రామాయణం అరణ్య కాండం
అరణ్య కాండం
దండకారణ్యం పవిత్ర ప్రదేశం, ప్రశాంత ప్రదేశం, అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి. పక్షులు, మృగాలు- సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది, అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి. ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లెతాదును ధనుస్సునుండి వేరుచేశాడు శ్రీరాముడు. (అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు. ఎక్కడు. ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత. ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది.)
సీతా రామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు. ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటుచేశారు. మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడ్కోలు పలికి సీతారామలక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు.
వనం మధ్యకు చేరుకున్నారు. ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుదనే రాక్షసుడు అమాంతంగా సీతారామలక్ష్మణులు పైకి విరుచుకుపడ్డాడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గగ్గోలు పెడుతున్నది. రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికివేశారు. నెలపై కుప్పకూలాడు విరాధుడు, ముష్టిఘాతాలతో, మోకాళ్ళతో దాడిచేశారు. రామలక్ష్మణులు. ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు. వెంటనే నిరాధుడు తన పూర్వకథను వివరించాడు. తుంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపంచే రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు. శ్రీరాముని పల్ల శాపవిముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు. దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకొమ్మని, శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు. తనను గోతిలో పూడ్చమన్నాడు. అలాగే చేశారు రామలక్ష్మణులు.
విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయల్దేరారు. శరభంగుడు మహాతపస్వి, దైవసాక్షాత్కారం పొందినవారు. శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి ధారవోసాడు. (భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణసంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది. ఒక మహాకార్య సాధనలో ఎవరివరకు వారు సహకారమందించాల్సిందే.) అక్కడికి చేరువలోనే ఉన్న 'సుతీక్ష' మహర్షిని దర్శించమని శ్రీరామునికి సూచించాడు శరభంగమహర్షి సీతారామలక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడచి అగ్నితేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు.
అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమగోడును వెళ్ళబోసుకున్నారు. రాక్షసులు ముసులపై చేసే అకృత్యాలను
ఏకరువుపెట్టారు. రాక్షసుల చేతిలో బలైన మునుల కళేబరాలను చూపించారు. రాక్షసుల బారి నుండి రక్షించమని ప్రార్ధించారు.
వారితో శ్రీరాముడు "మహాత్ములారా! మీరు నన్ను ప్రార్ధించడం తగదు. అజ్ఞాపించాలి. మీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తా"నన్నాడు. (అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పదనముంది.)
సీతారామలక్ష్మణులు సుతీర్ణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష మహర్షి దేహం విడువకుండా ఉన్నాడు. తన తపశ్శక్తినంతా శ్రీరామునికి ధారాదత్తం చేశాడు. మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు.
దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూపోతున్నారు. సీతారామలక్ష్మణులు, అక్కడక్కడ కొంతకారం ఉంటున్నారు. ఇలా పది సంవత్సరాలు గడిచింది. మళ్ళీ సుతీక్ష మహర్షి వద్దకు వచ్చారు. అతనితో అగస్త్య మహర్షి దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెలిపుచ్చారు. సుతీర్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు. తన ఆశ్రమానికి దక్షిణంగా నాల్గుయో దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం, అక్కడికి యోజనదూరంలో అగసాశ్రమం ఉందని తెలిపాడు. మహర్షివద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామలక్ష్మణులు,
సాయంకాలానికి అగస్త్యసోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు. (ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అగస్త్య సోదరుని పేరేమో. చెప్పబడలేదు. ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత (సోదరుడు) అనే చెప్పారు. అందుకే పేరు తెలియని వారిని 'అగస్త్యవాక' అంటుంటారు. ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది.) అగస్త్యసోదరుని ఆతిథ్యంలో ఆరాత్రి గడిపారు సీతారామలక్ష్మణులు. ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు.
అగస్త్యుడు తపశ్శక్తి సంపన్నుడు. ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణచినవాడు. 'అగమ్ స్తంభయతీతి అగస్త్యం పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్త్యుడయ్యాడు.
శ్రీరాముని రాకను గమనించి అగస్త్యుడు శివ్య సమేతంగా ఎదురువెళ్ళాడు. అతిథిని గౌరవించే సంప్రదాయమది. శ్రీరాముడు. సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు. అగస్త్యుడు శ్రీరామునికి దివ్యధనుస్సు, అక్షయతూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని బహూకరించాడు. జయం కలుగుతుందని ఆశీర్వదించాడు. కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరిరావడం సాహసమని అభినందించాడు. ఆమెకుగల భర్త ప్రేమను మెచ్చుకున్నాడు.
శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు. ఒక్క క్షణం ధ్యానమగ్నుడైనాడు మహర్షి తరువాత శ్రీరామునితో "ఇక్కడికి రెండు యోజనాల దూరంలో 'పంచవటి' అనే ప్రదేశం ఉంది. అక్కడ ఫలాలకు, జలానికి కొదువలేదు గోదావరీనది తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు. ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు,
దారిలో బలిష్ఠమైన ఒక పెద్ద గడ్డను చూశారు. పక్షిరూపంలో ఉండే రాక్షసుదేమోననుకున్నారు. "నువ్వెవరి"పని అడిగారు. తన పేరు 'జటాయువు' అని దశరథుడి మిత్రుడిననీ చెప్పుకొన్నాడు. తన వంశచరిత్రనూ శక్తిసామర్థ్యాలను వివరించాడు జటాయువు. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువునకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు, శ్రీరాముని ఆజ్ఞమేరకు పంచవటిలో వర్ధశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు.
పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది. ఒకనాడు శ్రీరాముడు పురాణకథా ప్రసంగంలో ఉన్నాడు. ఇంతలో 'శూర్పణఖ' అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఈమె రావణాసురుడి చెల్లెలు. శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలైంది. తనను చేపట్టమన్నది. తమ మధ్య అడ్డుగా ఉన్న సీతాలక్ష్మణులను చంపితింటానన్నది. శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్ళమన్నాడు. లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పణఖ కూడా దాస్యం చేయాల్సివస్తుందని, అందుకే. శ్రీరాముణ్ణి చేరడమే సబబని సమాధానమిచ్చాడు. శ్రీరామునివైపు తిరిగింది శూర్పణఖ. సీత ఉంచడంవల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికిపోయింది. సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది.
క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు. అది ఎంతో ప్రమాదకరం. అలస్యం చేయకుండా శూర్పణఖను విరూపినిచేయమన్నాడు శ్రీరాముడు. అన్న అజ్ఞే అలస్యం- శూర్పణఖ ముక్కు చెవులు తెగిపడ్డాయి లక్ష్మణుని కత్తిరెబ్బకు. లబోదిబోమని మొత్తుకొంటూ సోదరుడైన ఖరుడి దగ్గరికి వెళ్ళింది శూర్పణఖ. ఖరుడు పద్నాలుగుమంది యోధులను పంపాడు. వాళ్ళంతా శ్రీరాముని చేతిలో మట్టిగరచారు. ఇది చూసిన శూర్పణఖ ఖరుని వద్దకు వెళ్ళి చెప్పింది. ఖరదూషణులు పద్నాలుగువేల మంది రాక్షసులతో రామునిమీదకు దండెత్తారు. మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు.
ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకుచేరింది. అకంపనుడు రావణాసురుడి గూఢచారుల్లో ఒకదు. ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముణ్ణి హతమారుస్తానని ఆవేశపడ్డాడు. అకంపనుడు, అసహాయశూరుడైన శ్రీరాముణ్ణి వధించడం. దేవాసురులకు కూడా సాధ్యంకాదని తేల్చేశాడు. కాని అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు. "శ్రీరాముని భార్య సీత అందాల రాశి, శ్రీరామునికి ప్రాణం. ఎలాగైనా ఆమెను అవహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక రాముడు జీవితాన్ని చాలిస్తాడు" అని, ఇది రావణునికి ఎంతగానో నచ్చింది.
మరునాడుదయమే రథంమీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు. సీత అపహరణ విషయం తెలిపాడు. ఈ పనిలో తనకు సహాయపదమన్నాడు. మారీచుడు మండిపడ్డారు. “ఓ రాక్షసేంద్రా! ఈ ఆలోచన నీకెవడు చెప్పాడు? నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు, శ్రీరాముడు సింహంవంటివాడు. సింహందగ్గరికి వెళ్ళడం ఎంత ప్రమాదం? పైగా ఇతరులకు హాని వేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తల గోక్కోవడమే. శాంతించి, ఈ ఆలోచన విరమించి సుఖించు"మని సదుపదేశం చేశాడు. రావణుని ఆవేశం తిరుగు ముఖం పట్టింది. రావణుడూ తిరుగుముఖం పట్టాడు లంకకు.
ఖరదూషణ త్రిశరులు, పద్నాలుగు వేలమంది రాక్షసవీరులు రామునిధాటికి నిలువలేక యముడి ఇంటికి పోవడాన్ని భరించలేకపోయింది శూర్పణఖ. లంకకు పరుగుదీసింది. మంత్రులతో కొలువుదీరిన రావణుని సభలోకి వెళ్ళింది. వికృతరూపంతో వచ్చిన చెల్లెలి దీనావస్థను చూసికూడా చలించలేదు రావణుడు. శూర్పణఖ ఆవేశం కట్టలు తెంచుకుంది. రావణుడి మూర్ఖత్వాన్ని తిట్టిపోసింది. శ్రీరామునివల్ల లంకకు ముప్పువాటిల్లగలదని హెచ్చరించింది. "సౌందర్యవతి అయిన సీతకు తగిన భర్తవు నీవేనని రావణుడిలో కొత్త ఆశలను రేకెత్తించింది.
ఒకవైపు మారీచుడి మాటలు, మరొకవైపు శూర్పణఖ పలుడులు లంకేశుని మనసును కుదిపేస్తున్నాయి. అయోమయంలో పడ్డాడు. సీతాపహరణంలోని మంచిచెడులను ఆలోచించాడు. శ్రీరాముని బలంతో తన బలాన్ని పోల్చుకున్నాడు. చివరకు సీతను అపహరించడానికే నిశ్చయించుకున్నాడు.
రావణుడు మళ్ళీ మారీచునివద్దకు వెళ్ళాడు. సీతాపహరణకు బంగారులేడిగా మారి సహకరించమన్నాడు. ఆ ఆలోచనను. విరమించుకోమని లంకేశునికి పరిపరివిధాల నచ్చజెప్పజూశాడు మారీచుడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణం రుచి ఏమిటో తాను తెలుసుకున్నానన్నాడు. మారీచుడి మాటలను పెడచెవిన పెట్టాడు రావణుడు, (మూర్ఖులకు హితబోధలు చెవికెక్కవు.)
"నేను చెప్పినట్లు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్ప"దని హెచ్చరించాడు రావణుడు. ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు. వెళ్ళకుంటే రావణుడు చంపుతాడు. 'ముందు నుయ్యి వెనక గొయ్యి'లా ఉంది మారీచుని స్థితి. చివరకొక నిశ్చయానికి వచ్చాడు. రావణునితో "నీ చేతిలో చావడం కన్నా శ్రీరాముని చేతిలో చావడమే నయం. నా జన్మ తరిస్తుందని తేల్చిచెప్పాడు.
మారీచుడు బంగారులేడిగా మారి శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరుగుతున్నాడు. పూలు కోయడానికి వచ్చిన సీతాదేవి ఆ జింకను చూసి ఆశ్చర్యపడింది. రామలక్ష్మణులను పిలిచింది. వారు ఆ మృగాన్ని చూశారు. లక్ష్మణుడు అది మాయామృగమేనని నిస్సంశయంగా పరికాడు. మరియుడే ఈ రూపంలో వచ్చి ఉంటాడన్నాడు. వేటకు వచ్చే రాజును మాయామృగరూపంలో చంపడం మారీచుడికి కొత్తదేమీ కానదన్నాడు. ఇలాంటి లేడీ ప్రపంచంలో ఉండదని అనుమానాన్ని వెలిబుచ్చాడు. సీత మాత్రం పట్టు వదలలేదు. తనకు అదెంతో నచ్చిందని, తీసుకురావాలని కోరింది. తెస్తే ఆశ్రమంలో క్రీడా మృగంగా ఉంటుందని, అయోధ్యచేరాక అంతఃపురానికి అలంకారమౌతుందని అశించింది.
సీత బష్టాన్ని తోసివేయలేక ఆ మాయలేడిని చంపి అయినా సరే తేవడానికి సంసిద్ధుడయ్యాడు శ్రీరాముడు. సీతాదేవి రక్షణ విషయంలో జటాయువు సహాయంతో అప్రమత్తంగా ఉండమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు. మాయలేడిని పట్టుకోవడానికి బయల్దేరాడు.
మృగాన్ని ప్రాణంతో పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నించాడు శ్రీరాముడు. అందినట్టే అంది అందకుండా పరుగుదీస్తున్నదా మృగం ఇక లాభం లేదనుకొని బాణాన్ని సంధించాడు. ప్రయోగించాడు శ్రీరాముడు బాణపు దెబ్బకు తాటి చెట్టంత ఎత్తు ఎగిరి భయంకరంగా అరుస్తూ పడిపోయాడు మారీచుడు నిజ స్వరూపంతో రాముని కంఠధ్వనిని అనుకరిస్తూ "అయ్యో సీతా! అయ్యో. లక్ష్మణా!" అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు విడిచాడు. ఈ మాటలకు సీతాలక్ష్మణులు ఎంత కలవరపడతారోనని భయపడినాడు. శ్రీరాముడు.
మారీచుని కంతధ్వనిని రామునిదిగా భావించి సీత ఆందోళన చెందింది. శ్రీరాముడు ఏదో ఆపదలో చిక్కుకునాడ.. తలచింది. ఆదుకోవడానికి వెంటనే వెళ్ళమని లక్ష్మణుణ్ణి పురమాయించింది. లక్ష్మణుడు చలించలేదు. ఇది శ్రీరాము కాదన్నాడు. మారీచుడి మాయాజాలమన్నాడు. 'అమ్మా! నీ రక్షణ భారం శ్రీరాముడు నాకప్పగించాడు. నిన్ను వదలివెళ్ళలే'నని స్పష్టం చేశాడు. సీత ఆవేశం రెండింతలైంది. మనసులో ఏదో దుష్టాలోచనతో ఇలా ప్ర నిష్ఠురోక్తులాడింది. చేసేదిలేక లక్ష్మణుడు బయలుదేరడానికి సంసిద్ధుడయ్యాడు. "అమ్మా! నీకు భద్రమగుగాక వదిదేవరలు నిన్ను రక్షింతురుగాక, నాకు అపశకునాలు తోస్తున్నాయి. మళ్ళీ నువ్వు మా అన్నతో కలిసి ఉండగా చూసే భాగ్యం లేదో?" అని వాపోయాడు. సీత మౌనంగా ఉన్నది. అక్కడి నుంచి వెళ్ళడానికి ఏమాత్రం మనస్కరించకున్నా సీతక శ్రీరాముడు వెళ్ళిన దిశగా నడిచాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడు వెళ్ళడాన్ని గమనించాడు రావణుడు. అదే అదనుగా సన్న్యాసి వేషంలో సీత సమక్షానికి వచ్చాడు. యతి రూపంలో వచ్చిన రావణుణ్ణి ఆసనంమీద కూర్చుండబెట్టి సముచితంగా అతిథి మర్యాదలు చేసింది సీత మధ్యమధ్యలో రామలక్ష్మణుల కోసం వాకిలివైపు చూస్తున్న సీతకు నిరాశే మిగులుతున్నది. రావణుడు సీతను గురించిన వివరాలు అడిగాడు. తెలిపింది. సన్యాసి వివరాలను కోరింది. తాను రాక్షసరాజు లంకేశ్వరుడనని ప్రకటించాడు. తనను పతిగా స్వీకరించమని అడిగాడు. అలా వేస్తే అంతులేని భోగభాగ్యాలతో విలసిల్లుతావని ఆశ చూపాడు. ఆ మాటలకు సీత మండిపడింది. రావణుణ్ణి తృణీకరించి మాట్లాడింది. శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది. "నన్ను అపహరించి నీ చావును నీవే కొనితెచ్చుకోకు" అని హెచ్చరించింది.
రావణుడి కన్నులు నిప్పులు చెరుగుతున్నాయి. సన్యాసి వేషాన్ని వదిలి పదితలలతో భయంకరమైన నిజస్వరూపంతో సీత ఎదుట నిలిచాడు. బలవంతంగా సీతను తన రథంలో లంకకు తరలిస్తున్నాడు. సీత 'రామా! రామా!' అంటూ అర్తనాదాలను చేస్తున్నది. ఆమె వేదన అరణ్యరోదనయింది.
అప్పుడప్పుడే నిద్రకుపక్రమిస్తున్న జటాయువుకు సీతాదేవి ఆర్తనాదాలు వినబడ్డాయి. చూసే సరికల్లా సీతను అపహరించుకు!. పోతున్న రావణుడు కంటబడ్డాడు. జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు. ఇద్దరి మధ్య పోరు హోరాహోరీగా సాగింది. చివరకు రావణుడు ఖడ్గంతో జటాయువు రెక్కలను, కాళ్ళను నరికివేసాడు. నేలపై కూబాదు జటాయువు. రక్తంతో తడసి ముద్దయిన అతణ్ణి చూసి ఆత్మబంధువును పోగొట్టుకున్నట్లు సీత ఆక్రందించింది.
రావణుడు సీతాదేవిని తీసుకొని ఆకాశమార్గం పట్టాడు. దీనురాలైన సీత హీనుడైన రావణుణ్ణి పరి పరి విధాల దూషించింది. ఇంతలో ఒక పర్వత శిఖరంమీద ఐదుగురు వానరముఖ్యులను సీత చూసింది. ఉత్తరియపు కొంగులో తన ఆభరణాలను కొన్నింటిని మూటగట్టి వారి మధ్య పడేటట్లు వదలింది. ఒకవేళ అటువైపుగా శ్రీరాముడువస్తే తనను గురించి వానరులు అతనికి తెలియజేస్తారనే చిన్న ఆశ.
రావణుడు సీతతో లంకకు చేరాడు. తన అంతఃపురంలో సీతనుంచాడు. తన వైభవమంతా చూపించాడు. దాన్ని తృణప్రాయంగా భావించింది. సీత, కనికరించమని కాళ్ళపైబడ్డాడు. నిరాకరించిందా మహాసాధ్వి, భరించలేకపోయాడు దశకంఠుడు, ఆవేశంతో, "మైథిలీ! నీకు పన్నెండు నెలల గడువిస్తున్నాను. ఈలోపున నువ్వు దారికి రాకపోతే మరునాడే ప్రాతఃకాల భోజనానికి వంటవాళ్ళు చిన్ను సిద్ధంచేస్తారని బెదిరించాడు. అక్కడి రాక్షసులతో, "ఈమెను అశోకవనానికి తీసుకుపొండి. $30 మధ్య ఒక రహత్య ప్రదేశంలో ఉంచి చుట్టూ కాపలాగా ఉండండి. ఎలాగో ఒకలాగ ఈమెను ఒప్పించండి" అని ఆజ్ఞాపించి రుసరుసలాడుతూ వెళ్ళాడు. ఆడపులుల మధ్య జింకలాగ రాక్షస స్త్రీల మధ్య సీత బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతున్నది.
మారీచుణ్ణి వధించి శ్రీరాముడు వెనుదిరిగాడు. లక్ష్మణుడు ఎదురయ్యేసరికి నిశ్చేష్టుడయ్యాడు. సీతను ఒంటం వదలి ఎందుకు వచ్చానని నిలదీశాడు. జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు చెప్పాడు లక్ష్మణుడు. ఇద్దరూ ఆశ్రమానికి చేరుకున్నారు. సీతాదేవి జాడ కనిపించలేదు. వనమంతా వెతికారు. ఆమె జాడ కనిపించలేదు. జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్ధించాడు శ్రీరాముడు. ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఆవేదన ఆవేశంగా మారింది. లోకాలను ధ్వంసం చేయడానికి శ్రీరాముడు సిద్ధపడ్డాడు. లక్ష్మణుడు ఓదార్పు వాక్యాలతో అన్నను శాంతపరిచాడు.
అరణ్యంలో సీతను వెదుకుతూ వెళుతున్న రామలక్ష్మణులకు జటాయువు కనిపించాడు. రక్తంతో తడిసిన అతనిని గుర్తించలేదు. శ్రీరాముడు, మీదు మిక్కిలి అతడు గద్దరూపంలో ఉన్న రాక్షసుడని సీతనతడే భక్షించి ఉంటాడనీ భ్రమపడ్డాడు. బాణంతో చంపడానికి పూనుకున్నాడు. ఇంతలో జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని, ఎదిరించిన తనకీగతి పట్టించాడని వివరించాడు. అపహరణకు గురైన సీత, అవసానదశలో ఉన్న ఆత్మీయుడు - రాముని దుఃఖం రెండింతలైంది. తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువు వల్ల పితృభక్తిని ప్రదర్శిస్తూ అతని శరీరాన్ని నిమిరాడు. జటాయువు కన్నుమూశాడు. శ్రీరాముడు జటాయువుకు దహన సంస్కారాలు చేశాడు. అతనికి ఉత్తమగతులు కలగాలని గోదావరిలో జలతర్పణాలు చేశాడు.
రామలక్ష్మణులు దండకారణ్యంనుంచి క్రౌంచారణ్యానికి చేరుకున్నారు. అక్కడి వనంలో భయంకరుడైన ఒక రాక్షసుణ్ణి చూశారు. అతని తల, మెడ కనబడడంలేదు కడుపు భాగంలో ముఖముంది. రొమ్ముమీద ఒకే కన్ను ఉంది. యోజనం పొడవు వ్యాపించిన చేతులు, ఆ చేతులలో పక్షులను, మృగాలను పట్టితింటారు. అతనిపేరు 'కబంధుడు', తన సమీపంలోకి వచ్చిన రామలక్ష్మణులను అమాంతంగా రెండు చేతులతో పట్టుకున్నాడు. అతని చేతుల్లో చిక్కితే తప్పించుకోవడం ఎవరితరంకాదు. (అందుకే 'కబంధ హస్తాలు' అన్న జాతీయం పుట్టుకువచ్చింది.) కబంధుడు రామలక్ష్మణులను భక్షించడానికి నోరుతెరచాడు. అన్నదమ్ములిద్దరూ తమ ఖడ్గాలతో జనాయాసంగా వాడి భుజాలను నరికివేశారు. కబంధుడు కుప్పకూలాదు, రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నాడు. తన గురించి చెప్పుకున్నాడు. శాపకారణంగా తనకీ వికృతరూపం ప్రాప్తించిందన్నాడు. శ్రీరాముడు కబంధునితో 'మాకు రావణుని పేరు మాత్రమే తెలిసింది. అతని రూపం, ఉండేచోటు, శక్తిసామర్ధ్యాలు తెలియవు. వాటిని చెప్పవలసింద'ని అడిగారు. సమాధానంగా కబంధుడు "శ్రీరామా! నాడిప్పుడు దివ్యజ్ఞానంలేదు. నా శరీరాన్ని దహిస్తే నా నిజరూపం వస్తుంది. అప్పుడు చెప్పగల"నన్నాడు. కబంధుడి శరీరానికి అగ్నిసంస్కారంచేశారు రామలక్ష్మణులు ఆ జ్వాలల నుంచి దివ్యదేహంతో బయటికి వచ్చారు కబంధుడు. సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి చెప్పాడు. ఇందుకు సుగ్రీవుడి మైత్రి బాగా తోడ్పడుతుందన్నాడు. వాలిసుగ్రీవుల కథను వివరించాడు. సుగ్రీవుణ్ణి చేరే దారిని చెప్పాడు. శ్రీరాముని అనుమతిని తీసుకొని కబంధుడు స్వర్గానికి వెళ్లాడు.
కబంధుడు సూచించిన మార్గంలో ప్రయాణిస్తూ పంపాసరస్సున్న ప్రాంతానికి చేరారు రామలక్ష్మణులు. ఆ తీరంలో ఉన్న శబరి ఆశ్రమానికి వెళ్ళారు. శబరి తపస్సిద్ధురాలు, జ్ఞానపయోవృద్ధురాలు, శ్రీరామదర్శనంతో ఆమె తనువు పులకించింది. సంపాతీరంలో దొరికే పండ్లను స్వామికి సమర్పించింది. తన జన్మ ధన్యమైనట్లు భావించింది. శ్రీరాముని అనుమతినిపొంది తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసి అగ్నికాంతితో ఊర్ధ్వలోకాలకు వెళ్ళింది.
అర్హుడినుంచి ఋష్యమూక పర్వతానికి ప్రయాణమయ్యారు రామలక్ష్మణులు. దారిలో పంపాసరోవరాన్ని దర్శించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి