అద్భుతమైన సెలవులు

 అద్భుతమైన సెలవులు


సెలవులు వచ్చాయంటే పిల్లలందరికి ఎంతో సంబురం! అమ్మమ్మ తాతయ్యల దగ్గరకో... మరో చుట్టాల దగ్గరకో వెళ్ళాలని తాపత్రయం... సెలవులను హాయిగా గడపాలని అనుకుంటారందరూ... సెలవుల్ని అందరికీ ఉపయోగపడేలా గడపాలని కొందరే అనుకుంటారు... అలాంటి కొందరు పిల్లలు తమ సెలవుల్లో ఎవరికి ఎట్లా సాయపడ్డారో పాఠంద్వారా తెలుసుకుందాం!


అవి శీతకాలపు సెలవురోజులు, సుశీల్, సునీత, సాగర్లకు చాలా విసుగ్గా ఉన్నది. ఇంట్లోనే ఉంటూ కలసి ఆడుకోవటం తప్ప వేరే పనే లేదు. ఏ మాత్రం సాహసోపేతంగా గానీ, ఉత్సాహంగా గానీ లేని పని అది. వాళ్ళ స్నేహితులు చాలామంది వాళ్ళ అమ్మానాన్నలతో బంధువుల ఊళ్ళకు వెళ్ళారు. ఈసారి వీళ్ళ నాన్నకు చాల పని ఉండడంవల్ల ఇదివరకటివలె కొత్త ప్రదేశాలు చూడడానికి వెళ్ళలేకపోయారు.


మెత్తలతో కొట్టుకుంటూ, ఇంట్లో పరుగులు పెడుతూ ఉంటే, వాళ్ళ పిన్ని సావిత్రి, "ఏమిటిది? వెళ్ళండి. పనికి అడ్డురాకండి," అన్నది.


అబ్బా ఇంకేం చేయాలె మేము?"


" వాళ్ళ విసుగును లెక్కపెట్టకుండా, "ఈ మెత్త తొడుగులూ, కుషన్లూ, పాడుచేయకండి, మీలాంటి పిల్లలు ఆడవలసిన ఆట కాదిది," అని గట్టిగా చెప్పింది సావిత్రి పిన్ని.


విసుగ్గా, గట్టిగా “మరి మేమేం చెయ్యాలె?" అన్నాడు సుశీల్..


"బయటికెళ్ళి ఆడుకో గూడదా?" అంటూ ఆమె సలహా ఇచ్చింది.


"మూడు రోజులుగా అదే కదా చేస్తున్నాం. నాకు చాలా విసుగ్గా ఉన్నది.


కొత్తగా, ఉత్సాహంగా లేనే లేదు.” అన్నడు సాగర్.


"ఏం చేయడానికీ తోచకపోతే వంటింట్లో నాకు సాయం చేయండి. కొత్త వంటకాలు తయారుచేద్దాం," అన్నది సావిత్రి పిన్ని.


“ఈ ఆలోచన మాకేం నచ్చలేదు.” సుశీల్, సాగర్ కలిసి అన్నారొకేసారి. “పద, బయటికివెళ్ళి ఆడుకుందాం," అనుకుంటూ ఇద్దరూ బయల్దేరారు.


వాళ్ళ వెనకే సునీత వెళ్తుంటే, "నా చిన్ని సునీతా! నువ్విక్కడే ఉండి నాకు సాయం చెయ్యాలె" అన్నది సావిత్రి పిన్ని.


"సారీ, పిన్నీ,” అంటూ, సునీత బయటికి పరుగులు పెట్టింది. లేకుంటె ఆమె బలవంతంమీద ఈ పూట వంటింటి పనులన్నీ తనొక్కతే చేయాల్సి వస్తదేమోనని భయంవేసింది సునీతకు.


పిల్లలందరూ ఇంట్లోంచి బయటికి వచ్చి లాన్లో గడ్డిని కోస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళారు. అతను “ఏమిటి సుశీల్ బాబూ! తోటపనిలో మెలకువలు నేర్చుకుంటావా?" అని అడిగాడు సుశీల్ని.


"అది కాదు తాతా," బాధగా అన్నాడు సుశీల్. “మాకందరికి సెలవులిప్పుడు. ఏం చేయాల్నో ఎవరికీ తోస్తలేదు."


"చక్కటి పూలు తెంపి మంచి పూలగుత్తి చేసి మీ అమ్మకు ఇయ్యండి. ఆమె తప్పకుండ సంతోషిస్తుంది."


"ప్స్... ఇంకేం చేద్దాం? కొన్ని పూలు కోసి చక్కటి పూలగుత్తి తయారుచేద్దాం పదండి," అన్నాడు సుశీల్. గులాబిపూలు చాలా బాగున్నవి. చామంతి పువ్వులు తాజాగా, అందంగా ఉన్నాయి. తోట వందలకొద్ది పూలతో కళకళలాడుతూ ఉన్నది. వాటిలో వేటిని తెంపాలో, మొగ్గలుగా ఉన్న కారణంగా వేటిని తెంపగూడదో తోటమాలి తాతయ్య చెప్పాడు. చక్కటి పూలగుత్తి తయారైంది. "దీన్ని చూసి సంతోషించేవాళ్ళుండే చోటికి తీసుకుపోయి ఇద్దాం! సరేనా?" అన్నాడు సాగర్.


“ఎక్కడికి?" సుశీల్ అడిగాడు.


"ముసలివాళ్ళంతా ఉండే వృద్ధాశ్రమం గుర్తుందా నీకు? ఒంటరిగా, చేసేందుకేమీ లేకుండా ఉంటరు పాపం. వాళ్ళు దీన్ని తప్పకుండా ఇష్టపడుతారు. నాకు తెలుసు"


సుశీల్ కు, సునీతకు కూడా ఈ ఆలోచన నచ్చింది. "మనకు ఉత్సాహంగా లేకపోయినా, కనీసం అది లేనివాళ్ళకు, ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఇలాంటి పనులు చెయ్యాలె." అన్నారిద్దరు.


"ఐతే, ఒకటి సరిపోదేమో, మరికొన్ని పూలు తెంపి ఇంకొన్ని పూలగుత్తులు చేస్తే బాగుంటుంది కదా!" అనుకొని ముగ్గురూ కలిసి మరికొన్ని పూలగుత్తులు తయారుచేసుకొని, పది నిమిషాల నడక దూరంలో ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళారు.


ఆశ్రమంలో ఉన్న వృద్ధుల గురించి చిన్నపిల్లలు తీసుకుంటున్న శ్రద్ధకు వాళ్ళ ముఖాల్లో సంతోషం కనిపించింది. పిల్లలకు వాళ్ళందరు కృతజ్ఞతలు చెప్పారు. వీళ్ళు ముగ్గురూ అక్కడే వాళ్ళతో పాటు కూర్చుని ముచ్చట్లాడారు. వాళ్ళలో కొంతమంది మాట్లాడకుండ కూర్చుని ఉన్నారు. మరికొంతమంది తమ బాధను దాచుకునేందుకు వాళ్ళతో మాట్లాడుతూ, పిల్లలెక్కడుంటున్నారో, ఎక్కడ చదువుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. చివరికి ఆశ్రమంలో భోజనానికి ఉండిపొమ్మని వాళ్ళు పిల్లలను బలవంతపెట్టారు. కానీ, సుశీల్ వినయంగా, “ఇంట్లో మా అమ్మ మాకోసం ఎదురు చూస్తుంటుంది" అని చెప్పాడు. రెండు రోజుల తరువాత పిల్లలు మరికొన్ని పూలు పట్టుకొని అక్కడికి వెళ్ళారు. మళ్ళీ వాళ్ళతో ముచ్చట్లు. 'పొద్దంతా ఏం చేస్తూ ఉంటా' రని వాళ్ళను సుశీల్ అడిగాడు, మాటలమధ్య. “ఏముంది? కొద్దిసేపు కూర్చుంటాం. కొద్ది సేపు దైవప్రార్ధన చేసుకుంటాం. కొద్దిసేపు మాట్లాడుకుంటాం. వృద్ధాశ్రమం భోంచేస్తాం. పండుకుంటాం.


ఈ వయసులో ఇంతకంటె ఏం చేయగలం?" అన్నారు వాళ్ళలో ఒకరు.


"అంటే కాలక్షేపానికి ఇక్కడేం లేదన్నమాట. కనీసం టీవీ కూడా?” సాగర్ ఆశ్చర్యంతో అడిగాడు. ఒక పెద్దాయన దగ్గుకుంటూ అన్నాడు “ఇదివరకొక బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. అది చెడిపోయి మరమ్మతుకు పోయింది. మళ్ళీ వెనక్కి రాలేదు. వార్తాపత్రికలు, వారపత్రికలు వస్తుంటాయి. అప్పుడప్పుడు అవి చదువుకుంటాం."


పిల్లలకు చాలా బాధ కలిగింది. సిగ్గువేసింది కూడా. తమకైతే అన్నీ ఉన్నాయి. అయినా ఎప్పుడూ ఏదో ఒకదానికీ గొడవే. ఇంటికి పోయిన తరువాత వృద్ధాశ్రమాన్ని గురించి, అక్కడుండేవాళ్ళను గురించి, కాలక్షేపం కోసం వాళ్ళకేమీ లేకపోవటం గురించి చర్చ జరిగింది. ఉంచి, కాలక్షేపం


"వాళ్ళకోసం ఒక టీవీ కానీ, రేడియో కానీ కొని పైసలన్నీ పెట్టినా, అలాంటిది ఏదీ కొనలేం" అన్నది సునీత. ఇస్తే బాగుంటుంది," అన్నాడు సాగర్. "మనం దాచుకున్న


"మనం చేయగలిగినదంతా మన పైసలతో ఓ సినిమాకో, మరోదానికో కొన్ని టికెట్లు కొనివ్వగలం అంతే!" "సినిమా... టికెట్స్..." సుశీల్ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా "అంతే!” అంటూ అరిచాడు. సునీత, సాగర్ ఒక్కసారే అడిగారు "ఏమనుకుంటున్నావ్ మనసులో నువ్వు?" అని. సుశీల్ మెరిసే కళ్ళతో అన్నాడు "మీకు తెలుసుగా! మన స్కూలు నాటకాల్లో నటించిన అనుభవం మన ముగ్గురికీ బాగా ఉన్నది. మనం వాళ్ళకోసం ఉచితంగా ఓ ప్రదర్శన ఇస్తే కనీసం వాళ్ళను ఆనందపరచి నట్లవుతుందిగా?"


సాగర్ సరేనన్నాడు. కానీ సునీతకు ఈ ఆలోచన నచ్చలే. "కేవలం ముగ్గురితోటి ప్రదర్శన ఏమంత బాగుండదు. తప్పనిసరిగ యింకా కొంతమంది కావాలి, ఇదంతా మనవల్ల అవుతుందా అని?"


“తోటమాలి తాతయ్య, సావిత్రి పిన్ని స్టేజీకి వెనక మనకు తప్పకుండా సాయంచేస్తారు. నాకు తెలుసు!" అన్నాడు సాగర్. “స్కూల్లో నితిన్ అని నాకో స్నేహితుడున్నాడు. మీకు గుర్తుంది కదా. నితిన్ ఈ నాటకంలో పాల్గొంటాడు. ఇంక కొంతమందిని తీసుకొని వస్తాడు కదా.” సునీత ఒప్పుకొంటూ ఇట్లా అన్నది. “మనం దీన్నొక ఛారిటీ షో లాగ చేస్తే బాగుంటుంది. కొన్ని టికెట్లు


ఇరుగుపొరుగువాళ్ళకు అమ్ముదాం. ఇట్లా మనం జమచేసే డబ్బుతో కనీసం రేడియోసెట్టయినా కొని ఇవ్వవచ్చుగా!”


అంతే, వెంటనే సాగర్ నితిన్ ఇంటికి వెళ్ళాడు. మరో రెండు గంటలకల్లా సాగర్ నవ్వుతూ, తుళ్ళుతూ గర్వంగా ఇంటికొచ్చి నితిన్ సాయంత్రమే తన పిన్ని ఇద్దరు కూతుళ్ళతో పాటు వాళ్ళింటికొస్తున్నాడని ప్రకటించాడు. ఇంక చేయవలసింది చాలాఉన్నది. “మరి టికెట్లెక్కడ ప్రింట్ చేయిద్దాం?" సునీత అడిగింది. "ప్రింట్ చేయవలసిన పని లేదు. మనకు తెలిసినవాళ్ళను, ఇరుగుపొరుగువాళ్ళను, ప్రదర్శనకు రమ్మందాం. తమకు తోచిన విరాళం ఇమ్మని అడుగుదాం. అంతే!" సుశీల్ విడమరిచి చెప్పాడు.


“మరి ప్రదర్శనకు చోటు ఎక్కడున్నది?"


"వృద్ధాశ్రమం ఉన్నది పెద్ద ఆవరణలో కదా! దాని పక్కనే ఆటస్థలమున్నది, అక్కడ."


ఈ ఆలోచన అందరికీ నచ్చింది. సాయంత్రం నితిన్, తన చెల్లెళ్ళు తమన్నా, వీణలతో కలిసి రాగానె, ఏ నాటకం వేయాలని చర్చించుకోవడం మొదలుపెట్టారు. నితిన్ తెచ్చిన పుస్తకాల్లో నుండి వెతికి 'గుశ్వం' అన్న  హాస్యనాటకాన్ని చేసుకున్నారు. ఎంపిక


సుశీల్ ఆరోజు రాత్రీ, మరుసటి రోజు పగలంతా కదలకుండా కూర్చుని నాటకానికి సంభాషణలు రాశాడు. మిగతావాళ్లు ఇంటింటికీ వెళ్ళి వాళ్ళను ఆహ్వానించి విరాళాలు సేకరించారు. అట్లా వాళ్ళంతా కొంత మొత్తం పోగుచేయగలిగారు.


మూడో రోజున నాటక ప్రదర్శనకు రిహార్సళ్ళు మొదలయినవి. స్కూల్లో నాటకాలు వేయటంలో మంచి అనుభవమున్న నితిన్ ఈ నాటకానికి దర్శకత్వం వహించాడు. ప్రదర్శనకు ముందు వారం రోజులు ఎట్లా గడిచి పోయాయో వాళ్లకే తెలియలేదు. ప్రతి రోజూ కనీసం మూడు గంటలు రిహార్సళ్ళు చేసేవాళ్ళు. తక్కిన రోజంతా స్టేజి ఎట్లా ఉండాలి, దుస్తులెట్లా


ఉండాలి, ఇరుగుపొరుగువాళ్ళనెట్లా ఆహ్వానించాలి. ఇట్లాంటి విషయాలను గురించిన చర్చలే.


చివరికి ప్రదర్శన రోజు రానే వచ్చింది. అంతకు ముందురోజే వృద్ధాశ్రమం నిర్వహించే మేనేజరు దగ్గరి నుంచి అనుమతి తీసుకొనేటందుకు పోయారు. ఆయన ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అక్కడి వృద్ధులకు ఆశ్చర్యం కలిగేలా ఒక్కరోజు ముందు మాత్రమే వాళ్ళకోసం తాము వేస్తున్న నాటకాన్ని గురించి చెప్పారు. ప్రదర్శన రోజున పొద్దుటినుంచే పిల్లలు తమకోసం వేస్తున్న నాటకంకోసం ఆ ఆశ్రమంలోనివాళ్ళంతా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.


కర్రలు, కర్టెన్లతో వరండాలో స్టేజీ తయారు చేసుకున్న తరవాత ఎదురుగా ఉన్న ఆటస్థలంలో ప్రేక్షకుల


కోసం బల్లలు, కుర్చీలు వంటివి వేయటం జరిగింది. వందమంది కూర్చునేందుకు వీలుగా ఆశ్రమంలోనుండి


కొన్ని, ఇరుగుపొరుగు ఇళ్ళలోనుండి కొన్ని, తమ ఇళ్ళనుండి కొన్ని కుర్చీలు సేకరించి తెచ్చారు.


ప్రదర్శన బ్రహ్మాండంగా జరిగింది. పిల్లలు అద్భుతంగా నటించారని అందరూ అభినందించారు. నాటకంలోని హాస్య సన్నివేశాల్లో అందరూ విరగబడి నవ్వుతూ ఆనందించారు.


నాటక ప్రదర్శన తర్వాత తాము 800 రూపాయలు విరాళాల ద్వారా సేకరించామని, దానికి తాము పొదుపుచేసి దాచుకున్న డబ్బులు కలిపి రేడియోతో పాటు ఒక టేప్స్ రికార్డర్ కూడా వృద్ధాశ్రమానికి కొని ఇవ్వగలుగుతున్నామని సుశీల్ ప్రకటించాడు. ఈ సెలవులను ఇట్లా పెద్దవాళ్ళ ఆనందంకోసం వినియోగించిన పిల్లలను చూసి వృద్ధులంతా చాలా ఆనందించారు. అందరినీ దీవించారు.


మూలం : నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జననీ శివకామిని telugu song lyrics janani shiva kamini

telavarithe evare evere song lyrics in telugu film premam తెలవారితె కనురెప్పల

Keeravaani song lyrics film by Anveshana