవారు. గ్రామస్తులు ముందుగానే వెళ్లి చాపలు, జోరతట్లు వేసుకుని జాగను ఆపుకునేవారు.
మామూలుగా రాత్రిపూట తిండితిన్నాక ఈ ప్రదర్శన మొదలయ్యేది. అర్ధరాత్రివరకు, పెద్ద కథ అయితే తెల్లవారుజాము వరకు ప్రదర్శన సాగేది, వేషధారి వేదిక ముందుకు వచ్చి పాటను పాడుతుంటే వెనక ఉన్న మిగతా సభ్యులు పాటను అందుకునేవారు. ఇలా పాటను అందుకోవడాన్ని పల్లెం అనేవారు. తేరు నడిపించెదను చూరి వేడుక మీరగను ధారుణి జనులంత నన్ను వీరుడని పొగడగను దూలి గప్పి వచ్చి నట్టి గాలి చందంబులోన
క్షేమమా భూచక్రాపురమూ... మంత్రి క్షామమను మాటలేక గన కామక్రోధలోభమత్సరంబులు కడకుపార దోలి పౌరి జనములు ॥2॥ శ్రీమహేఘనామద్యాన్నమున కుల నీమమీ డకను ఉన్నవారలా ॥క్ష
అయ్యో దిక్కేదే ... . తలిదండ్రి లేని వారమైతి చయ్యన మన మేనమామ స్వగృహమునకు పోవనెంచి అయ్యెను మొద్దయ్యెను బయమయ్యెను ఏమయ్యనొకో NGANA
ఈ యక్షగానాల్లో పాత్రలను పరిచయం చేసి రాజుకు మంత్రిగా, రాణికి చెలికత్తెగా, యువరాజుకు స్నేహితునిగా కథను నడిపిస్తూ హాస్యాన్ని పంచుతూ చివరివరకూ ఉండే పాత్ర బుడ్డరిఖాన్.
గొల్లసుద్దులు:
గొల్లసుద్దులంటే గొల్లలు చెప్పే సుద్దులు. సుద్దులు అంటే ఇందులో ప్రధాన కథకుడు ఆటపాటలతో ప్రేక్షకులను పాడేపాటను అటు ఇటు పక్కనున్న ఇద్దరు చెవికి చెయికప్ ప్రదర్శనలో వీరణాలు (పెద్దడోళ్ళు), కొంతమంది వెనుక నుండి వంతపాడుతారు.
సంగతులు లేదా మంచి మాటలు, అలరిస్తాడు. ప్రధాన కథకుడు సాగదీసి వంతపాడుతారు. ఈ కొమ్ములనుపయోగిస్తారు.
గొల్ల సుద్దుల ప్రదర్శనలో కథకుడు సరాసరి రంగస్థలం మీదికి రాడు. జనం మధ్య నుండి వస్తాడు. మిగిలిన ఇద్దరు కూడ ఆటను రక్తికట్టించడానికి ఈ మూలనుందొకరు, ఆ మూలనుండొకరు టుర్. టుర్ మని అదిలించినట్లు, తప్పిపోయిన గొర్రెలను వెతుకుతున్నట్లు. తోడేళ్ళను తరుముతున్నట్లు శబ్దాలు చేస్తూ వస్తారు.
వీళ్ళ వేషధారణ మోకాళ్ళదాక మడిచికట్టిన పెద్ద అంచున్న ధోతి, నెత్తికి రుమాలు, చెవులకు దుద్దులు, ముంజేతికి కడియాలు, వెండి బిళ్లల మొలతాడు, భుజంమీద గొంగడి, కాళ్ళకు గజ్జెలు, చేతిల కర్రతో గమ్మత్తుగుంటారు. వీళ్ళు రకరకాలుగా యాస భాషతో ఆద్యంతం నవ్విస్తుంటారు. కథను ఎటంటే అటుమలుస్తూ, అందరిని ఆకట్టుకుంటారు.
గొల్లసుద్దులు రూపకం రానురాను ఎన్నెన్నో మార్పులకు గురయింది. ఇప్పటికీ సామాజిక చైతన్యాన్ని కల్గించటానికి ఈ ప్రక్రియల్లో చెపితే సామాన్యులు సులభంగా అర్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఈ ప్రదర్శనకు డప్పు, డోలక్ను వాయిద్యాలుగా ఉపయోగిస్తున్నారు.
ప్రదర్శన : ముందుగా ప్రధాన కథకుడు వేదిక మీదికి వచ్చి, మిగిలిన ఇద్దరిని పాట రూపంలో పిలుస్తాడు.
ఓరి రంగన్నో...
యాడబోయిండో ఈడు... ఓరి రంగన్నో ఇట్ల లాభంలేదు పాటతో పిలుస్త
ఎల్లన్న : రార్రో రంగన్న- బిరాన ఇటురారో రాజులు మారిన గాని - రాజ్యాలు మారిన గాని
లంగనా
॥
రంగన్న : వచనం : వత్తన్నత్తన్నతన్ననే....
మారలేదు మన బతుకులు- తీరలేదు మన బాధలు
(పాట) ఏందే ఎల్లన్న గిప్పుడేమయ్యింది.
॥ ఏందే ఎల్లన్న ॥
మనరాతలిట్లుండ - మార్చేదిఎవ్వరో పొద్దువోని సుద్దులేల జెపుతావే ఎల్లన్న
॥ మన రాతలు ||
ఎందే ఎల్లన్న లొట్టిమీది కాకిలెక్క ఒక్క ్క తీర్ధ మొత్తుకోబడితివి ఏమయ్యిందే నీకు?
॥ ఏందే ఎల్లన్న ॥
ఎల్లన్న తిట్టేనోరు, తిరిగేకాలు ఊరుకోదన్నట్టు, నాకేదన్నతెలిస్తె మీకు జెప్పందే మనుసునవట్టదురా.
రంగన్న : అయితే గదేందో జెప్పరాదు.
ఎల్లన్న : చెపుగాని మల్లన్నేడిరా? పిలిచి చూస్త... రార్రో మల్లన్న రాతిరెక్కువైపాయె గొర్లమందకాడనే పొద్దుపోతున్నది ॥ రార్రో మల్లన్న॥
మాటమాట జెప్పుకుంట మందకాడి పోదాం ॥ రార్రో మల్లన్న॥
మల్లన్న : (వచ్చి) ఎందే ఎల్లన్న పిలుపుమీద పిలుపేత్తవు S సంసారం సంతలోన సింతలెక్కువైపాయె బతుకు మీద తీపిఏమొ గింతన్నలేకపాయె అలుపుసొలుపు లేకుండా పిలుపు మీద పిలుపేత్తవ్ ॥ ఏందే ఎల్లన్న ॥
ఇట్ల జెప్పుకుంటూ సమస్యలను, పరిష్కారాలను సుద్దుల్లో చెపుతారు. పాడేటి పాటలల్లో సమాజంలోని చెడును తొలిగించే ప్రయత్నం కనపడుతుంది. ఈ కళారూపాలు వినోదాన్నందించటమే కాకుండా విజ్ఞానదాయకంగా కూడ ఉంటాయి. అనాదిగా ప్రదర్శిస్తున్న ఈ కళారూపాలు ఇటీవలి కాలంలో ప్రజా ఉద్యమాల్లోను, ప్రభుత్వ కార్యక్రమాలైన అక్షరాస్యత, ఆరోగ్యం, పర్యావరణం, ఎయిడ్స్ నిర్మూలన, కుటుంబ నియంత్రణ, వ్యవసాయం మొదలైన అంశాలను ప్రజల్లోనికి తీసుకెళ్ళినాయి. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కళాబృందాలు ఈ ప్రదర్శన ద్వారా తెలంగాణ సాధనను సుగమం చేశాయన్నది ముమ్మాటికి నిజం.
తుపాకి రాముడు (పిట్టలదొర వేషం చూస్తేనే నవ్వువస్తుంది. మాటలు వింటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. ఈ మాటలు సరిగ్గా 'తుపాకి రాముడి'కి సరిపోతాయి. గమ్మత్తుగా ఉండే వేషం, చిత్రవిచిత్రమైన మాటలు మాట్లాడుతూ... పైకి ఎన్నో డాంబికాలు చెపుతున్నప్పటికీ తన వెనుకనున్న లేమిని గుర్తించండని అందరిని నవ్విస్తూ, ఇంటింటికి తిరిగి యాచిస్తుంటాడు. ఇది పగటివేషాల్లో ఒక రకమని చెప్పవచ్చు. ఎవరైనా వదలుగా అడ్డదిడ్డంగా డ్రెస్సు వేసుకుంటే 'ఏమిరా! తుపాకి రాముడి 'వేషమేందిరా' అనేవాళ్ళు.
ఒక పక్క పైకి మడచిన ఖాకీ ప్యాంటు, చినిగిన అంగి, తెల్లఈకతో కూడిన ఇంగ్లీషుదొరల టోపి, మెడలో రుమాలు (స్కార్ఫ్), సన్నటి చిరుకత్తి మీసం, కాళ్లకు బూట్లు, భుజానికి కట్టెతుపాకి, ముఖానికి తెల్లరంగుతో చూపరులకు ఉంటుంది. తుపాకిరాముని వేషం, సవ్వుపుట్టించేదిగా
ప్రదర్శన : వచ్చె వచ్చె ఎవడచ్చె ఎంకట్రాముడచ్చే. మారాజ మారాజ మారాజ. మాతాత తట్టల్దార... మానాన్న బుట్టల్దార... నేను పిట్టలొర... నన్నందరు లత్కోర్ సాబంటరు. GANA
పాట : మాటకు నేను నవాబును పూటకు లేని గరీబుని
నేనే ఎంకట్రాముణ్ణి నేనే పిట్టలదొరని ॥ మాటకు ॥
: మారాజ మారాజు మారాజ... నాకేం తక్కువలేదు. తీసుకతింటే తరుక్కపోతదని అడుక్కతింటున్న, సుకతింటే తరుక్కవ
నా పెండ్లికి అమెరిక, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్, మలేసియా, B ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుండి అందరచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని సెర్ల బియ్యంపోసి, తూం కింద మంట బెట్టిన చింతాకిస్తరేసి ఇద్దరికిత్తుసొప్పున మస్తుగ వడ్డిస్తే బద్దం తిన్నరు బాంచెను. మీ అందరిని చూత్తాంటే అందరు నా పెండ్లికచ్చినట్టే ఉన్నరు గాని... కట్నాల బుక్కుల మాత్రం ఒక్కరి పేరు లేదు.
ఇంతమంచి హాస్యాన్ని పండించే పిట్టలదొరలు ఇప్పుడు కనబడటంలేదు.
ఈ కళలు ఇప్పటివి కావు. వందల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న ప్రజా కళలు పల్లె జీవనంతో, సంస్కృతితో కలిసిపోయిన కళలు. ప్రజల సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకొని ఓదార్పునిచ్చిన కళలు తరతరానికి రూపాన్ని మార్చుకుని ప్రజల ఆలోచనా విధానానికి పదును పెట్టిన కళలు, జీవితంలో ఓ భాగంగా సాగి కదిలి కదిలించిన ఈ ప్రజా కళలు ఆదరణ లేక కనుమరుగై పోతున్నాయి. వీటిని సంరక్షించుకునే బాధ్యత మనందరిది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి