రామాయణం యుద్ధ కాండం
యుద్ధ కాండం
శ్రీరాముడు హనుమంతుడి సాహసాన్ని ప్రశంసించాడు. గరుత్మంతుడికి, వాయుదేవుడికి, హనుమంతుడికి తప్ప ఈ మహాసముద్రాన్ని లంఘించడానికి ఇతరులకు సాధ్యం కాదన్నాడు. ఇచ్చిన పనిని సాధించడమేగాక, దానికి భంగం కల్లకుండా దానికనుబంధమైన ఇతర కార్యాలను సాధించేవాడు ఉత్తముడైన సేవకుడు. కేవలం ఇచ్చిన పనినే నెరవేర్చేవాడు మధ్యముడు. తనకు సామర్థ్యం ఉన్నా ఇచ్చిన పనిని పూర్తిచేయనివారు అధముడు సీతాదేవి కుతల వార్త చెప్పి మహానజ్ఞారం చేసిన హనుమంతునకు ఏమియ్యగలనంటూ దగ్గరకు తీసుకొని గట్టిగా గుండెకు హత్తుకున్నాడు శ్రీరాముడు. ఇదే తానియ్యగల సర్వస్వమన్నాడు. (ఆదరాభిమానాలకు మించిన ఆస్తి ఉండదు కదా!)
శ్రీరాముని మనసులో మళ్ళీ దుఃఖం పొంగిపొర్లింది. సుగ్రీవుడు ఊరడించారు. నిరుత్సాహం ప్రయోజనాలను నాశనం చేస్తుందన్నారు. దుఃఖం శౌర్య పరాక్రమాలను దిగజారుస్తుందన్నాడు. శత్రువు విషయంలో ఇప్పుడు దుఃఖం కాదు, క్రోధం చూపవలసిన సమయమని సూచించాడు. మహాసముద్రంమీద సేతువును కట్టకుండా లంకను జయించడం ఇంద్రాది దేవతలకు కూడా సాధ్యం కానివని అన్నాడు. శ్రీరాముడు అడిగినమీదట హనుమంతుడు లంకానగరంలోని రక్షణ వ్యవస్థను గురించి వివరంగా చెప్పాడు.
మధ్యాహ్నమైంది. ఈ విజయ ముహూర్తమే లంకా ప్రయాణానికి తగినదని శ్రీరాముడు సుగ్రీవునితో అన్నాడు. శ్రీరాముడు వానరులతో, "నీలుడు సైన్యానికి మార్గం చూపుతూ ముందునడవాలి. లక్షలాది వానరులు అతణ్ణి అనుసరించాలి. బాలురు వృద్ధులు, బలహీనులు కిష్కింధలోనే ఉండాలి. సుగ్రీవా! నేను హనుమంతుడి భుజంమీదా, లక్ష్మణుడు అంగదుడి భుజంమీదా కూర్చొని ముందుకు సాగుతాం. నువ్వు పల్లకినెక్కి నూతోపాటు రావాలి. జాంబవంతుడు, సుషేణుడు, వేగదర్శి సైన్యం వెనుకభాగంలో ఉండి రక్షణ బాధ్యతను చూడాలి. వెళ్ళేమార్గంలో నగరాలు, గ్రామాలు ఉంటే వాటిలోకి వెళ్ళగూడదు. జల, ఫల సహితమైన మార్గం వెంట మనం ప్రయాణించాలి" అని రాముడు సూచించాడు. ఉత్సాహం ఉరకలు వేస్తుంటే అందరూ సముద్రతీదాన్ని చేరుకున్నారు.
లంకలో రావణుడు మంత్రులతో సమావేశమయ్యాడు, వానరులను ఎదుర్కొని లంకను కాపాడుకోవడానికి ఏం చేయాలో నిర్ణయించమన్నారు. సభలోని వారు రావణ, ఇంద్రజిత్తుల పరాక్రమాన్ని పొగిడారు. నరవానరులను లెక్కచేయాల్సిన అవసరం లేదని పెదవి విరిచారు. "రాముణ్ణి హతమార్చగలవని లంకేశునికి ఆత్మస్థైర్యాన్ని కలిగించారు. ప్రహస్తుడు మొదలైనవారు శత్రు సేనలను తామే తుదముట్టించగలమని దంబాలు పలికారు.
ఇవన్నీ విన్నాడు రావణుని సోదరుడు విభీషణుడు. రాక్షసులతో "శత్రువుల శక్తిసామర్థ్యాలను తెలుసుకోకుండా వారిని చులకనగా భావించకూడదు. శ్రీరాముడు మనకేం అపకారం చేశాడు? మన రాజే సీతను అపహరించుకు వచ్చాడు. దీనివల్ల పాపం వస్తుంది. కీర్తిప్రతిష్ఠలు మంటగలుస్తాయి. ఆయుప్పు తగ్గుతుంది. సంపదలన్నీ నశిస్తాయి. కనుక సీతను శ్రీరామునికి యుద్ధం తగదు" అంటూ రావణునివైపు తిరిగాడు. "అన్నా! అనవసరంగా కోపించడం మంచిదికాదు. అది ధర్మానికి ఆటంకమౌతుంది. సుఖాలను దూరంచేస్తుందని హితవు పలికాడు. విభీషణుని ఈ హితబోధ 'చెవిటివాని ముందు శంఖమూది'నట్లయింది. రావణుని భవనానికి వచ్చిన కుంభకర్ణుడు కూడా రావణుణ్ణి తప్పుపట్టాడు. సీతాపహరణ సమయంలో తనను సంప్రదించి ఉంటే బాగుండేదన్నాడు. ఇప్పుదు ఆలోచించి ప్రయోజనం లేదన్నాడు. ఇదంతా 'గతజల సేతుబంధనమే (నీళ్ళుపోయిన తరువాత అడ్డుకట్టవేయడం)నని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పాడు. "నువ్వు శత్రువు పట్ల వ్యవహరించిన తీరు సరైనది కాదు. శ్రీరాముడు నిన్ను ఇంకా చంపకుండా ఉండడం నీ అదృష్టం" అన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా శ్రీరాముణ్ణి
తుదముట్టించే భారం తనదేనని ప్రకటించుకున్నాడు కుంభకర్ణుడు. రావణుడు విభీషణుని మాటలకు క్రోధావేశాలకు లోనయ్యాడు. తీవ్రస్థాయిలో నిందించాడు. అన్న తండ్రితో సమానుడుని అతని నిందలను సహించాడు విభీషణుడు. కాని రావణుని అధర్మమార్గాన్ని మాత్రం సమర్ధించలేదు. ధర్మం వీడిన రావణుని వీడడానికే విభీషణుడు నిర్ణయించుకున్నాడు. రెండు గడియల్లో రామలక్ష్మణులున్నచోటికి నలుగురు అనుచరులతో చేరాడు.
ఆకాశంలోనే నిలిచి శ్రీరాముణ్ణి శరణుకోరాడు విభీషణుడు. అనుగ్రహించాడు దాశరథి, విభీషణుడు శ్రీరాముని పాదాలపై వాలాడు. రావణుని విషయాలన్నీ సంక్షిప్తంగా చెప్పాడు. శ్రీరాముడు విభీషణునితో 'నేను రావణుని బంధుమిత్ర సమేతంగా హతమార్చి నిన్ను రాజును చేస్తానని తమ్ములమీద ఒట్టేసి చెప్పాడు. ఈ పనిలో తాను యథాశక్తి సహాయపడగలనని విభీషణుడు మాట ఇచ్చాడు. రాముడు విభీషణుణ్ణి అలింగనం చేసుకున్నాడు. లక్ష్మణుడితో వెంటనే సముద్రజలం తెచ్చి లంకారాజుగా విభీషణుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయమన్నాడు. శ్రీరాముని ఆజ్ఞ వెంటనే ఆచరణ రూపం దాల్చింది. అందరూ ఆనందాన్ని ప్రకటించారు.
సముద్రాన్ని దాటే ఉపాయమేమిటని సుగ్రీవుణ్ణి ప్రశ్నించాడు శ్రీరాముడు. సముద్రుణ్ణి ప్రార్ధించడంవల్ల ఇది సాధ్యపడుతుందన్నాడు విభీషణుడు, శ్రీరాముడు సముద్రతీరంలో దర్భాసనంమీద కూర్చుని సముద్రుణ్ణి ఉపాసించాడు. మూడు రాత్రులు గడిచాయి. సముద్రుడు ఎదుట నిలువలేదు. శ్రీరాముని కన్నులు ఎర్రబారాయి. సముద్రుడి అహంకారాన్ని అణగదొక్కాలనుకున్నాడు. నీటినంతా ఇంకిపోయేటట్టు చేయాలనుకున్నాడు. బ్రహ్మాస్త్రాన్ని స్మరించాడు. ప్రకృతంతా అల్లకల్లోలమౌతున్నది. సముద్రుడు భయపడి పారిపోతున్నాడు. పరుగెత్తే వానిపై బాణం ప్రయోగించరాదని ఆగాడు శ్రీరాముడు, సమురుడు దారికి వచ్చాడు. లంకకు వెళ్ళడానికి దారినిస్తానన్నాడు. బాణం వృథాకారాదు. ఎక్కడ ప్రయోగించాలో చెప శ్రీరాముడు. పాపాత్ములు, దోపిడిదారులు ఉండే 'ద్రుమకుల్యం'పైన ప్రయోగించమన్నాడు సముద్రుడు, అది జరిగిపోయింది.
విశ్వకర్మ కుమారుడైన 'నలుడు' శిల్పకళానిపుణుడు. శక్తి ఉన్నవాడు. సేతువు (వంతెన) ను నిర్మించడానికి అతడే యోగ్యుడని సముద్రుడు తెలిపాడు. ఆ సేతువును తాను భరిస్తానని మాట ఇచ్చాడు. సేతువు నిర్మాణానికి వానర నాయకులకు ఆజ్ఞ ఇచ్చాడు శ్రీరాముడు. కు అందరూ మహారణ్యం దారి పట్టారు. పెద్దపెద్ద చెట్లను ఒండ రాళ్ళను మోసుకువస్తున్నారు. సముద్రంలో పడేస్తున్నారు. వాటి దెబ్బకు సముద్రంలోని వీరు ఆకాశానికి ఎగిసిపడుతున్నది. నలుని సూచనలననుసరించి కొలతల ప్రకారం సేతువు నిర్మాణం జరుగుతుంది. వందయోజనాల పొడవు పది యోజనాల వెడల్పుగల సేతువును కట్టడం ఐదు రోజుల్లో పూర్తయింది.
శ్రీరామలక్ష్మణులు సుగ్రీవునితో కలిసి ముందు నడుస్తున్నారు. సైన్యం వారిని అనుసరిస్తున్నది. సైన్యంలో కొందరు వెనక నడుస్తున్నారు. కొందరు సేతువు మధ్యభాగంలో, మరి కొందరు రెండు పక్కలా నడుస్తున్నారు. కొందరు సముద్రంలో రూక్ ఈదుతూ వస్తూంటే మరికొందరు ఆకాశంలో ఎగిరి వస్తున్నారు. వారు చేసి కోలాహలానికి సముద్రమే మౌనం దాల్చింది. అందరూ అవతలి తీరం చేరారు.
శ్రీరాముడు యుద్ధనీతిని అనుసరించి సైన్యాన్ని వివిధ విభాగాలుగా విభజించాడు. ఎవరి బాధ్యతలను దాళ్ళకు అప్పగించాడు. బావణుడి మంత్రులైన శుకసారణులు శ్రీరాముని బలం తెలుసుకోవాలని వానర రూపాలుదాల్చి వానరులలో చేరారు. విభీషణుడు. వాళ్ళను గుర్తించి శ్రీరాముని ఎదుట నిలిపాడు. క్షమించాడు శ్రీరాముడు తమను గురించి ఇంకా విమన్నా తెలుసుకోవాలంటే. అడ్డులేదని వాళ్ళకు చెప్పాడు. సీతను వెంటనే అప్పగించకపోతే తన వేతిలో చావు తప్పదని రావణుడికి చెప్పవలసిందిగా సూచిస్తూ శుకసారణులను పంపించివేశాను. వారు వెళ్ళి ఇక్కడి విషయాలన్నీ పొల్లుబోకుండా రావణునికి తెలిపారు.
రావణుడు సీత విషయంలో మరొక ఎత్తుగడ వేశాడు. అశోకవనం వెళ్ళి రాముడు తనచేతిలో హతుడైనాడని సీతతో ఫలిచాడు. ఆమె నమ్మలేదు. మాయావియైన విద్యుజ్జిహ్వుణ్ణి పిలిచాడు. అతడు శ్రీరామునిచే అనిపించే మాయాకిరస్సును, ధనుర్బాణాలను తీసుకొనివచ్చి చూపించాడు సీతకు ఇప్పటికైనా తన్నాశ్రయించమని సీతను కోరాడు రావణుడు. సీత కుమిలిపోయింది. రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు. విభీషణుని భార్య 'సరమే' సీతను ఊరడించింది. ఇదంతా రాక్షన మాయ అని చెప్పింది. శ్రీరాముడు క్షేమమేనని తెలిపింది.
శ్రీరామచంద్రాదులు వానరసైన్యంతో సువేల పర్వతానికి చేరుకున్నారు. ఆరాత్రి అక్కడే గడిపారు. ఎత్తైన పర్వత శిఖరం నుండి లంకానగర శోభను చూశారు. లంకలో మేడపైభాగంలో ఠీవిగా కూర్చున్న రావణుణ్ణి శ్రీరాముడు చూశాడు. వానర ప్రముఖులూ చూశారు. సుగ్రీవుడు ఒక్క ఉదుటునలేచి కోపంతో ఊగిపోతున్నాడు. క్షణాలలో సువేల పర్వతంనుంచి రావణ భవనంపైన వాలాడు. తాను శ్రీరాముని మిత్రుడనని, తన దగ్గర తప్పించుకోవడం లంకేశుని తరంకాదని హెచ్చరించాడు. రావణుడి పైకి దూకి అతని కిరీటాన్ని తీసి నేలకు కొట్టాడు. రావణుడు రెచ్చిపోయాడు. "సుగ్రీవా! ఇంత వరకు నీవు నా కంటబడలేదు. లేకుంటే ఎప్పుడో హీనగ్రీవుడవు (తల తెగినవాడవు) అయ్యేవాడివి" అంటూ గర్జించాడు. ఇద్దరి మధ్యా బాహాబాహి యుద్ధం జరిగింది. సుగ్రీవుడు రావణుణ్ణి ముప్పతిప్పలు పెట్టి క్షణాలలో రివ్వున ఎగిరి సువేల పర్వతంమీద వాలాడు. శ్రీరాముడు సుగ్రీవుణ్ణి సున్నితంగా మందలించాడు. తొందరపడి ఇలాంటి సాహసాలు చేయవద్దని సలహా ఇచ్చాడు.
రావణుడి దగ్గరికి అంగదుణ్ణి రాయబారిగా పంపాడు శ్రీరాముడు, సీతను అప్పగించకపోతే శ్రీరాముని చేతిలో మరణం తథ్యమని, లంకకు విభీషణుడు రాజుకాగలడని శ్రీరాముని వాక్యంగా రావణునికి వినిపించాడు అంగదుడు. సభ అట్టుడికిపోయింది. నలుగురు రాక్షసులు అంగదుడిమీద విరుచుకుపడ్డారు. అంగదుడు వారిని తన చంకలో ఇరికించుకొని ప్రాసాదంపైకి ఎగిరాడు. అక్కడి నుండి వారిని బలంగా నేలపైకి విసిరాదు. సింహనాదం చేసి ఆకాశమార్గంలో శ్రీరాముణ్ణి చేరాడు. రావణుని భావాన్ని గ్రహించాడు శ్రీరాముడు. ధనుస్సుకు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావించాడు.
లంకమీదికి దండయాత్ర మొదలైంది. లంకను నాలుగువైపుల నుండీ సైన్యంతో ముట్టడించాడు శ్రీరాముడు. లంకేశుడు తన భవనం మీది నుంచే పరిస్థితిని గమనించాడు. దీర్ఘాలోచనలో పడ్డాడు. యుద్ధం మొదలైంది. రెండు సైన్యాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. ఆంజనేయుడి చేతిలో జంబుమాలి, సుషేణుని చేతిలో విద్యున్మాలి మరణించారు. చీకటిలో ఎవరు ఎవరో (రాక్షసుదా? వానరుడా?) అడిగి తెలుసుకుని మరీ కొట్టుకుంటున్నారు.
అంగదుని చేతిలో రావణకుమారుడు ఇంద్రజిత్తు ఓడిపోయాడు. దీనికి తట్టుకోలేకపోయాడు. కపట యుద్ధానికి దిగాడు. రామలక్ష్మణులను మూర్ఛపోయేట్టుచేసి నాగాస్త్రంతో బంధించాడు. వారు మరణించారని భ్రాంతిపడి రావణుడి దగ్గరికి వెళ్ళి విషయాన్ని తెలిపాడు. రావణుడు అభినందించాడు. రావణుడి ఆదేశం మేరకు త్రిజట మొదలైనవారు సీతను పుష్పక విమానంపై యుద్ధ భూమికి తీసుకువెళ్ళారు. నేలమీద పడిఉన్న రామలక్ష్మణులను సీత చూసింది. మరణించారని భావించి కన్నీరు కాల్వలు గట్టేలా ఏడ్చింది. పక్కనే ఉన్న త్రిజట ఓదార్పుతో కూడిన ధైర్యాన్నిచ్చింది. రామలక్ష్మణులు బతికే ఉన్నారని ఆధారాలు చూపించింది. వానరసైన్యం ప్రసన్నంగా ఉండడం ఒక కారణమని, అన్నింటికీ మించి "భర్త మరణించిన స్త్రీని పుష్పక విమానం తీసుకొనిరాదు" అని చెప్పడంతో సీత మనసు కుదుటపడింది. గరుత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగాస్త్ర ప్రభావం నుంచి విముక్తులైనారు. వానరులు 'జయజయ ధ్వానాలు చేశారు. అవి రావణుని గుండెలో 'అప' శబ్దాన్ని జోడించుకొని ప్రతిధ్వనిస్తున్నాయి. హనుమంతుని చేతిలో ధూమ్రాక్షుడు, అకంపనుడు, అంగదుడి బారినపడి వజ్రదంష్ట్రుడు, నీలుడికి చిక్కి ప్రహస్తుడు యమపురిబాట పట్టాడు..
రావణుని బాణశక్తికి సుగ్రీవుడు మూర్ఛపోయాడు. శ్రీరాముడు విల్లందుకున్నాడు. అన్నను వారించి లక్ష్మణుడు రావణు ఎదిరించడానికి పూనుకున్నాడు. వానరసేనమీద శరవర్షధారకురిపిస్తున్నాడు రావణుడు, ఆంజనేయుడు రావణుడి ధాటికి అదుులును వేశాడు. అరచేతితో హనుమంతుని బలంగా చరచాడు రావణుడు. మారుతి చలించిపోయాడు. అయినా క్షణంలో తేరుకున్నారు. అరచేతితో రావణుణ్ణి ఒక్క దెబ్బ వేశాడు. దశగ్రీవుడు కంపించిపోయాడు. తేరుకుని "వానరా! భళా, నాకు శత్రువువే అయినా నీ శక్తిని మెచ్చుకుంటున్నా”నని యుద్ధ స్ఫూర్తిని చాటాడు రావణుడు.
రావణుడు ప్రయోగించిన 'శక్తి' అనే ఆయుధం లక్ష్మణుని ఎదలో నాటుకుంది. స్పృహదప్పాడు లక్ష్మణుడు. అతన్ని ఎత్తుకొని వెళ్ళాలని శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు రావణుడు. అంతలో ఆంజనేయుడు రావణుడిమీద దాడిచేశాడు. వక్షఃస్థలంమీద ముష్టిఘాతంతో రావణుణ్ణి కూలబడేటట్లు చేశాడు. లక్ష్మణుణ్ణి శ్రీరాముని వద్దకు చేర్చాడు. హనుమంతుని కోరిక మేరకు అతని భుజాలపై కూర్చుని రావణునితో పోరుచేశాడు శ్రీరాముడు. శ్రీరాముని పరాక్రమం ముందు రావణుని ధనుస్సు, కిరీటం దాసోహమన్నాయి. శ్రీరాముడు దయతలచాడు. రావణునితో "నీవు యుద్ధంలో అలసిపోయావు. సేదతీర్చుకొనిరా. అప్పుడు నా బలమేమిటో తెలుస్తుం"దని సుతిమెత్తగా చెప్పాడు.
అంతఃపురానికి తిరిగివెళ్ళినా అవమానభారం రావణుణ్ణి ఒక చోట కూర్చోనీయడం లేదు. కుంభకర్ణుని నిద్రలేపమన్నాడు రావణుడు. అతికష్టంమీద ఆ పని సాధ్యమయింది రాక్షసులకు. కుంభకర్ణునికి ఆరు నెలలు నిద్ర ఒకరోజు భోజనం. (అందుకే 'కుంభకర్ణనిద్ర' అనేది ఒక జాతీయంగా భాషలోకి వచ్చింది.) కుంభకర్ణుడు రావణుణ్ణి సమీపించాడు. జరిగిందంతా చెప్పాడు రావణుడు. తెలివిగలవారు జరిగిన దానిని గూర్చి ఆలోచించరన్నాడు కుంభకర్ణుడు. తనకు సహాయపడమని కుంభకర్ణుని కోరాడు రావణుడు. "ఆపదల పాలైన వానిని ఆదుకొనేవాడే నిజమైన మిత్రుడు. తప్పుదారి పట్టి కష్టాల్లో పడ్డవారికి చేయూతనిచ్చి ఆదుకొనేవాడే ఆప్తు"డని రావణుడన్నాడు. కుంభకర్ణుడు యుద్ధసన్నద్ధుడయ్యాడు.
కుంభకర్ణుడు యుద్ధంలో వానరులను చావుదెబ్బ తీస్తున్నాడు. వానరులు తట్టుకోలేక తలోదారి పట్టారు. శ్రీరాముణ్ణి ఆశ్రయించారు. 'ఐంద్రాస్త్రం'తో కుంభకర్ణుని శిరస్సును ఖండించి శాశ్వత నిద్రలోకి పంపాడు శ్రీరాముడు, శ్రీరాముని బాణధాటికి కుంభకర్ణుని తల లంకలో పడిపోయింది. ఆ తల తగలడం వల్ల రాజవీథులలోని ఇంటికప్పులు, ఎత్తైన ప్రాకారాలు కూలిపోయాయి. కుంభకర్ణుని మరణవార్త రావణుణ్ణి క్రుంగదీసింది.
రావణ కుమారుడైన అతికాయుడు లక్ష్మణుని బ్రహ్మాస్త్రానికి బలైనాడు. తమ్ముణ్ణి, కొడుకును పోగొట్టుకొని తల్లడిల్లుతున్న రావణుణ్ణి ఇంద్రజిత్తు ఓదార్చాడు. భారం తనపై వేసుకొని, యుద్ధరంగానికి వచ్చాడు. రామలక్ష్మణులమీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. రాముని సూచనమేరకు రామునితోపాటు లక్ష్మణుడు స్పృహకోల్పోయినట్లు పడి ఉన్నాడు. వాళ్ళు మరణించారనుకున్నాడు ఇంద్రజిత్తు. తండ్రికీ వార్తను తెలిపాడు.
వానరసైన్య శిబిరంలో అలజడి మొదలైంది. విభీషణుడు ధైర్యం చెప్పాడు. రామలక్ష్మణులకు ఏమీకాలేదన్నాడు. బ్రహ్మమీది గౌరవంతో అస్త్రబాధను అనుభవించారని తెలిపాడు. బ్రహ్మాస్త్ర ప్రభావంతో అరవైఏడు కోట్ల మంది హతులయ్యారు. చాలామంది. దెబ్బతిన్నారు. హనుమంతుడు, విభీషణుడు, జాంబవంతుడి కోసం వెతుకుతున్నారు. జాంబవంతుడు కనిపించాడు. సరిగ్గా చూడలేకపోతున్నానన్నాడు. ధ్వనిని బట్టి విభీషణుని గుర్తించానన్నాడు. "హనుమంతుడు క్షేమమేనా" అని అడిగాడు. అంతర్యం అంతుచిక్కలేదు విభీషణునికి, "హనుమంతుడు జీవిస్తే వానరసైన్యం చచ్చినా బతికినట్లే లేదా హనుమ మరణిస్తే అందరం బతికిఉన్నా చచ్చినవాళ్ళతో సమానమే” నన్నాడు జాంబవంతుడు. జాంబవంతుని ఆదేశంపై హిమాలయాలకు వెళ్ళి E సర్వౌషధి మహాపర్వతాన్ని పెల్లగించి తీసుకువచ్చాడు హనుమంతుడు. ఓషధుల వాసనకే రామలక్ష్మణుల గాయాలన్నీ మటుమాయమయ్యాయి. చనిపోయిన వానరులు మళ్ళీ లేచికూర్చున్నారు. సుగ్రీవాజ్ఞతో వానరులు లంకకు నిప్పుపెట్టారు.
శత్రుపక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలచాడు ఇంద్రజిత్తు, హనుమదాది వానరవీరులు చూస్తుండగా మాయాసీతను సంహరించాడు. అందరూ నిజమేననుకున్నారు. ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు. ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
శత్రుసంహారానికి ఇంద్రజిత్తు నికుంభిలా అభిచారహోమాన్ని తలపెట్టాడు. దాన్ని భంగంచేయడానికి రామానుజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు. ఇంద్రజిత్తు లక్షణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది. 'ఐంద్రాస్త్రము'ను ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నేలరాల్చాడు. లక్ష్మణుడు. శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు.
రావణుడు యుద్ధభూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు. వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెపుతున్నారు. మరొకవైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు, మహోదరుడు మట్టిగరచారు.
యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది. రామలక్ష్మణులతో రావణునిపోరు తీవ్రతరమవుతున్నది. రావణుడు విభీషణుణ్ణి చంపడానికి బల్లెమెత్తాడు. అది మహాశక్తిమంతమైనది. విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరించాడు. ఎటూ తోచక విభీషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి 'శక్తి' అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. అది గమనించిన శ్రీరాముడు 'శక్తి'ని వేడుకున్నాడు. 'నీలోని చంపేశక్తి నశించుగాక' అని. అంతే- అది ప్రాణశక్తిని కోల్పోయింది. లక్ష్మణుడి రొమ్ముమీద బలంగా నాటుకుంది. లక్ష్మణుడు నేలమీద పడిపోయాడు. వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుడి రొమ్ము నుంచి తీయలేకపోయారు. రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచివేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు. ఈ లోకంలో ఇక రావణుడో? రాముడో? మిగిలి ఉండడం తథ్యం' అన్నాడు. శ్రీరాముని విలువిద్యాపాండిత్యానికి ఎదురునిలువలేక రావణుడు భయంతో పరుగులు తీశాడు.
పడిపోయిన లక్ష్మణుణ్ణి చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు. "ఏదేశంలోనైనా భార్య దొరకవచ్చు. బంధువులు దొరకవచ్చు. కాని లక్ష్మణుని వంటి తమ్ముడు దొరక"డని కన్నీరుకార్చాడు. సుషేణుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధరించాడు.
సుషేణుని సూచనమేరకు హనుమంతుడు ఓషధులు తేవడానికి వేగంగా వెళ్ళాడు. ఓషధీపర్వతాన్నే తెచ్చాడు. ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచికూర్చున్నాడు. పట్టరాని ఆనందంతో శ్రీరాముడు "లక్ష్మణా నీవు మరణించి ఉంటే నా విజయానికి అర్థమే లేదు. అప్పుడు సీతతోగాని నా ప్రాణాలతోకాని ఏం ప్రయోజనం" అన్నాడు.
ఇంద్రుడు పంపగా మాతలి దివ్యరథంతో సహా శ్రీరాముని దగ్గరికి వచ్చాడు. ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించి శ్రీరాముడు రథాన్ని అధిరోహించాడు. యుద్ధభూమికి సాగిందారథం. మిగతా దినాల కన్నా భిన్నంగా ఉందీనాటి యుద్ధం. కొంతసేపు ఎవరికెవరూ తీసిపోని విధంగా విజృంభించారు. రానురాను రామునిదే పైచేయి అవుతున్నది. రావణుని సారథి గమనించాడు. రథాన్ని పక్కకు మళ్ళించాడు. అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు. రథం మళ్ళీ రాముని ముందు నిలిచింది. యుద్ధం చూడడానికి అగస్త్యుడు దేవతలతో కూడి అక్కడకు వచ్చాడు. శ్రీరామునికి 'ఆదిత్య హృదయం' ఉపదేశించాడు. శ్రీరాముని బాణాలతాకిడికి రావణుని తలలు నేలరాలుతున్నాయి. కాని వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి.
ఆకాశానికి ఆకాశం, సముద్రునికి నముద్రమే సమానమైనట్లు రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమానమన్నట్లు సాగుతున్నది. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా 'మాతలి' శ్రీరామునికి సూచించాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో రావణాసురుణ్ణి అంతమొందించాడు.
అన్నఐన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు. దహన సంస్కారాలకు అనుమతినివ్వమని శ్రీరాముని ప్రార్థించాడు. 'వ్యక్తులు జీవించి ఉన్నంతవరకే వైరముండాలి. తరవాత దానిని వదలివేయాలి. మన కార్యం నెరవేరింది. కావలసిన సంస్కారాలను చేయ'మని అన్నాడు శ్రీరాముడు. "ఇప్పుడు రావణుడు నీకెట్లాగో నాకూ అట్లాగే గౌరవాస్పదుడు" అని తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. శ్రీరాముడు. రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది. విభీషణుడు రావణునికి ఉత్తరక్రియలను నిర్వర్తించాడు.
శ్రీరాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణుణ్ణి లంకారాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. సీతతో తన విజయవార్తను తెలపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు. హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మ చెవిన వేశాడు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇంతకాలం చుట్టూచేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ. తగని పని, వద్దని వారించింది సీత.
విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరికి చేర్చాడు. సంతోషంతో భర్తను చేరింది సీత. ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు. "నా వంశప్రతిష్ఠ నిలుపుకోవడానికి దుష్ట రావణుని చెరనుండి నిన్ను విడిపించాను. ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహముంది. కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చు”నని శ్రీరాముడు అన్నాడు. శ్రీరాముని మాటలు ములుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు, స్థాయికి దగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది. శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి 'అగ్ని ప్రవేశం' ఒక్కటే శరణ్యమని భావించింది. శ్రీరాముని మనసెరిగి లక్ష్మణుడు చితిని సిద్ధపరచాడు. సీత అగ్నిలోకి ప్రవేశించింది. అక్కడివారంతా ఆందోళనచెందారు. అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకువచ్చి ఆమె గొప్పదనాన్ని వెల్లడించాడు. ఆమెను స్వీకరించాల్సిందిగా శ్రీరాముణ్ణి కోరాడు.
సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు. తన శీలం యొక్క గొప్పదనాన్ని ముల్లోకాలకు చాటడానికే ఆమె అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నానన్నాడు. సీతను దగ్గరకు తీసుకున్నాడు.
పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు. దుష్టసంహారంచేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు. శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృతులైపడి ఉన్న వానరులను మళ్ళీ బతికించాడు. విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందని శ్రీరాముణ్ణి అభ్యర్థించాడు. భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావలసిందేనన్నాడు శ్రీరాముడు. వానరులను వాళ్ళ స్వస్థానాలకు వెళ్ళమనిచెప్పి, విభీషణుని వీడ్కోలు అందుకున్నాడు. పుష్పకవిమానంలో అయోధ్యకు బయలుదేరాడు. దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపుతున్నాడు. భరద్వాజాశ్రమాన్ని సందర్శించారు. శ్రీరామాజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి, గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు. వాళ్ళెంతో ఆనందించారు.
పుష్పక విమానంలో నందిగ్రామం చేరుకున్న సీతారామలక్ష్మణులకు భరతుడు, ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సీతారామలక్ష్మణులు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వశిష్ఠుల పాదాలకు ప్రణామాలు అర్పించారు. భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు. భరతుణ్ణి ప్రేమతో అక్కున జేర్చుకున్నాడు శ్రీరాముడు,
అంగరంగవైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది. యువరాజుగా ఉండాల్సిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కాని అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశాడు. యజ్ఞయాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు. ప్రజలను కన్నబిడ్డలా చూసుకుంటున్నాడు. ఎలాంటి ఈతిబాధలూ లేవు. అందరూ ధర్మబద్ధంగా నడచుకొంటున్నారు. ఇలా పదకొండువేల సంవత్సరాలకాలం ప్రజానురంజకంగా పరిపాలించాడు.
శ్రీరాముడు. అందుకే 'రామరాజ్యం' అన్న మాట నేటికీ ఆదర్శమై నిలచింది.
శ్లో॥ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే! చక్రవర్తి తనూజాయ - సార్వభౌమాయ మంగళమ్||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి