రామాయణం కిష్కింధా కాండం
కిష్కింధా కాండం
పంపాసరోవర ప్రాంతం పరమ రమణీయంగా ఉంది. ప్రకృతి తన అందాలను ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. కాని శ్రీరామున మనసును ఏమాత్రం సంతోషపెట్టలేకపోయింది. పైగా సీత ఎడబాటు ఆవేదన అనే అగ్నికి అజ్యం పోసినట్లుగా శ్రీరాముని బాధను మరింత పెంచింది. లక్ష్మణుడు ఊరడించాడు. "అన్న ఈ చైన్యాన్ని వదులు. అదే మనకు మేలుచేస్తుంది. చేసిన ప్రయత్నం విఫలమైనప్పుడు, సంపదలను పోగట్టుకున్నప్పుడు అధైర్యపడకుండా ప్రయత్నంచేస్తే మంచి ఫలితముంటుంది. ఉత్పావక్ష బలం. ఉత్సాహమున్నవానికి అసాధ్యమనేదిలేదు. వాళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వెనకడుగువేయరు. మన ప్రయత్నాన్ని కొనసాగిద్దాం. వదినగారు తప్పకుండా లభిస్తారు" అని ధైర్యం చెప్పాడు.
ఋష్యమూక పర్వతం నుంచి రామలక్ష్మణులను చూశాడు సుగ్రీవుడు. గుండెలో రాయిపడ్డట్టయింది. ఆ ఇద్దరు వీరులు తన అన్న అయిన వాలి పంపగా వచ్చారేమోనని భయంతో వణకిపోతున్నాడు. ధనుర్బాణాలు ధరించిన వాళ్ళెవరో మారువేషంలో కనుక్కోమని ఆంజనేయుణ్ణి ఆదేశించాడు.
సుగ్రీవుని ఆనతిమీద రామలక్ష్మణులున్న చోటికి ఒక్క గంతువేశాడు హనుమంతుడు. సన్యాసి రూపంలో వారి దగ్గరక వెళ్ళాడు. వారి రూపాన్ని పొగిడాడు. వారి పరిచయం అడిగాడు. రామలక్ష్మణులు మౌనముద్రసుదాల్చారు. హనుమంతుడు వారితో "వానరరాజు సుగ్రీవుడు ధర్మాత్ముడు, మహావీరుడు, అతణ్ణి ఆయన అన్న వాలి వంచించాడు. రక్షణకోసం జాగ్రత్తతో తిరుగుతున్నాడు. నేను సుగ్రీవుడి మంత్రిని, నన్ను 'హనుమంతుడంటారు. నేను వాయుపుత్రుణ్ణి. ఎక్కడికైనా వెళ్ళిరాగల శక్తి గలవాణ్ణి. సుగ్రీవుడు పంపగా ఈ రూపంలో మీదగ్గరకి వచ్చాను. సుగ్రీవుడు మీతో స్నేహాన్ని కోరుతున్నాడు" అని చాకచక్యంగా మాట్లాడాడు. విషయాన్ని చెప్పేపద్ధతిలో ఎంతో నేర్పును ప్రదర్శించాడు. హనుమంతుని మాటతీరు శ్రీరాముణ్ణి ఆకట్టుకుంది. లక్ష్మణుడితో "ఇతడు వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడన్నది నిశ్చయం. లేకపోతే మాటల్లో ఇంత స్పష్టత ఉండదు. తడబాటు, తొందరపాటు లేకుండా, తప్పులు పలకకుండా, సరైన స్వరంతో చెప్పదలచుకున్న విషయాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పాడు. ఈయన మాట్లాడే తీరుచూస్తే చంపడానికి కత్తి ఎత్తిన శత్రువుకు కూడా చేతులు రావు" అని మెచ్చుకున్నాడు. మాటకున్న శక్తి అటువంటిది.
హనుమంతుడితో లక్ష్మణుడినే మాట్లాడమన్నాడు శ్రీరాముడు. హనుమంతుడి అభిప్రాయాలకు సమ్మతి తెలుపుతూ, తమ వృత్తాంతాన్ని వివరించాడు లక్ష్మణుడు. తమకు సుగ్రీవుడి సహాయం ఎంతో తగినదన్నాడు. సన్న్యాసిరూపం వదలి రామలక్ష్మణులను భుజాలపై ఎక్కించుకొని ఋష్యమూక పర్వతానికి చేరుకున్నాడు హనుమ, అంతకు ముందే భయంతో మలయగిరికి చేరిన సుగ్రీవుణ్ణి రామలక్ష్మణుల వద్దకు తీసుకువచ్చాడు ఆంజనేయుడు.
శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులైనారు. సుగ్రీవుడు "రామా! ఈనాడు నీవు నాకు ప్రాణమిత్రుడివైనావు. ఇప్పటి నుంచి సుఖదుఃఖాలలో మనం ఒక్కటిగానే ఉందాం. వాలి భయం నన్ను వదలడంలేదు. నీ అభయం కావాలి" అని ప్రార్ధించాడు.
శ్రీరాముడు మందహాసాన్ని చిందుస్తూ. "సుగ్రీవా! ఆపదలో ఆడుకునేవాడే గదా మిత్రుడు నీ భార్యను అపహరించిన వాలిని తప్పక పధిస్తానని మాట ఇచ్చాడు. సుగ్రీవుడి మనసుకుదుటపడింది.
శ్రీరామసుగ్రీవులు స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటున్నసమయంలోనే సీతాదేవికి, వాలికి, రావణాసురునికి ఎడమకన్ను ఒకుసారిగా ఆదిరింది
సుగ్రీవుడు గతంలో తాను నలుగురు మంత్రులతో కొండమీద ఉన్నప్పుడు ఒక రాక్షసుడు స్త్రీని బలవంతంగా తీసుకుపోవడం "చూశామన్నాడు. ఆమె "రామా! లక్ష్మణా!" అని నిగ్గరగా అరవడం విన్నామన్నాడు. తమను చూసి ఒక వగట మూటను జారవిడచిందని చెప్పి, ఆ ఆభరణాలను తెచ్చి చూపించాడు. శ్రీరాముడు వాటిని చూసి కన్నీటి సంద్రమయ్యాడు. లక్ష్మణుడు "అన్నా! ఈ కేయూరాలను, కుండలాలను నేను గుర్తుపట్టలేను. కాని కాలి అందెలు మాత్రం మా వదినెగారివే. ఆమెకు నిత్యం పాదాభివందనం చేయడంవల్ల నేను వీటిని గుర్తుపట్టానన్నారు.
శ్రీరాముని శోకాన్ని పోగొట్టే ప్రయత్నం చేశారు సుగ్రీవుడు. సీతాదేవిని తీసుకురావడంలో తాను తగిన ప్రయత్నం చేస్తానన్నాడు. సపరివారంగా రావణుణ్ణి హతమార్చేందుకు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగిస్తానన్నాడు. దుఃఖం అనర్థదాయకం కనుక ఎప్పుడూ దుఃఖించవద్దన్నాడు. ఎల్లప్పుడూ దుఃఖించేవారికి సుఖముండదు. తేజస్సు క్షీణిస్తుంది. ఒక్కొక్కప్పుడు ప్రాణాలు నిలవడమే కష్టంగా ఉంటుంది. కనుక దుఃఖస్థితినుంచి బయట పడమని ధైర్యవచనాలను చెప్పాడు.
"ఓ రామా! నిజమైన మిత్రుడు తన స్నేహితుడికోసం సంపదలను, సుఖాలను, చివరకు తన ప్రాణాలను కూడా విడవడానికి సిద్ధపడతాడు. ప్రాణమిత్రులమైన మనం స్నేహధర్మాన్ని చక్కగా పాటిద్దా" మన్నాడు. శ్రీరాముడు అందుకు అంగీకరిస్తూ "ఉపకారం జరగడమే మిత్రునివల్ల ఫలం - అపకారం చేయడం శత్రువు లక్షణం. నీ భార్యనపహరించిన వాలిని ఈరోజే చంపుతానన్నాడు. వాలితో వైరమెందుకు వచ్చిందో తెలపమన్నాడు సుగ్రీవుణ్ణి, గతకథను శ్రీరాముని చెవిన వేశాడు సుగ్రీవుడు.
"మా అన్న వాలి మహాబలశాలి. పెద్దవాడు కనుక మా తండ్రి తరవాత కిష్కింధకు రాజైనాడు. మాయావి అనే వాడికి మా అన్నతో వైరం. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధకు వచ్చి వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మేమెంతగా వారించినా వాలి వినకుండా వానితో పోరుకు సిద్ధమయ్యాడు. మమ్ములను చూడగానే మాయావి భయంతో వెనుదిరిగి పిక్కబలంచూపాడు. మేము వెంబడించాం. అతడు ఒక పెద్ద భూగృహంలోకి వెళ్ళాడు. వాలి ఆవేశంతో ఊగిపోతున్నాడు. నన్ను బిలద్వారం దగ్గరే ఉండమన్నాడు. మాయావిని చంపి వస్తానని వెళ్లాడు. సంవత్సరమైంది. అన్నజాడేలేదు. నా ఆశలు అడుగంటాయి. ఆందోళన ఎక్కువైంది. ఇంతలో నురుగుతోకూడిన రక్తం గుహలో నుంచి బయటకు వస్తున్నది. లోపల రాక్షసునివి, అన్నగారి అరుపులు వినిపిస్తున్నాయి. మాయావిచేతిలో మా అన్న చనిపోయాడనుకున్నాను. రాక్షసుడు బయటకు వస్తాడేమోనని కొండంత బండతో బిలద్వారాన్ని మూసేశాను, మౌనంగా కిష్కింధకు వచ్చాను. మంత్రులు నా ద్వారా సమాచారాన్ని రాబట్టారు. బలవంతంగా నన్ను రాజును చేశారు. కొంతకాలానికి వాలి వచ్చాడు. నన్ను రాజును చేయడం చూసి కనులెర్రజేశాడు. నా కుమారులను చెరసాలలో బంధించాడు. ఎంత బతిమాలినా క్షమించలేదు. సరికదా నన్ను రాజ్యభ్రష్టుణ్ణి చేయడమేకాదు. నా భార్య రుమను అపహరించాడు. ప్రాణభీతితో పరుగులుతీశాను. సమస్త భూమండలం తిరిగాను. చివరకు ఈ ఋష్యమూక పర్వతాన్ని చేరుకున్నాను. మతంగముని శాపం కారణంగా వాలి ఇక్కడకు రాలేదు. వాలి దుందుభి అనే రాక్షసుణ్ణి చంపి విసరివేసినప్పుడు ఆ రాక్షసుడి నోటినుండి రక్త బిందువులు మతంగాశ్రమం మీద పడ్డాయి. అందుకు కోపించిన ముని ఋష్యమూక పర్వతం మీద కాలు పెడితే వాలి మరణిస్తాడని శపించాడు" అంటూ సుగ్రీవుడు తన కథనంతా చెప్పాడు.
శ్రీరాముని బలములాంటిదో తెలుసుకోవాలనుకున్నాడు సుగ్రీవుడు. దానికి జవాబుగా శ్రీరాముడు వాలి భో అక్కడ పడి ఉన్న దండు ఆస్థిపంజరాన్ని పరియోజనాల దూరం పడేటట్లు విమ్మివేశాడు. ఒకే బాణంతో ఏడు ముద్దిచిను చీల్చాడు సంతోషించాడు సుగ్రీవుడు..
వాలి వధకు ఇక ఏ మాత్రం ఆలస్యం వర్ణని శ్రీరాముణ్ణి తొందరపెట్టాడు. అందరూ కిష్కింధకు వెళ్ళారు. సుగ్రీవడు భయంకరంగా గర్ణిస్తూ వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు. మహాబలశాలి అయిన వాలి క్షణాలలో అక్కడ వాలాడు. ఇ యుద్ధం అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. వాలిసుగ్రీవులు ఒకే పోలికతో ఉన్నారు. అందుకే శ్రీరాముడు వాటన స్పష్టంగా గుర్తించలేకపోయాడు. వారి విశబృంభణకు తట్టుకోలేకపోయాడు సుగ్రీవుడు శ్రీరాముని కొరకు చూశాడు. కనిపించలేను గుండెగుభేలుమంది. ప్రాణభయంతో ఋష్యమూకానికి పరుగులుతీశాడు సుగ్రీవుడు. అక్కడకు వెళ్ళలేని వాలి సుగ్రీవుడిత 'బతికావు పో' అని మరలిపోయాడు.
లక్ష్మణ హనుమంతులతో కూడి శ్రీరాముడు సుగ్రీవుని దగ్గరికి వచ్చాడు. సుగ్రీవుడు సిగ్గుతో తల దించుకున్నాడు. “5 సూచన పాటించినందుకు ఫలితమిదేనా?" అని ప్రశ్నించాడు. శ్రీరాముడు అసలు విషయం చెప్పాడు. సుగ్రీవుణ్ణి గుర్తుంచడానికి వీలుగా 'నాగకేసరపులత'ను మెడలో వేయమని లక్ష్మణుడికి చెప్పాడు. అన్న ఆజ్ఞను వెంటనే అమలుచేశాడు లక్ష్మణుడు. పూలతో నిండిన ఆ లతను ధరించి సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు.
కిష్కింధకు ప్రయాణమయ్యారందరూ సుగ్రీవుడు వాలిని మళ్ళీ యుద్ధానికి ఆహ్వానించాడు. వాలి అడుగుముందుకు వేశారు. కాని అతని భార్య తార అడ్డుపడింది. ఒకసారి ఓడిపోయి దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్లీ ఆహ్వానించడం వెనుక ఏదో అంతర్యం ఉందని అభిప్రాయపడింది. సుగ్రీవుడికి శ్రీరాముడు అండగా ఉన్నాడన్న విషయాన్ని ప్రస్తావించింది. యుద్ధానికి వెళ్ళడం క్షేమంకాదని. వారించింది. తారమాటలను పెడచెవిన పెట్టాడు వాలి. యుద్ధదిశగా అడుగులు వేశాడు.
వాలిసుగ్రీవుల పోరు తీవ్రంగా సాగుతున్నది. రక్తం కారుతున్నా పట్టించుకునే స్థితిలో లేరు వాళ్ళిద్దరూ. మెల్లమెల్లగా సుగ్రీవుని శక్తి సన్నగిల్లుతున్నది. మాటిమాటికి దిక్కులు చూస్తున్నాడు. అతని అంతర్యం అర్థమైంది శ్రీరామునికి, విషసర్పంతో సమానమైన బాణాన్ని అతడు వాలిమీదకు వదిలాడు. అది క్షణాలలో వాలి వక్షఃస్థలంలో నాటుకున్నది. వాలి నేలమీదికి వాలిపోయాడు. స్పృహకోల్పోయాడు. రక్తపుమడుగులో పడి ఉన్న వాలి కొంతసేపటికి తేరుకున్నాడు. రామలక్ష్మణులను చూశాడు. శ్రీరామునితో "ఉత్తముడని పేరుపొందిన నీవు ఇంత అధర్మంగా ఎందుకు ప్రవర్తించావు? నీకు నీ దేశానికి నేనెన్నడూ అపకారం చేయతలపెట్టలేదు. అలాంటప్పుడు నన్నెందుకు చంపవలసివచ్చింది, నిన్ను ఎదిరించి యుద్ధమే చేయలేదు. వేరొకరితో పోరుతున్నప్పుడు ఎందుకు దొంగదెబ్బ తీశా"వని నిలదీశాడు. సీతాదేవి కొరకు సుగ్రీవుణ్ణి ఆశ్రయించడంకన్నా తనను కోరిఉంటే బాగుండేదన్నాడు. ఒక్కరోజులో సీతాదేవిని తెచ్చి అప్పజెప్పే వాడనని పలికాడు. రావణుణ్ణి యుద్ధంలో బంధించి తెచ్చి ముందుంచే. వాడినని తెలిపాడు.
శ్రీరాముడు వాలి అభిప్రాయాలను తోసేశాడు. తమ్ముడి భార్యను చెరపట్టడం వంటి అధర్మాలకు ఒడిగట్టినందువల్ల నేను నీకు మరణదండన విధించానన్నాడు శ్రీరాముడు, వానరుడివి కనుక చాటుగా ఉండి చంపడంలో తప్పులేదన్నాడు.
శ్రీరాముని మాటలు విన్న వాలి తన తప్పును తెలుసుకున్నాడు. మన్నించమని దోసిలొగ్గాడు. భర్త విషయం తెలుసుకున్న తార పరుగుపరుగున వచ్చింది. మరణవేదనతో కింద పడి ఉన్న వాలి దీనస్థితిని చూసింది. గుండె చెరువయ్యేటట్లు ఏడ్చింది. ప్రాయోపవేశానికి సిద్ధపడిన తారను హనుమంతుడు ఓదార్చాడు. తార, అంగదుల బాధ్యతను సుగ్రీవునకు వాలి అప్పజెప్పాడు. తనమెడలోని దివ్యమైన సువర్ణమాలను సుగ్రీవునకిచ్చి వెంటనే ధరించమన్నాడు. లేకుంటే వాలి చనిపోయిన మరుక్షణమే ఆ మాలకున్న శక్తి నశిస్తుంది. కొడుకైన అంగదుడికి జీవితంలో ఎలా నడచుకోవాలో ఉపదేశించాడు. బాణం వల్ల కలుగుతున్న బాధ అంతకంతకూ అధికమై ప్రాణాలను వదిలాడు. వాలి జీవితాధ్యాయం ముగిసింది.
సుగ్రీవ హనుమదాదులు శ్రీరాముని దగ్గరకి వచ్చారు. హనుమంతుడు శ్రీరామునితో సుగ్రీవుని పట్టాభిషేక విషయం ప్రస్తావించాడు. దీనికోసం కిష్కింధకు రమ్మని ప్రార్థించాడు. తండ్రి అజ్ఞమేరకు పద్నాలుగు సంవత్సరాల వరకు ఏ గ్రామంలోగాని నగరంలోగాని తాను అడుగుపెట్టనని చెప్పి పితృవాక్య పరిపాలనను మరోమారు చాటుకున్నారు శ్రీరాముడు సుగ్రీవునికి శుభం పలికాడు. తాను ప్రసవణగిరి మీద ఉంటానన్నాడు. వర్షాకాలం పోయాక సీతాన్వేషణ ప్రయత్నం ప్రారంభించమని సుగ్రీసుణ్ణి ఆదేశించాడు. సరేనన్నాడు సుగ్రీవుడు.
కిష్కింధకు రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు పట్టాభిషిక్తులయ్యారు. కాలం గడుస్తున్నది. తరత్యాలం వచ్చింది. సీతాన్వేషణ కార్యభారాన్ని సుగ్రీవుడికి గుర్తుచేశాడు హనుమంతుడు, తదనుగుణంగా సేనలను సమీకరించమని సేనాపతి అయిన 'వీలుడ్డి' అజ్ఞాపించాడు సుగ్రీవుడు. ఇది శ్రీరామునికి తెలియదు. లక్ష్మణుణ్ణి పిలిచి సుగ్రీవుని దగ్గరికి వెళ్ళమన్నాడు.
లక్ష్మణుడు కిష్కింధకు పయనమయ్యాడు. సుగ్రీవుడు రాజభోగాలలో ఓలలాడుతున్నాడు. సీతాదేవి ఎడబాటువల్ల నిలువునా నీరవుతున్న అన్నగారు, నిర్లక్ష్యంతో సుగ్రీవుడు లక్ష్మణునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుసలు కొడుతున్నాడు. అతని ముందుకు రావడానికి ఎవరికీ కాళ్ళాడడంలేదు, వానరులూ, మంత్రులేకాడు సుగ్రీవుడి పరిస్థితీ అంతే. మందిర ద్వారం దగ్గరికి వచ్చిన లక్ష్మణుడితో మాట్లాడటానికి తార వెళ్ళింది. స్త్రీలపట్ల కోపం ప్రదర్శించగూడదని శాంతించారు లక్ష్మణుడు. సుగ్రీవుడు సీతాన్వేషణకు శ్రీకారం చుట్టాడని తార లక్ష్మణునికి తెలిపింది. అంతఃపురంలో ఉన్న సుగ్రీవుణ్ణి కలిశాడు లక్ష్మణుడు. శ్రీరాముని దయవల్లనే తానీ స్థితిలో ఉన్నానని కృతజ్ఞత ప్రకటించాడు సుగ్రీవుడు. మహా పరాక్రమశాలి శ్రీరామునికి తన సహాయం నిమిత్తమాత్రమేనన్నాడు. తనవైపునుంచి ఏదైనా తప్పు జరిగితే మన్నించమన్నాడు. లక్ష్మణుడు శాంతించాడు. తన అన్నగారి దగ్గరికి సుగ్రీవుణ్ణి రమ్మన్నాడు.
సుగ్రీవుడు వివిధ ప్రాంతాలలోగల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతుణ్ణి ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్ళకు మరణదండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకూ వేగంగా పంపాడు.. ఫలితంగా కోట్లమంది వానరయోధులు కిష్కింధకు చేరుకుంటున్నారు. (సుగ్రీవుడిని ఆఙ్ఞ అటువంటిది. దానికి తిరుగులేదు. అందుకే 'సుగ్రీవాజ్ఞ' అనేది జాతీయంగా స్థిరపడ్డది.)
శ్రీరామునితో సుగ్రీవుడు సమావేశమయ్యాడు. వానరుల రాకను గురించి తెలిపాడు. సీతజాడను తెలుసుకోవడం, రావణుడి. నివాసాన్ని పసిగట్టడమే ప్రధానకర్తవ్యమన్నాడు శ్రీరాముడు. శ్రీరాముని సూచన మేరకు సీతాన్వేషణకోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు. తూర్పు దిక్కునకు 'వినతుని' నాయకత్వంలో సేనను పంపాడు. దక్షిణ దిక్కుకు అంగదుని నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు మొదలైన ప్రముఖులతో కూడిన సేనను పంపాడు. మేనమాను అయిన సుషేణుని నాయకత్వంలో పడమరకు, శతబలి నాయకత్వంలో ఉత్తర దిశకు సేనను వంపాడు. ఒక్కొక్క దిక్కుకు ఏయే ప్రదేశాలగుండా వెళ్లాలో, అక్కడ ఏమేమి ఉంటాయో వివరంగా చెప్పాడు సుగ్రీవుడు. ఆ ప్రదేశాలకు సంబంధించిన అతని జ్ఞానం చూస్తే ముక్కున వేలేసుకుంటాం. నెలరోజుల్లో సమాచారం తెమ్మని సుగ్రీవాజ్ఞ, సీతాన్వేషణను సఫలం చేయగల సమర్థుడు హనుమంతుడేనని సుగ్రీవుని నమ్మకం. హనుమంతుడూ అంతే విశ్వాసంతో ఉన్నాడు. శ్రీరాముని భావనకూడా అదే. అందుకే తన పేరు చెక్కబడిన ఉంగరాన్ని హనుమంతుడికి ఇచ్చాడు శ్రీరాముడు, సీత దీన్ని చూస్తే హనుమను రామదూతగా నమ్ముతుండన్నాడు. హనుమంతుడు సమస్యకు రామముద్రికను గ్రహించాడు. శ్రీరాముని పాదాలకు ప్రణమిల్లి ప్రయాణమయ్యాడు.
సీతాన్వేషణకు బయలుచేరి నెలరోజులు కావస్తున్నది. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్ళినవాళ్ళు తీవ్రంగా వెడికి వెదికి రక్తహస్తాలతో వెనుదిరిగారు. గడువు ముగిసేనాటికి ప్రసవణగిరిలో శ్రీరామునితో ఉన్న సుగ్రీవుడి దగ్గరికి చేరుకున్నారు. సీతజాడ కోసం చేసిన కృషి ఫలించలేదని విన్నవించుకున్నారు. హనుమంతుడు ఈ విషయంలో కృతకృత్యుడౌతాడని దీమా వ్యక్తంచేశారు. ఎందుకంటే రావణుడు సీతను తీసుకెళ్ళింది దక్షిణంవైపే గదా.
అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు బయలుదేరిన హనుమంతుడు మొదలైనవాళ్ళు అణువణువునా గాలిస్తున్నారు సుగ్రీవుడిచ్చిన గడువు పూర్తయింది. ఏం చేయాలో తోచడం లేదు. తమ వాళ్ళు నిరాశ పడకుండా జాగ్రత్తపడ్డాడు అంగదుడు విరక్తి పొందకుండా వైర్యోత్సాహాలతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని ప్రేరేపించాడు. అందరూ రెట్టించిన ఉత్సాహంత ముందుకు కదిలారు.
హనుమదాదులు ఒక పెద్ద గుహదగ్గరికి చేరుకున్నారు. అది 'ఋక్షబిలము', ఒక రాక్షసుని ఆధీనంలో ఉంది. నాగా అలసిపోయిన వానరులను ఆకలిదప్పులు పట్టి పీడిస్తున్నాయి. గుహలోకి వెళ్ళారు. అంతా అయోమయంగా ఉంది. చివరకు స్వయంప్రభ అనే యోగిని అనుగ్రహంతో ఆకలిదప్పులను తీర్చుకున్నారు. ఆమెను ప్రార్ధించి ఆమె తపః ప్రభావం వల్ల క్షణాలలో ఒక పెద్దసముద్రపు ఒడ్డుకు చేరుకున్నారు. ఆ సముద్రం 'మహోదధి' ఉవ్వెత్తున లేచే అలల అలజడి భయాన్ని కలిగిస్తున్నది.
సముద్రతీరంలో వానరులంతా సమావేశమయ్యారు. ఏం చెయ్యాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. సీత జాడ కనిపెట్టకుండా. సుగ్రీవుని చేరరాదనుకున్నారు..
వీళ్ళ మాటల్లో 'జటాయువు' ప్రస్తావన వచ్చింది. అది విన్నాడు 'సంపాతి'. ఇతడు పక్షిరాజు, జటాయువుకు అన్న, రెక్కలు లేక పడి ఉన్నారు. సంపాతి తన సోదరుడి మరణానికి ఎంతో విలపించాడు. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి కళ్ళకుకట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్లాలో చెప్పాడు. ఇంతలో ఆశ్చర్యకరంగా సంపాతికి రెక్కలు మొలిచాయి. (పరోపకారపుణ్యం ఊరికేపోతుందా?) అందరూ ఆనందించారు. తన రెక్కల బలాన్ని తెలుసుకోవడానికి రివ్వున ఆకాశంలోకి ఎగినాడు సంపాతి.
వానర వీరులు బలపరాక్రమాలను ప్రదర్శించడం ద్వారానే సీతాన్వేషణ సఫలమౌతుందన్న నిశ్చయానికి వచ్చారు. కాని వంద యోజనాలు వెళ్ళి రాగలవారెవ్వరని తర్కించుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కార్యహాని కలగకుండా కాపాడగలవాడు. హనుమంతుడొక్కడేనని నిగ్గుదేల్చాడు జాంబవంతుడు. ఆ సమయంలో హనుమంతుడు ఒకచోట ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు.
జాంబవంతుడు హనుమంతుణ్ణి చేరాడు. అతని శక్తియుక్తులెంతటివో తెలుపుతూ ప్రేరేపించాడు. దీనికి వానరుల ప్రశంసలు తోడైనాయి. ఇంకేముంది? హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో బలాన్ని పుంజుకున్నాడు. అద్భుతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు. వానరులతో "నేను మేరుపర్వతాన్ని అనాయాసంగా వేలమార్లు చుట్టగలిగాను భూమండలాన్ని సముద్రంలో ముంచగలను, గ్రహ నక్షత్రాలను అధిగమించగలను, పర్వతాలను నుగ్గు నుగ్గు చేయగలను, మహాసముద్రాలను అవలీలగా దాటగల"నని ఆత్మశక్తిని ప్రకటించాడు. (ప్రతివారిలో ఏదో ఒక శక్తి ఉంటుంది. సరైన ప్రేరణ దొరికితే అది వెలికి వస్తుంది.)
హనుమంతుని మాటలకు జాంబవంతుడు ఆనందించాడు. "నాయనా! నీ ధైర్యోత్సాహాలకు తగినట్లు మాట్లాడావు. నీ మాటలు వానరుల మనసులో గూడుకట్టుకున్న దుఃఖాన్ని దూరం చేశాయి. అందరం నీ శుభాన్ని కోరుతున్నాం. ఋుషులు, వృద్ధవానరులు, గురువుల అనుగ్రహంతో ఈ సముద్రాన్ని లంఘించు, నీ రాకకోసం ఎదురుచూస్తుంటాం. మన వానరుల ప్రాణాలన్నీ నీపైనే ఆధారపడివున్నా"యని తెలిపాడు. తాను లంఘించే సమయంలో తన బలాన్ని భూమి భరించలేదని, మహేంద్రపర్వత శిఖరాలు అందుకు తగినవని హనుమంతుడు పలికి మహేంద్రగిరికి చేరాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి